గణేశుని ఆలయాలు

P Madhav Kumar

రామాలయం లేని గ్రామము ఉండదని నానుడి. ఆచరణలో రామాలయం లేని గ్రామము ఉండవచ్చేమో కానీ వినాయక ఆలయం లేని గ్రామంకానీ పట్టణంకానీ కానరాదు .ప్రధమపూజ్యుడు అయిన వినాయకుడుని పూజించనిదే హిందువులు ప్రారంభించే ఏ పూజకానీ కార్యక్రమం కానీ ప్రారంభంకాదు. గణేశుని ఆలయాలు దేశంలో అనేకం ఉన్నవి. హిందువులు ప్రతి సంవత్సరం వినాయక చతుర్ధినాడు వాడవాడలా గణేశుని నెలకొల్పి నవరాత్రులు గణేశుని వివిధ పరిమాణాలలోనూ, వివిధ అలంకారములతో మరియు వివిధ రూపాలతో పూజిస్తారు. గణేశుని గణేశ్ మహరాజ్ అని ఉత్తరాదిలో, వినాయగర్, గణపతిపేర్లతో దక్షణాదిలో, గణనాయక, గణాధ్యక్ష, విఘ్నరాజ మొదలైన ఏకాదశ నామములలో తెలుగు రాష్ట్రములందు స్థానికముగా వినాయకుడని పిలుస్తారు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా గణేష్ ఆలయాలు ఉన్నాయి మరియు పురాణాలలో ప్రముఖంగా పేర్కొన్న ముఖ్యమైన స్వయంభూ గణేష్ ఆలయాల వివరాలను మేము ఉటంకిస్తున్నాము.


ముండ్కతియా వినాయకుడు    

గణేశుడు విశ్వంలో ఉన్నఆలయాలలోని మూర్తులకు భిన్నముగా ఉత్తరాఖండ్రా ష్ట్రములో కేదార్నాధ్ జ్యోతిర్లింగ సమీపంలో గౌరీకుండ్ వద్ద ముండ్కతియా అనుచోట తలలేకుండా కేవలం మొండెంతో దర్శనం ఇస్తాడు. బహుశా జనబాహుల్యానికి దూరంగా ఉండటం తలలేని గణేశుని ప్రతిమవలన ఈఆలయం అంత ప్రాచుర్యానికి నోచుకోలేదు. గౌరీకుండ్ వద్ద శివునిరాకకు ముందు స్నానంచేయుటకు పార్వతి తనశరీరముపైనున్న నలుగుపిండితో బొమ్మ తయారుచేసి ఆబొమ్మకు ప్రాణముపోసి సరస్సునకుముందు తనకు రక్షకునిగా నిలపెట్టినది. మహాశివుడు పార్వతిని కలియుటకువచ్చి గణేశునిచే నిరోధించబడ్డాడు. శివుడు ఆగ్రహముచెంది త్రిశూలంతో గణేశుని తలను నరకివేయుట వలనపార్వతి దుఃఖితు రాలైనది. ఆమె గణేశుని తిరిగిబ్రతికించమని బలవంతంచేయగా, శివుడు గతంలో గజాసురుని వధించినప్పుడు ఆతనిశిరస్సు లోకపూజ్యమగుణని వరము ఇచ్చియుండుటవలన గజాసురుని శిరస్సు బాలుని మొండెం నకు జతచేసి పునర్జీవితుని చేసినాడు. ఆతలలేని వినాయక స్వరూపమే ముండ్కతియా వినాయకుడు.                          


