Surya dev scientific importance: హిందూ సంప్రదాయంలో సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ప్రతి సోమవారం సూర్యభవానుడిని పూజించి నైవేద్యం సమర్పించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కోన్నారు. అంతేకాకుండా చాలా మంది పూజా ముగిసిన తర్వాత సూర్య పూజ కార్యక్రమంలో వినియోగించిన గింజలను నోట్లో వేసుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిండం వెనక శాస్త్రీయ దృక్కోణంతో పాటు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ అర్ఘ్యంకు ఎలాంటి ప్రముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య భగవానునికి అర్ఘ్యం శాస్త్ర విశిష్టత, ప్రాముఖ్యత:
>>సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తున్నప్పుడు.. నీటి ప్రవాహాల ద్వారా సూర్యుడిని చూసే క్రమంలో వెలువడే 7 రకాల కిరణాలు మన కళ్లపై పడతాయి. దీని వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా చాలా రకాల కంటి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో విటమిన్ డి కూడా లభించే అవకాశాలున్నాయి.
>>సూర్య భగవానునికి రోజు అర్ఘ్యం సమర్పించడం వల్ల విశేష లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఉదయం పూట చేస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
>>క్రమం తప్పకుండా అర్ఘ్యం అందించడం వల్ల గుండె ఆరోగ్యంగా తయారవుతుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు.. మన ఛాతీ సూర్యుని వైపు ఉంటుం. దాని కాంతి నేరుగా గుండెపై పడుతుంది. ఈ కాంతి వల్ల తీవ్రమైన వ్యాధుల నుంచి శరీర రక్షిణ పొందుతుంది.
>>సూర్యునికి నీటితో పాటు నైవేద్యం సమర్పించడం వల్ల చర్మవ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అర్ఘ్యం సమర్పించే ముందు స్నానం తప్పకుండా చేయాల్సి ఉంటుంది.