Tirumala Japali Teertham - జపాలి తీర్థం

P Madhav Kumar

 తిరుమలకు వెళ్లినవారు తిరుమలను మాత్రమే కాకుండా తిరుమల పై నెలకొని ఉన్న క్షేత్రాలను కూడా సందర్శిస్తూ ఉంటారు అందులో ముఖ్యమైనవి పాపనాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థం, చక్ర తీర్థం, శ్రీవారి పాదాలు, శ్రీ వేణుగోపాల స్వామి మొదలైనవి ఉంటాయి... 



అయితే దాదాపు అన్ని క్షేత్రాలు కూడా ఒక రకంగా జపాలి తీర్థంతో కనెక్ట్ అయినవి అనిపిస్తాయి.. చాలామందికి తెలియదు అందుకే ఇక్కడ ఈ తీర్థం యొక్క మహత్యాన్ని మీకు చెప్పబోతున్నాను... రామావతారాన్ని దాల్చాక ముందే రుద్రుడు రామదూతగా అన్ని శక్తులతో కలిసి వానర రూపంలో ఉండటానికి నిశ్చయించుకున్నారట అప్పుడు జాబాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేస్తూ తిరుమలలో ఉన్న ఈ ప్రదేశంలో జపము హోమము చేశారంట ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోయే హనుమంతుని రూపాన్ని ముందే ఆయనకు చూపించారు అంట 

జపం వల్ల అవతరించినందువలన ఈ స్థలం జపాలి అయింది... అన్ని తీర్థ రాజములు ఇక్కడికి వచ్చి చేరినందువల జపాలీ తీర్థం అని చెప్తారు ఇక్కడికి సమీపంలో ఉండే ఆకాశగంగలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయ అవతారానికి సంకల్పించిన ది అట.. హనుమంతుని కోసం ఆదిశేషులు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇలా మారిన శేషగిరి పైనే వెంకటేశ్వర స్వామి అభయాస్తాలతో దాసుడైన హనుమంతుని చూపుతున్నట్లుగా అర్చనా అవతారంగా ఉంటుంది... శ్రీరాముల వారు రావణుని సంహరించిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి స్నానం ఆచరించారట అలా శ్రీరాముడు స్నానమాచరించిన ప్రదేశాన్ని శ్రీరామ కుండముగాను సీతమ్మవారు స్నానమాచరించిన ప్రదేశాన్ని సీతమ్మ కుండముగాను ఇప్పటికీ మనం చూడవచ్చు.. భక్తుడైన ధ్రువుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసిన తర్వాతనే భగవత్ సాక్షాత్కారం పొందారట అందుకే ఆయన పేరుమీద ఒక ఔషధ గుణాలతో నిరంతరాయంగా ప్రవహించే ధృవతీర్థం కూడా ఇక్కడే ఉంది... ఈ మూడు కుండాలలోనీ నీరు మొత్తం కిందకి చేరుతుంది.. అలా జపాలి తీర్థంలో ప్రారంభమైన ఈ నీరు మొత్తం ఒక దగ్గర స్టోర్ అయ్యి పాపనాశనం డ్యాము లోకి చేరుతుంది...