ఆదిశయ వినాయగర్ 

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలో ఉన్న ఆదిశయ వినాయగర్ దేవాలయం గణేశుడి అద్భుత లక్షణాలతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి. ఆలయంలోని గణేశునివిగ్రహం రెండువేల ఐదువందల సంవత్సరాల నాటిదని నమ్ముతారు. కేరళపురం రాజు 7వ జ్యోతిర్లింగమైన రామేశ్వరం దర్శనానికి వెళ్ళాడు. రాజు కాళ్లు చేతులు కడుక్కుంటూఉండగా నదిలో గణేష్ విగ్రహం కనిపించింది. రాజు ఆవిగ్రహాన్ని రామేశ్వరం రాజు సేతు మన్నన్‌కి బహూకరించాడు. ఆఅందమైన బహుమతిని చూసి సేతు మన్నన్‌ సంతోషించాడు. అతను గణేష్ విగ్రహంలో అద్భుతాన్ని కనుగొని విగ్రహం తనకు దొరికినందున ఆవిగ్రహాన్ని తనవద్ద ఉంచుకోమని కేరళపురం రాజును అభ్యర్థించాడు. సేతు మన్నన్‌ మరకతం పొదిగిన పెద్ద గణేష్ విగ్రహాన్నికూడా కేరళపురం రాజుకు బహుకరించాడు. రాజు విగ్రహాలతో తన స్థలమైన కేరళపురం బయలుదేరాడు. దారిలో రాజుపై దోపిడీ దొంగలు దాడిచేసి మరకతం పొదిగిన విగ్రహాన్ని అపహరించారు. నదిలో రాజుకుదొరికిన గణేష్ విగ్రహాన్ని తరలించడంలో దోపిడీదొంగలు విఫలమయ్యారు. దోపిడీ దొంగలు విగ్రహాన్ని అక్కడేవదిలేసి పారిపోగా భక్తులచే ఆగణేశుడు పూజలందుకుంటుంన్నాడు.


ఆది వినాయకర్ 

తమిళనాడు రాష్ట్రంలోని పూంతోట్టం గ్రామంలోఉన్న అరుల్మిగు ముక్తీశ్వర్ ఆలయంలో ఆదివినకాయర్ రూపంలో గణేశుడికి మరొక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈఆలయం సుమారు 1400 సంవత్సరములకు పూర్వం నిర్మించ బడింది. ఇతరఆలయాలవలే కాకుండా ఈఆలయంలో గణేశుడు మానవ ముఖంతో తొండంలేకుండా కనిపిస్తాడు. ఈఆలయంలోని గణేశుడిని “ఆది వినకాయర్” అని పిలుస్తారు. ఆలయం ముక్తీశ్వర్ రూపంలోఉన్న శివునికి సంబంధించినది కానీ ఈఆలయం గణేష్ ఆలయంగా ప్రసిద్ధిచెందింది. ఆలయంఉన్న ప్రదేశం పూర్వపు తిలతర్పణపురి పేరు కంటే ప్రస్తుత సీతలపతి పేరుతో గుర్తించబడుతున్నది.


స్వయంభూః లక్ష్మీగణపతి బిక్కవోలు   

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరిజిల్లాలో ప్రధానకేంద్రము కాదినాడ నుండి 33 కి.మీ. రాజమహేంద్రవరమునుండి 40 కి.మీ. దూరంలో బిక్కవోలు గ్రామంలోలోఉన్న శ్రీలక్ష్మి గణపతి దేవాలయం విశిష్టమైనది. బిక్కవోలునందలి శ్రీ లక్ష్మీగణపతి ఎంతోప్రాముఖ్యత కలిగినవాడు శాసనాలప్రకారం సుమారు పద్నాలుగువందల సంవత్సరములకు పూర్వము చాళుక్యుల కాలములో నిర్మితమైన ఈఆలయం మహమ్మదీయ పాలనలో భూస్థాపితంఅయిపోయింది. సుమారు వందసంవత్సరములకు పూర్వము బహిర్గతమై విగ్రహంపెరుగుతూ ఉండడం ఆలయములో గమనించతగిన అత్యుత్తమ అద్భుతం. ఇక్కడవినాయకుడు ప్రతిసంవత్సరం సుమారు అంగుళం లేదా రెండుసెంటీ మీటర్లు పెరుగుతూ ఉంటాడని మరియు స్వామివిగ్రహం చిన్నకొబ్బరి కాయ ప్రమాణమునుండి మరియు ప్రస్తుతం కొన్నిఅడుగుల ఎత్తుకుపెరిగి ప్రస్తుతం 90 అం ఎత్తు మరియు 50 అం వెడల్పు కలిగియున్నది అనికధనం.  


దొడ్డ గణపతి

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు బసవగుడిదక్షణ ప్రాంతమున కొలువైన శక్తిగణపతి మరియు సత్యగణపతిఅని పిలువబడు దొడ్డగణపతి ఆలయం ప్రత్యేకత సంతరించుకొన్నది. దొడ్డగణపతిగ కుడివైపు పెరుగుతూ ప్రస్తుతపరిమాణం నకుచేరుకొన్న ఏకశిలా గణపతి. విజయనగర రాజవంశములోని కేంపేగౌధ అనబడు నాధప్రభు హిరియా కేంపేగౌధ అనువారు వాహ్యాళి చేయునప్పుడు అనేకశిలలు వాటిలో ఒక బండరాతిపై వినాయకుని ఆకారం కనుగొని,శిల్పులను భారీ ఆకారంతో మరియు అద్భుతమైన ఏకరాతి విగ్రహంగా మార్చమని ఆదేశించారు అనితెలుస్తూంది. కర్ణాటకలోని అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఈదొడ్డగణేశ ఆలయంనందు చూడవచ్చు. దొడ్డ అనగా కన్నడభాషనందు పెద్దఅనిఅర్ధం. దొడ్డగణేశ అనగా పెద్దగణేశుడు అన్నభావం వ్యక్తీకరిస్తుంచి. ఆలయములో పద్దెనిమిది అడుగుల ఎత్తుతో పదహారుఅడుగుల వెడల్పుతో గణేశుడు దర్శనం ఇస్తాడు.


