*పూర్వజన్మలో ఎవరు?
*శ్రీ కృష్ణుణ్ణి కన్నతల్లిదండ్రులూ పెంచిన నందయశోదలూ పూర్వజన్మలో ఎవరు ?*
*వాళ్ళ వృత్తాంతం మనము తెలుసుకుందాం..*
*శ్రీకృష్ణునికి జన్మనిచ్చినతల్లిదండ్రుల పెంచిన నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతాలు సంస్కృత భాగవతం లోనూ పోతన భాగవతంలోనూ మరికొన్ని పురాణాలలోనూ ఉన్నాయి.*
*ముఖ్యంగా సంస్కృత ఆంధ్ర భాగవతాల్ని బట్టి తెల్పుతున్నాయి*
*కన్నతల్లిదండ్రులు దేవకివసుదేవులు పెంచినతల్లిదండ్రులు యశోద నందుడు*
*దేవకీవసుదేవుల పూర్వజన్మవృత్తాంతాలు :*
*స్వయంగా శ్రీకృష్ణుడే దేవకీదేవికి వివరించాడు.*
*”అమ్మా! స్వాయంభువ మన్వంతరంలో పూర్వజన్మలో నీవు పృశ్నివి వసుదేవుడు పరమ పవిత్రుడు. దైవసుతుడు అనే ప్రజాపతి ప్రజాసృష్టికోసం బ్రహ్మ ఆదేశంతో తీవ్రతపస్సు చేశారు, నన్ను12 వేలదివ్యసంవత్సరాలు ఆరాధించారు.*
*నేను వరం కోరుకోండని మిమ్ము అడిగాను.*
*మీరు నావంటి పుత్రుణ్ణి కావాలని కోరారు॥*
*వరం అనుగ్రహించి వెళ్ళాను॥*
*పిదప నేను నీ గర్భంలో జన్మించాను.*
*పృశ్నిగర్భుడనే పేరొందాను.*
*తర్వాతియుగంలో
*అదితికశ్యపులకు పుత్రుణ్ణి అయ్యాను.*
*అప్పుడు పొట్టిగా ఉన్నందున వామనుడనీ ఇంద్రుని తమ్ముణ్ణి కనుక ఉపేంద్రుడనీ పేరొందాను.*
*ఈ యుగంలో మూడవమారు మీగర్బంలో పుత్రుడుగా అవతరించాను ఇది సత్యం!*
*నా పూర్వజన్మల్ని మీకు గుర్తు చేయడానికే ఈ విష్ణురూపాన్ని చూపాను అని వసుదేవుడు పూర్వజన్మలో కశ్యపుడు ఇతనిభార్యలు అదితి, సురస, ఈ యిద్దరే దేవకిగా, రోహిణిగా, జన్మించారు.*
*ఆ జన్మలో కశ్యపుడు సముద్రుని హోమధేనువును తెచ్చాడు.*
*సముద్రుడు తిరిగి ఇమ్మని కోరితే కశ్యపుడు నిరాకరించాడు. కోపించిన సముద్రుడు కశ్యపుణ్ణి గోపాలకుడుగా జన్మింతువు గాక అని శపించాడు.*
*అందువల్ల వసుదేవుడు కంసుని గోసంపదకు పాలకుడయ్యాడు.*
*నందయశోదల వృతాంతం :*
*వసువులు అనే దేవతలలో ధర, ద్రోణుడు, అనేవారు దంపతులు బ్రహ్మదేవుడు వీరిని భూలోకంలో జన్మించండని ఆదేశించారు.*
*అందుకు వాళ్ళు … “దేవా ! విశ్వేశ్వరుడైన విష్ణుదేవుణ్ణి సేవించేభాగ్యం ప్రసాదిస్తే అట్లేజన్మిస్తాము!” అని ప్రార్థించారు.*
*బ్రహ్మదేవుడు ఆమోదించాడు.*
*ఆ ద్రోణుడే ఈ నందుడు, ఆ దర యే ఈ యశోద!*
*శ్రీహరికూడా బ్రహదేవునిమాట మన్నించి ఈ దంపతుల్ని తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తిశ్రద్దలతో గౌరవించాడు.*
*భగవంతుడు కొడుకుగా పుట్టాలన్నా కొడుకుగా ఒకయింట పెరగాలన్నా ఆ దంపతులు తపస్సంపన్నులూ మహాభక్తులు అయి ఉండాలి. అట్టివాళ్లని భగవంతుడు ముందుగానే ఎంచుకొని వారికి పుత్రుడై పుట్టి వాళ్లవద్ద పెరిగి వాళ్ల ఆశయాన్ని తన ఆశయాన్ని సఫలం చేస్తాడు, సఫలం చేసుకొంటాడు.*
*’జన్మాంతర పుణ్యసంస్కారం లేనివాళ్ల గర్భంలో భగవంతుడు పుట్టడు! భగవంతునికి జన్మయిచ్చే యోగ్యత వాళ్ళకు ఉండి తీరాలి!’ అనే గొప్పసందేశం ఇదియే!*
*శ్రీకృష్ణుని తల్లిదండ్రుల పూర్వజన్మ వృత్తాంతాల ద్వారా లోకానికి అందించబడింది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