🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 అర్థానామార్జనే దుఃఖం
ఆర్జితానాం చ రక్షణేl
ఆయే దుఃఖం వ్యయే దుఃఖం
ధిగర్థం దుఃఖభాజనమ్ll
*– _పంచతంత్రం_–*
తా𝕝𝕝 *ధనమును సంపాదించుట కష్టం.... సంపాదించిన ధనమును రక్షించుట కూడా కష్టమే*....
కష్టించి ధనమును ఎట్లో సంపాదించిననూ దానిని భద్రపరచుట కష్టమైనదే....
ఇక భద్రపరచిన ధనమును ఖర్చు చేసిననూ ధనము తరిగిపోతున్నదని దుఃఖమే మానవుడికి మిగులుచున్నది....
అందువల్ల *ధనమును ఏ విధంగా చూసిననూ ఏ దశలోనైనా దుఃఖమునే కలిగించేది అని తెలియుచున్నది*....