స్వయంభూః సిద్ధివినాయకుడు     

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరిజిల్లా అయినవిల్లి గ్రామమునందలి స్వయంభూః శ్రీసిద్ధివినాయక ఆలయం ఎంతోప్రాముఖ్యం కలిగియున్నది. ప్రస్తుతకలియుగానికి మూడు యుగాలముందు కృతయుగంనుండే ఈఆలయము ప్రాచుర్యంలోనున్నట్లు కధనం. ఈక్షేత్రంగురించి గ్రంధములందు వివరించబడి యుండలేదు. 800సంవత్సరములకు పూర్వము శంకరభట్టుఅను సంస్కృత పండితునిచే వ్రాయబడిన దత్తాత్రేయఅవతారమైన శ్రేపాదశ్రీవల్లభచరిత్ర అనుగ్రంధములో ప్రస్తావించబడినది. మల్లాది భావన్నారాయణ అవధానుల ఆధ్వర్యమునందు అయినవిల్లిగ్రామంలో స్వర్ణమహాగణపతియజ్ఞం నిర్వహించబడినట్లు యాగముచివర స్థానికపండితులు వినాయకుడు హోమద్రవ్యాలను తనతొండంతో స్వీకరించాలని, గణపతి స్వర్ణమయాకాంతులతో దర్శనంఈయవలెనని వాదించారు. అపుడు వినాయకుడు హొమగుండములోని బూడిదనుండి మానవరూపముతో పిమ్మట మహాగణపతిగా దర్శనమిచ్చి పండితుల కోరికమేరకు స్వర్ణగణపతిగా హోమద్రవ్యాన్ని తనతొండముతో గ్రహించాడని స్థలపురాణం.


స్వయంభూః వరసిద్ధి వినాయకుడు 

దేశములోని చారిత్రకనిర్మాణ ఆలయమలందు కాణిపాకం వినాయకఆలయంగా ప్రసిద్ధమైన స్వయంభూః వరసిద్ధి విఘ్నేశ్వరఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరుజిల్లా తిరుపతికి 75 కి.మీ. దూరంలోఉన్నది. కాణిపాకం వరసిద్ధివినాయకుని చరిత్రకు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అయినవిల్లినందు స్వయంభూః గావెలసిన సిద్ధివినాయకుని చరిత్రకు దగ్గర సంబంధమున్నది. రెండు ఆలయములు స్వయంభూః ఆలయములే. స్థలపురాణము ప్రకారం కాణిపాకం గ్రామమునందు పుట్టుకతో గుడ్డి, మూగ, చెముడు వైకల్యంకల ముగ్గురు సోదరులు విహారపురి గ్రామము ప్రస్తుతం కాణిపాకంనకు దగ్గరగా వారికిగల స్వల్పభూమినందుకల నేలనూతినుండి నీరుతోడుకొని సాగుచేసుకొనుచూ నిరాడంబరముగా జీవించేవారు. ముగ్గురు సోదరులలో ఇద్దరు బావినుండి నీటిని తోడుచుండగా మూడవవాడు భూమికి నీరు పోసేవాడు. ఒకసంవత్సరం కరువువచ్చి వర్షములుపడక భూగర్భజలము క్షీణించి బావినందునీరు ఎండిపోయి వారు నిరాశకు గురయ్యారు, వారిలో మూగవాడు బావినందు దిగి గడ్డపారతో ఇసుకను మట్టిని తీసివేయుట ప్రారంభించగా మిగిలిన ఇరువురు ఇసుకను మట్టిని భూమిపైకి చేరవేయ సాగారు. పిమ్మట మూగవాని గెడ్డపార నీటిఅడుగున ఉన్నరాతికి గట్టిగా తగిలింది. రాతినుండీ రక్తముచిమ్మి బావిలోని నీటితో కలసిపోయినది. రక్తము తగిలిన మూగవాడు చిత్రముగా మాట్లాడుట ప్రారంభించాడు. చెవిటివానిదేహము ఆనీటితో తడిసి అతను వైకల్యమునుండి విముక్తుడైనాడు. గుడ్డివాడు నూతిలోనికి సోదరుల సహాయముతో దిగి రాతిని స్పర్శించుటవలన వాని గుడ్డితనము మాయమై చూపువచ్చినది.ఈవార్త గ్రామస్తులకు తెలిసి బావినుండి ఆరాతిని బయటకుతీయుటకు ప్రయత్నించారు. రాతినికదల్చు వారిప్రయత్నము ఫలించకపోయినా ఆరాయి స్వయంభూః వరసిద్ధి వినాయకునిగా బయల్పడినది.


