అయ్యప్ప - పులి మరియు గుర్రం వాహనాలు

P Madhav Kumar


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*అయ్యప్ప స్వామిని… *

*పులి వాహనరుడు అని అంటారు కదా…!*

*మరి అయ్యప్పస్వామి వాహనం..*

*గుర్రం ఎందుకు అయ్యింది?*

              ➖➖➖✍️



*#ఏ దేవాలయములోనైనా మూల విరాట్టుకు( దేవునికి) ఎదురుగా ధ్వజస్థంభము వుంటుంది. అట్టి ధ్వజస్థంభము మొదట్లో కాని పైన గాని , ఆదేవునికి సంబంధించిన వాహనము గాని బంటు(సేవకుడు) గాని వుంటారు. ఉదాహరణకు: - విష్ణు ఆలయం గరుత్మంతుడు, శివాలయంలో నంది, రామాలయంలో హనుమంతుడు వుంటారు.*


*#అయ్యప్పస్వామి వారి ఆలయంలో ధ్వజస్థంబముపై స్వామివారి వాహనమైన అశ్వము వుంటుంది. శ్రీ అయ్యప్పస్వామి పులివాహనుడని కీర్తించ బడుతున్నాడు. కాని వారి వాహనము గుఱ్ఱము .*


*#వాడుక భాషలో పిలిచే గుఱ్ఱమునకు 1. అశ్వము, 2. హయము, 3. హరి, 4. వాజీ, 5. తురగము అనే పేర్లుకూడా వున్నాయి.*


*#మనిషి యొక్క మనస్సు చంచల స్వభావము కలది. అది విషయవాసనలు, కోరికల వెంట గుఱ్ఱము వలె పరుగులు తీస్తూవుంటుంది. దాని వేగమునకు అంతేలేదు. అది మనకు తెలియకుండానే మన స్వాధీనములో లేకుండా పరుగులు తీస్తూవుంటుంది.*


*#తన స్వాధీనములో లేని గుర్రమును స్వాధీన పరచుకొని, సరియైన మార్గమున, తనకు కావలసిన, తనకు నచ్చిన మార్గమున నడిపించ గలిగినవాడే అసలైన రౌతు.*


*#ఆ ప్రకారంగా మనస్సు అను గుర్రమునకు స్వామి (భగన్నామము ) నామము అను కళ్ళెము వేసి, దాని వేగమును నిరోధించి, స్వాధీనపరచుకొని భక్తిమార్గమున నడిపించి స్వామివారిని చేరవలయున్నదే పరమార్ధము.*


*#స్వామివారికి జితేంద్రియుడు అను నామము కూడా వున్నది.* *జితేంద్రియుడనగా ఇంద్రియము ( పంచజ్ఞానేంద్రియములు +పంచకర్మేంద్రియములు , మనస్సు, బుద్ధి) లను జయించిన లేక స్వాధీన పరచుకున్న వాడని అర్ధము.*


*#ఇంద్రియములను జయించినవారు ఎవరైనా( దేవునితో ) స్వామితో సమానము.*

*అనగా భక్తుడు భగవంతుడు ఒక్కటౌతున్నారు . జీవాత్మ పరమాత్మలో కలిసి పోతున్నాడు. కనుక భగవంతునితో , అయ్యప్పస్వామితో సమానంగా స్వామీ అని పిలిపించుకొనుటకు అర్హుడౌ తున్నాడు.*✍️

*స్వామియే శరణo అయ్యప్ప*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat