ఏడు మోక్ష పుణ్యక్షేత్రాలు
పురాణప్రవచనం ప్రకారము అఖండ భారతావనియందు అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాశి, కాంచీపురం, ఉజ్జయిని మరియు ద్వారక అను దివ్యక్షేత్రములు సప్తముక్తి క్షేత్రములుగా భారతదేశంయొక్క ప్రాదేశిక పరిధిలో ఉన్నాయి. ఈ ప్రదేశాలకు తీర్థయాత్ర భాషా మరియు సాంస్కృతిక వైవిధ్యం ఉన్నప్పటికీ, దేశంలోని అన్నీరాష్ట్రముల ప్రజలమధ్య ఐక్యతను బాగా పెంచుతుంది. ఏడు పవిత్ర పట్టణ కేంద్రాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో రోడ్డు, రైలు మరియు వాయు రవాణా ద్వారా బాగా అనుసంధానించబడి ఉన్నాయి. సప్తపురి అనునవి హిందూమతంలో భక్తులకు జననమరణ చక్రంనుండి విముక్తి అనుగ్రహించి మోక్షాని ప్రసాదించే ఏడు పవిత్ర తీర్థ స్థలాలు, విష్ణుమూర్తి రామునిగా అవతరించిన అయోధ్య లేదా అయోధ్యాపురి, విష్ణుమూర్తి కృష్ణునిగా మధుర లేదా మధురాపురి, ఆదిశక్తి మాయాదేవి రూపములో హరిద్వార్ లేదా మాయాపురి నందు, పరమశివుడు విశ్వనాధునిగా వారణాశి లేదా కాశీపురంలో, దుర్గాదేవి కామాక్షీరూపంలో కాంచీపురం లేదా కాంచీపురినందు, పరమశివుడు మహాకాళేశ్వర రూపంలో ఉజ్జయిని అను అవంతికపురం నందు మరియు విష్ణువు శ్రీకృష్ణునునిగా ద్వారక అను ద్వారకాపురి అనునవి తీర్ధములుగా చెప్పబడినవి. సప్తపురి అనునవి ఆధ్యాత్మిక గురువుల జన్మస్థలాలు మరియు దైవం అవతారాలుగా వెలసిన ప్రదేశాలు.
రాముడు జన్మించిన అయోధ్య, మరియు నిత్య తీర్థాలుగా పరిగణించబడే వారణాసి మరియు హరిద్వార్ యుగాలనుండి ఆధ్యాత్మిక శక్తులను కలిగిఉన్నాయి. కాంచీపురం మాతృదేవతకు అంకితం చేయబడిన కామాక్షిదేవి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. మహాభారత ఇతిహాసం ప్రకారం, మథురను విడిచిపెట్టిన తర్వాత, శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించినాడు. శివుడు (కేదార్నాథ్) మరియు మహావిష్ణువుల (బద్రీనాథ్) పుణ్య క్షేత్రాలు కల ఉత్తరాఖండ్ రాష్ట్రమునకు హరిద్వార్, ప్రవేశ ద్వారం వంటిది. పవిత్రమైన గంగానది ఈప్రదేశంలోని పర్వతములలో ఉద్భవించి మైదాన ప్రాంతములకు ప్రవహిస్తూంది. వారణాశి మోక్షస్థానమని విశ్వసించే ఈక్షేత్రంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. హిందూమతంనందు వారణాశినందు విశ్వేశ్వర తదితర ప్రధాన దేవాలయాలను జీవితంలో దర్శించాలి అని తలచెదరు.. అవంతి అనే పురాతన పేరుతో పిలువబడే ఉజ్జయినినందు మహాకాళేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటి.
ఈనగరాల్లో ప్రతిఒక్కటి కూడా అద్భుతమైన మేళాలు లేదా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. హరిద్వార్ మరియు ఉజ్జయిని ప్రతి 12 ఎండ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు ప్రసిద్ధి చెందాయి. కాంచీపురంలో కామాక్షి కళ్యాణోత్సవం ఒక ప్రత్యేక ఉత్సవం. సాధారణంగా ప్రతిసంవత్సరం ఆగస్టు నెలలోవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి ద్వారక మరియు మధురలో ఒక ప్రత్యేక ఉత్సవంగా నిర్వహిస్తారు.
అయోధ్య
Ayodhya- Sree Rama Ghat
మధుర
Mathura Shri Krishna Janmasthan Temple
హరిద్వార్
Evening-view-Har-ki-Pauri,_Haridwar
వారణాశి
Varanasii
కాంచీపురం
ఉజ్జయిని
ద్వారక
Shree-Dwarkadhish-temple
ద్వారక