చార్ ధామ్ అనగా హరియొక్క నాలుగునివాసములు. జగద్గురు ఆదిశంకారాచార్యులవారు వారి ప్రవచనములయందు భారతదేశం నాలుగుదిక్కులందు ఉత్తరమున హిమాలయపర్వతశ్రేణులలో బదరీనాధ్ తూర్పున ఒరిస్సానందు పూరీ జగన్నాధ్ దక్షణమున పంబన్ ద్వీపమునందు రామేశ్వరంలో రామనాధేశ్వర్ మరియు పశ్చిమమున గుజరాత్ లో ద్వారకనందు ద్వారకాదీష్ చార్ ధామ్ అనియు హిందువులు ఈనాలుగు పుణ్యక్షేత్రముల దర్శనం మోక్షము పొందుమార్గమని ప్రవచించయున్నారు. ఈనాలుగు పుణ్యక్షేత్రములు ఒకేమారు దర్శించుట కష్టముతో కూడినది. కానీచార్ ధామ్ యాత్ర చేయవలెనని ఉత్సుకత ఉన్నవారు దక్షణ భారతదేశ నివాసులు పడమరలో గుజరాత్రా ష్ట్రమునందున్న ద్వారకతో ప్రారంభించి అచట ద్వారకాదీష్, పిమ్మట హిమాలయములలో ఉత్తరాఖండ్ రాష్ట్రములోనున్న బదరీనాధ్, తూర్పున ఒరిస్సా రాష్ట్రములోకల జగన్నాథలను దర్శించి చివరిగా రామేశ్వరము నందుకల రామనాధేశ్వరుని దర్శించి యాత్ర సుసంపన్నం చేసుకొవచ్చును. లేదా ఉత్తరభారదేశనివాసులు మొదటిగా బదరీనాధ్ తో ప్రారంభించి జగన్నాధ్, రామనాధెశ్వర్ దర్శించి చివరిగా ద్వారకాదీష్ దర్శించి యాత్రముగించవచ్చును.
బదరీనాధ్ మాత్రముహిమాలయములలో నుండుటవలన బదరీనాధ్ చేరుటకు రైలు వసతిలేదు. దేశములోని ప్రధాన నగరాలతో రైలుమార్గంతో కలుపబడిన హరిద్వార్ లేదా ఋషీకేశ్ ప్రయాణించి రోడ్డుమార్గములో బద్రీనాథ్ చేరవలయును. లేదా డెహ్రాడూన్ రైలునందు చేరి అచ్చటినుండి హెలీకాప్టర్ నందు ప్రయాణించవచ్చును. కేదార్నాథ్ తోకూదీన బదరీనాధ్ హెలీకోప్టర్ యాత్రఅధిక ఖర్చుతో కూదీనది. బదరీనాధ్ సంవత్సరములో ఆరుమాసములు మాత్రమే ఏప్రియల్ లేదా మేనెలలో తెరువబడి తిరిగి నవంబరు నెలలో మార్గము మరియు ఆలయము మంచుతో కప్పబడి ఆలయము మూసివేయబడును. మే నుండి ఆగష్టు నెలలోగా యాత్ర చేసిన ఆహ్లాదకరమైన ప్రకృతిలో యాత్ర సజావుగాజరుగు అవకాశములు ఎక్కువ. పూరీ, రామేశ్వరం మరియు ద్వారక రైలుద్వారా ప్రయాణించవచ్చు. కావున ఈనాలుగుక్షేత్రములు దర్శించువారు మే మరియు ఆగష్టు నెలలందు యాత్రకు అనుకూలము.
బదరీనాధ్ దర్శించునప్పుడు మార్గములో యాత్రికులు వారణాశి దర్శించి 9వ జ్యోతిర్లింగమైన కాశీవిశ్వనాధుని మరియు 17వ శక్తిపీఠం అయిన విశాలాక్షిని దర్శించి గంగాజలమును సేకరించవచ్చును. సేకరించిన గంగాజలం రామేశ్వరంలో రామనాధుని అభిషేకించిన సంపూర్ణతీర్ధయాత్రనందు రెండవభాగంనందు పూర్తిఆగును, మూడవభాగముకు రామేశ్వరంనందు సముద్రపు ఇసుక సేకరించి ప్రయాగ్ రాజ్ నందు గంగ, యమున మరియు సరస్వతీనదుల సంగమ ప్రదేశంలో శివలింగం తయారుచేసి అర్చించి సంగమంలో నిమజ్జనం చేయవలయును. పిమ్మట వారణాశి చేరి శివుని దర్శించిన చార్ ధామ్ యాత్రతోపాటు సంపూర్ణ తీర్ధయాత్ర పూర్తిఆగును.
ఆదిశంకరాచార్య హిందూమతమును వ్యాప్తిచేయుటకుగాను 1400 సం,లకు పూర్వం భారతదేశము పర్యటించి వివిధ ప్రదేశములందు మఠములు స్థాపించినారు. అట్లుస్థాపించిన మఠములు నాలుగువేదముల పేర్లతో తూర్పున పూరీనందు ఋగ్వేదపీఠమైన గోవర్ధనమఠం పశ్చిమమున ద్వారకనందు సామవేదపీఠమైన శారదామఠం, ఉత్తరాన బదరీనాధ్ వద్ద అధర్వణపీఠమైన జ్యోతిర్మథం, మరియు దక్షణమున శృంగేరినందు యజుర్వేదపీఠమైన శ్రీశృంగేరి శారదామఠంగా స్థాపించబడినవి. ఈనాలుగుమఠములు శంకరాచార్యులువార్కి ప్రీతిపాత్రములు మరియు వారి ప్రతిరూపములుగా భక్తులు భావించేదరు. నాలుగుమఠములందు దక్షణమున శృంగేరిమఠము తప్ప మిగిలిన మూడుమథములు చార్ ధామ్ పుణ్యక్షేత్రములతో జతపర్చబడి యుండుట విశేషము. నానుడిలో చార్ ధామ్ గా పిలువబడు ఛోటా చార్ ధామ్యా త్రనందలి క్షేత్రములు గంగోత్రి, యమునొత్రి, కేదార్నాద్ మరియు బద్రీనాధ్అ నునవి ఒకచిన్న వలయాకారంలో నుండు పుణ్యక్షేత్రములు. ఛోటాచార్ ధామ్యా త్రనందు దర్శించు దివ్యక్షేత్రములు విడిగా ప్రత్యేకయాత్రగా వివరించ బడినవి.
యాత్రలో బదరీనాధ్ వెల్లునప్పుడు మాత్రము ఉత్తరాది భోజనమే లభ్యమగును. మిగిలిన మూడు క్షేత్రములలో దక్షనాది భోజనము లభ్యమగును. నాలుగుక్షేత్రములలోనూ వసతికి దేవాలయముల వసతిగృహములు, పైనతెలుపబడిన మఠములతో పాటు వివిధ మఠములు, మధ్యతరగతి మరియు ఉన్నతశ్రేణి హోటల్సులభ్యమగును. యాత్రకు సుమారు 20రోజుల వ్యవధి మరియు సుమారు ఒక్కొక్కరికి 40 నుండి 50 వేలు ఖర్చుఅగును.