Tirumala visiting places tour package by APSRTC
 ఈ క్షేత్రానికి వెళ్ళటానికి ఏపీఎస్ఆర్టీసీ వారు ఒక టూర్ ప్యాకేజీ లాగా 120 రూపాయల తోటి ఆరు క్షేత్రాలను దర్శించుకునే విధంగా మనకు ఇస్తారు... జపాలి తీర్థాన్ని దర్శించుకోవాలంటే కింద నుండి ఒక పెద్ద కొండపైకి కిందకి దిగినట్లుగా ఉంటుంది దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం మెట్లతో కూడిన మార్గం ఉంటుంది... మేము ఆ మార్గం గుండా నే పైకి ఎక్కాం అయితే మధ్యలో కింద అక్కడక్కడ డొంక రోడ్డు కనబడుతూ చాలామంది వెళ్తూ అనిపించారు... మాకు దాని గురించి అవగాహన లేదు కాబట్టి మేము ఏం చేసామంటే మొదట జపాలి ని దర్శించుకున్నాము తిరుగి వెళ్ళేటపుడు చాలామంది ఒక మార్గం గుండా వెళ్ళటం గమనించాం... కొంతమంది సెక్యూరిటీ గార్డులు అక్కడ వ్యాపారం చేసుకునే వారు ఆ మార్గం గుండా వెళ్తఉండడం గమనించాము.. ధైర్యం చేసి వారిని అనుసరిస్తూ ముందుకు సాగాము... మా కాళ్లకు చెప్పులు కూడా లేవు... స్వామివారి మహత్యం తోటి క్రింద అంత ఆకులతోటి మెత్తగా ఎటువంటి ఆయాసం లేకుండా సాగిపోయింది... దాదాపు అర కిలోమీటర్ దూరంలోనే మనకి మనం వెళ్లవలసిన డెస్టినేషన్ మనకి కనబడుతుంది.... దారి మొత్తం ట్రేకింగ్ చేసినట్టుగా ఉంటుంది ఎడం చేతి వైపు పూర్తిగా పాపనాశనం డ్యామ్ కు సంబంధించిన బ్యాక్ వాటర్ కనబడుతూ కనువిందు చేస్తూ ఉంటుంది కుడివైపున దాదాపుగా ఒక 200 మీటర్ల ఎత్తు పైన అక్కడక్కడ మెట్లు కనపడతా ఉంటాయి కొన్ని కొన్ని ప్రదేశాలలో ఏది కనపడదు... ఒకరకంగా ఇది అడవి మార్గమే కానీ చిక్కటి అడవి అయితే కాదు... కొంచెం సాహసం చేయాలి అనుకుంటే ఒక గ్రూపు లాగా ఎంచుకొని వెళ్లవచ్చు... ఎడమవైపు వెళ్ళటానికి వేరే ఎక్కువ మార్గాలు ఉండవు కంప్లీట్ గా డ్యామ్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రోడ్డు మార్గానికే కలుస్తాయి అన్ని రోడ్లు అందుకే ధైర్యం చేసి వెళ్ళాము.... 

Papanasham back water site seeing places
ఇలా ఒక 400 మీటర్లు వెళ్లిన తర్వాత కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి పాపనాశనం డ్యామ్ కూడా మనకి కనిపించి ఇలా కనువిందు చేస్తుంది.... మధ్యలో మనకి వెళ్లే దోవకి అడ్డంగా జలపాతాలు ఈ కనపడుతూ ఉంటాయి. వాటిలోకి వెళ్ళవద్దు ఎట్టి పరిస్థితుల్లో... చాలా లోతుగా ఉంటాయి అవి... దాని పక్కనే కుడి చేతి వైపు మనకి నడిచేతిలో మనకి కనబడుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి... చివరికి ఒక ఐదు కిలోమీటర్ల తర్వాత మనకి ఇలాంటి రోడ్డు కనబడుతుంది ఈ రోడ్ లో నుంచి వెళ్తే మనకు మెట్ల మార్గం కనబడుతుంది ఇంకొక రోడ్డు కూడా ఉంది ఎడం చేతి వైపు ఎందుకో సాహసం చేయలేకపోయాము. ఒకవేళ ఆ రోడ్లో నుంచి వెళ్తే డైరెక్ట్ గా బస్టాండ్ కి వెళ్ళిపోవచ్చు.... చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ ప్రదేశం నుండి మేము వచ్చాము... పుణ్యక్షేత్ర దర్శనలో ఇలాంటి సాహసకృత్యాలు కూడా మనకి చెప్పలేనంత ఆనందభూతులను ఇస్తుంది రెండు కిలోమీటర్ల దూరంలో చాలా సులభంగా ఎటువంటి ఆయాసం లేకుండా చేయగలిగాము ఈసారి ఒకసారి జపాలీ తీర్థానికి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్... 
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat