గుండెనొప్పి వంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే యోగా ముద్రలు, యోగాసనాలు:
వయసుతో పాటు వచ్చే ఈ సమస్యని ఆదుపులో ఉంచుకోవాలంటే చక్కని ఆహారం, వ్యాయామం చాలా అవసరం.
ఆహారంలో కొవ్వుని బాగా తగ్గించాలి.
తాజా కాయగూరలు, పండ్లకి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
తరచూ పరీవక్షలు చేయించుకోవాలి.
వాటితో పాటు ఈ ఆసనాలు వేయాలి:
1. ఆపాన వాయుముద్ర: సుఖాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచాలి. కుడిచేతి చూపుడు వేలుని, బొటనవేలు కింద ఉంచాలి. మధ్యవేలు ఉంగరం వేలు బొటనవేలికి కలపాలి. చిటికెన వేలును నిటారుగా ఉండాలి, ఇలా పావుగంట పాటు వెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైన ముద్ర ఒక సారి గుండెనొప్పి లక్షణాలు కనబడి వైద్యుని వద్దకు వెళ్లే లోపు ఈ మంద్ర వేస్తే కొంత రక్షణ కలుగుతుంది. అందుకే దీనిని లైఫ్ సేవర్ ముద్ర ఆని కూడా అంటారు. గుండెకు సంబంధించి ఏ సమస్యలున్నా ఈ ముద్రని వేయొచ్చు. సమస్య ఉన్నవారు రోజులో మూడు సార్లు వేయొచ్చసు ఆస్పత్రిలో ఉండి కూడా వేయొచ్చు. ఈ ఆసనాలు చేస్తూనే వ్యతిరేక ఆలోచనలు, భావనలు, దుర్వసగాలకు దూరంగా ఉండాలి.
2. కటి ఆసనం: వెల్లకిలా పడుకొని రెండు కాళ్ళు ముడిచి దగ్గరకు తీసుకౌని రెండు కాలి బొటనవేశ్లని పట్టుకోవాలి. తర్వాత రెండు కాళ్లని నిటారుగా ఉంచాలి. కాళ్ల ఘధ్య కొద్దిగా దూరం పాటించాలి తల, భుజాలు పైకి కొంచెం లేపాలి మెడ నొప్పిగా ఉంటే తలని లేపకుండా చెయ్యాలి. ఆ ఆసనంలో ఆరనిమిషం పాటు ఉండాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి.
3. షుప్త గోరక్షాసనం: వెల్లకలా పడుకొని రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని రెండు పాదాలని కలిపి రెండు చేతులతో పట్టుకోవాలి. తల, భుజాలని కొంచెం పైకి లేపాలి. రెండు చేతులు నిటారుగా ఉంచాలి. ఈస్థితిలో శ్యాస మీద ద్యాస నిలపాలి. ఇలా ఇరవై సెకన్ల పాటు ఉండాలి. మెల్లగా యధాస్థితికి రావాలి. తిరిగి మరలా చెయ్యాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి.
నీరసంగా, అలసట , లో-బిపి ఉన్నవారికి యోగాసనాలు:
1. వజ్ర ముద్ర: సుఖాసనంలో కూర్చుని చూపుడువేలు నిటారుగా ఉంచాలి. మధ్యవేలు, బొటనవేలు కలిపి ఉంచాలి. చిటికెనవేలు. ఉంగరం వేలు కొంచెం పక్కకి పెట్టాలి. ఈ ముద్ర ఐదు నిమిషాల పాటు చెయ్యాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, కళ్లు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి, ఈ ముద్ర ధరించడం వల్ల లోబిపిని త్వరగా అదుపులో పెట్టుకోవచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే రోజులో మూడు సార్లు చెయ్యాలి.
2. విపరీత నౌకాసనం: పొట్ట మీద బోర్లా పడుకోవాలి. శ్వాస తీసుకొంటూ రెండు చేతులూ రెండు కాళ్లూ తలపైకి లేపాలి. ఇలా పదిసెకన్లపాటు వదులుతూ యథాస్థితికి రావాలి ఇలా ఆరు సార్లు చెయ్యాలి.
గమనిక:
పైనుదహరించిన యోగాసనాలు ప్రాధమిక అవగాహనకొరకే, మరింత సమాచారం కోసం యోగా నిపుణులను సంప్రదించగలరు.