కమండల గణపతి

కర్ణాటక రాష్ట్రం చిక్కమగులూరు జిల్లా కొప్ప తాలూకాలో కేసవే గ్రామంలో. కమండల గణపతి దేవాలయం చిన్నదైననూ ఆలయం చారిత్రిక ప్రాముఖ్యతకలిగి సుమారు వేయి సం.లకు పూర్వం నిర్మితమైంది. స్థలపురాణ ప్రకారం శని వక్రదృష్టి కారణంగా శివుని భార్య పార్వతీదేవి అనేక సమస్యలను ఎదుర్కొన్నది. అందువల్ల పార్వతి శనికలిగించు భాధలు భారంగా భావించింది. దేవతలు పార్వతీదేవిని భూలోకం’ నందు శనిగురించి తపస్సు చేయమని సలహా యిచ్చారు. పార్వతి తపస్సు చేయడానికి భూమిపై తగిన ప్రదేశంకోసం వెతకి ప్రస్తుత ఆలయానికి 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న ‘మృగవధే’ అనుప్రదేశం తనతపస్సుకు అనువైనదిగా భావించింది. అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు సృష్టించబడ్డాడని పురాణం తెలుపుతున్నది. తన తపస్సుకు ఆటంకం కలగకుండా శని దోషం పోగొట్టుకోవడానికి పార్వతీ దేవి గణపతిని ప్రతిష్ఠించింది. పార్వతీదేవికి కలిగిన ‘శనిదోషం’ ఈఆలయం వల్ల పరిష్కరించబడింది.        


స్వయంభూ గణపతి రత్నగిరి



మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో రత్నగిరి జిల్లాలో గణపతిపూలే పట్టణంనుండి ఒక కి.మీ దూరంలో అరేబియా సముద్రతీరంలో ఉన్న స్వయంభూ గణపతి ఆలయం పర్యాటకప్రదేశం. ఆలయానికి సంబంధించిన పురాణంప్రకారం 1600 సం.లకు పూర్వం ప్రస్తుతం ఆలయం ఉన్నప్రాంతంలో బాల్భట్జీ భిడే అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. భిడే ఒకసమస్యను ఎదుర్కొన వలసివచ్చి సమస్యనుండి విముక్తి పొందెందుకు ఉపవాసం ఉండటానికి నిశ్చయించు కొన్నాడు. భిడే అడవినందు గణేశునిగురించి తపస్సు చేసాడు. భిడేకి గణేశుడు కలలో కనిపించి తాను తన భక్తుల కోరికలను తీర్చడానికి గులేవచ్చాననీ, కొండ తనప్రతిరూపమని తనను పూజించినట్లయిన కష్టాలన్నీ తొలగిపోతాయి అని తెలిపాడు. భిడేఆవులందు ఒకఆవు పాలు ఇవ్వడం మానేసింది. పశువులకాపరి ఆవుపై నిఘాఉంచి, ప్రస్తుతం గణేశుని విగ్రహంఉన్న ప్రదేశంలో పొదుగునుంచి పాలుకారడం చూసి ఆశ్చర్యపోయాడు. పశువులకాపరి భిడేకి జరిగిన సంఘటన చెప్పాడు. భిడే ఆప్రదేశం శుభ్రంచేస్తూ గణేశుని విగ్రహంచూసి మందిరాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించాడు. గణపతిపూలే నందు ‘పూలే’ అంటే ఇసుకతిన్నెలు. గణేశుడు ఇసుక తిన్నెలనుండి ఉద్భవించినందున ఈ ప్రదేశానికి గణపతిపూలే అనేపేరు వాడుకలోనికి వచ్చింది.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat