దైవం విషయంలో మూఢ నమ్మకాలు ఎలా ఏర్పడుతున్నాయి

P Madhav Kumar



*"బయట మనం పూజించే పటంకానీ, విగ్రహంగానీ, బొమ్మగాని అవి మనలోని దైవానికి ప్రతిబింబాలు అన్న విషయం తెలియక పోవడంవల్ల దైవం విషయంలో అనేక మూఢనమ్మకాలు, భయాలు ఏర్పడుతున్నాయి.* 


*దైవం ఏమిటో నిజంగా అర్థమైతే ఇలా ఏర్పడే భయాలు తొలగిపోతాయి.*


*మనకు ఏకష్టం వచ్చినా భగవంతుడితో విన్నవించుకుంటాం. మనం పూజించే దేవుని రూపానికి మన కష్టాలను ఏకరువు పెడతాం.*


*మనం బయట పూజించే ఏ రూపమైనా, మనలోని పరమాత్మకు ప్రతిరూపమేనన్న సత్యం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.*


*అప్పుడు నాలో ఉన్న దైవమే నన్ను అనుగ్రహిస్తుందని తెలిసి స్వాంతన కలుగుతుంది.*


*బయట ఏ విగ్రహంగా భగవంతుని చూస్తున్నామో, ఆ రూపం ముందుగా మనలోనే ఉంది. లోపల ఉన్న దైవమే మనల్ని అనుగ్రహిస్తుంది !"*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                   

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat