శ్రీ రామనవమివ్రత కల్పము | Sri Rama navami Vrata Kalpamu

P Madhav Kumar
శ్రీ రామ నవమి వ్రత కల్పము

శ్రీరాముని వ్రతమును, పండుగగా జరుపుకొందురు చైత్ర శుద్ద నవమి, వునర్వసు నక్షత్రము నందు శ్రీరాముడు జన్మించెను. శ్రీ రామనవమిని ఒక వ్రతముగా చేయవచ్చును.

భూశుద్ది :
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ద చేసి, అకలి, బియ్యపు పిండితో గాని, రంగుల చూర్ణ ములతో గాని, ముగ్గులు పెట్టి, దైవ స్థాపన నిమిత్త మై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని, మరీ పల్లముగా గానీ ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టుపెట్టి, వరి పిండి (బియ్యపు పిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్ర పటమును గాని ఆ పీట పై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి ( పసుపును షుమారు అంగుళం సైజులో త్రికొణ ఆకృతిలో ముద్దగా చేసి) దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్ళెంలో గాని, క్రొత్త తుండుగుడ్డ మీదగాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి, అందు పసుపు గణపతి నుంచి అగరు వత్తులు వెలిగించాలి. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకొవాలి. పారాధన నైఋతి దిశలో చేయవలెను.

దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము:

దీపారాధన చెయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిది గాని, మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి ( మధ్యలో) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు) వేసి ముందుగా ఏక హారతిలొ వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వుల నూనెగాని, కొబ్బరి నూనెగాని, ఆవు నెయ్యిగాని వాడ వచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.

ఘంటానాదము:
శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్
కుర్యాద్ఘంటార వంతత్ర దేవతా హ్వాహన లాంఛ నమ్ || 
   మనము ఆచ మనము చేసినటువంటి పంచ పాత్ర లోని నీళ్లు దేవుని పూజకు విని యోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని, చెంబునక కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.

పూజకు కావలసిన వస్తువులు:

సీతా సమేత శ్రీరాముని యొక్క బొమ్మ( ప్రతిమ ) ( తమ శక్తి కొలది బంగారముతో నైనను, వెండితో నైనను లేక మట్టితో నైనను తిసుకొన వలెను), లేదా చిత్ర పటము, మండపమునకు మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరి కాయలు, పళ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షింతలు, అగ్గి పెట్టె, అగరు వత్తులు, వస్త్ర, యజ్ఞో పవితములు, ప్రత్యేక నివేదన(పిండి వంటలు)

పిమ్మట యజమానులు( పూజ చేసేవారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. 
ఈ నామములు మొత్తం 24 కలవు.
1. " ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
2. " ఓం నారాయణాయ స్వాహా " అనుకుని ఒక సారి
3. " ఓం మాధ వాయ స్వాహా " అనుకుని ఒక సారి జలమును పుచ్చు కోవలెను. తరువాత
4. " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగుకోవాలి.
5. " ఓం విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు, బొటన వ్రేళ్ల తో కళ్లు తుడుచుకోవాలి.
6. " ఓం మధు సూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురు కోవాలి.
7. " ఓం త్రివిక్ర మాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.
8,9 " ఓం వామనాయ నమః" " ఓం శ్రీధ రాయ నమః" ఈ రెండు నామాలు స్మరిస్తూ తల పై కొంచెం నీళ్లు చల్లుకోవాలి.
10. " ఓం హృషీకేశాయ నమః" ఎడమ చేతితో నీళ్లు చల్లాలి.
11. " ఓం పద్మనాభాయ నమః" పాదాల పై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
12. " ఓం దామోద రాయ నమః" శిరస్సు పై జలమును ప్రోక్షించుకోవలెను.
13. " ఓం సంకర్షణాయ నమః" చేతి వ్రేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
14. " ఓం వాసుదేవాయ నమః" వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15,16 " ఓం ప్రద్యుమ్నాయ నమః" " ఓం అనిరుద్దాయ నమః" నేత్రాలు తాకవలెను.
17,18 " ఓం పురుషోత్తమాయ నమః" ఓం అధోక్షజాయ నమః" రెండు చెవులూ తాకవలెను.
19,20 " ఓం నారసింహాయ నమః " ఓం అచ్యుతాయ నమః" బొడ్డును స్పృశించవలెను.
21. " ఓం జనార్ద నాయ నమః" చేతివ్రేళ్ల తో వక్ష స్థలం, హృదయం తాకవలెను.
22. " ఓం ఉపేంద్రాయ నమః" చేతి కొన తో శిరస్సు తాక వలెను.
23,24 " ఓం హరయే నమః " ఓం కృష్ణాయ నమః" కుడి మూపురమును ఎడమ చేతితోను, ఎడమ మూపుర మును కుడి చెతితోను తాకవలెను.

ఆచ మనము వెంటనే సంకల్పము చెప్పుకోవలెను.
ఆచ మనము అయిన తరువాత, కొంచెం నీరు చేతిలో పోసుకుని నేల పై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను.
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః
  యేతే షామవిరో ధేన బ్రహ్మకర్మ సమారభే ||

ప్రాణాయామమ్య : ఓం భూ: - ఓం భువః ఓం సువః - ఓం మహః - ఓం జనః ఓం తపః - ఓగ్o సత్యం - ఓం తత్ సవితుర్వ రేణ్యం భర్గో దెవస్య ధీమ హీధ యోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరోం అని సంకల్పము చెప్పుకొనవలెను.

సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణః (ఇక్కడ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూ ద్వీపేభరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీ శైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీ శైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను), కృష్ణా గోదార్యో: మధ్య ప్రదేశే (మనం ఏఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొన వలెను), శోభన గృహే ( అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ ఆస్మిన్ వర్త మానే వ్యావ హారిక చాంద్ర మానేన సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలెను), అయనే, ( సంవత్సరమునకు రెండు అయనములు - ఉత్త రాయణము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం. పూజచేయునపుడు ఏ అయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను) ఋతు:, ( వసంత, గ్రీష్మ, వర్ష మొ|| ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు) పక్షే, (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము, అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు) తిధౌ, ( ఆరోజు తిధి) వాసరే (ఆరోజు ఏ వార మనదీ చెప్పుకొని) శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే ఏవం గుణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీరామా ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్.... గోత్రస్య..... నామధేయః, శ్రీ మత్యః, గోత్రస్య, నామధేయస్య అనియు, స్త్రీ లైనచో శ్రీమతి, గోత్రవతి, నామధేయవతి, శ్రీ మత్యాః, గోత్ర వత్యాః, నామధేయవత్యాః అనియు ( పూజ చేయువారి గోత్రము, నామము చెప్పి) నామధేయస్యః దర్మ పత్నీ సమేతస్య ( పురుషులైనచో) మమ సహ కుటుంబస్య, క్షేమ స్థ్యైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్ధం సకలవిధ మనోవాంఛాఫల సిద్ద్యర్ధం, శ్రీరామ ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం( ఏ దేవుని పూజించుచున్నాయో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని) సంభవద్భి రుపచారై: సంభవతానియమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి ( నాకు తోచిన రీతిలో, నాకు తోచిన విధముగా, భక్తి శ్రద్దలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తధంగ కలశ పూజాం కరిష్యే || పిద పకలశారాధ నను చెయవలెను.

కలశ పూజను గూర్చిన వివరణ :
వెండి, రాగి, లేక కంచు గ్లా సులు( లేదా పంచ పాత్రలు) రెండింటిలో శుద్ద జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షింతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండువ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమ అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమునుగాని, కుంకుమనుగాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను.

కుంకుమ అక్షతలువ గైరాబొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. 
యజమానులు( ఒక్కరైతే ఒకరు, దంపతులు లైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడి చేతితో మూసివుంచి, ఇలా అనుకోవాలి. ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు 
మొదటగా ఈ శ్లోకమును చదవవలెను. 
మం || కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాస్శ్రితః
         మూలే తత్ర స్థితో బ్రహ్మామధ్యే మాతృ గణాస్మృతాః||
         ఋగ్వేదో ధయజుర్వేద స్సామావేదో హ్యధర్వణః   
         అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః    
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే, గోదావరి, సరస్వతీ,
         నర్మదా సింధు కావేరౌయో జలే స్మిన్ సన్నిధంకురు ||

ఇక్కడ, 
  ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీరామ. ( ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను) పూజార్ధం మమ దురితక్షయకార కాః కలశో దకేన ఓం దేవం సం ప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని, ఆకుతో గానీ చల్లాలి.  
మార్జనము:
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావ స్థాంగతో పివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతర శ్ముచి:||  
అని,
 పిద పకాసిని అక్షతలు, పసుపు, గణపతి పై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణ 
ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ఠ అనగా శ్రీ మహా గణాధి పతయేనమః ప్రాణ 
ప్రతిష్టా పన ముహూర్తస్సు ముహూర్తోస్తు తధాస్తు. తరువాత ఇలా చదువుతూ 
విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో || శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
     ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నో పశాంతయే ||
     సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
     లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
     ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
     వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః
     షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి
     విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
     సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||
పిదప,
 షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచార ములనగా ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, 
పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం,
 నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి. పిదప షోడశో పచార 
పూజను చేయవలెను. షోడశో పచారములనగా ధ్యాన, ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, 
ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, 
నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి.
   
షోడశో పచార పూజాప్రారంభః
ధ్యానం:
శ్లో || కోమలాంగం విశాలాక్షం ఇంద్ర నేల సమప్రభం,
     దక్షిణాంగే దశరధం పుత్రాపేక్ష ణత త్పరం,
     వృష్టంతో లక్ష్మణందేవం సచ్ఛత్రం కనక ప్రభం,
     పార్మ్యే భరత శత్రఘ్నె తాళ వృతక రావుభౌ,
     అగ్రేవ్యగ్రం హనుమంతం రామానుగ్రహ కాంక్షిణం.
     ఓం శ్రీ రామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి
     అని శ్రీ రాముని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను. 

ఆవాహనం:
శ్లో || విశ్వేశం జానకీ వల్లభ ప్రభుం కౌసల్యా తనయం
     విష్ణుం శ్రీరామంప్రకృతే: పరం ||
     సహస్ర శీర్షే త్యావాహనం, శ్రీరామాగచ్ఛ భగవన్ర ఘువీరన్న పోత్తమ ||
     జానక్యా సహరాజేంద్రా సుస్థిర భవ సర్వదా
     రామభద్ర మహేష్వాస రావణాంతక రాఘవ
     యావతన్నాజాం సమాప్యే హంతాత్సన్ని హితోభవ ||
     రఘునాయక రాజర్షి నమోరాజీవ లోచన,
     రఘునంద నమోదేవ శ్రీరామాభి మభోభవ ||  
ఓం,
 శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి. ఆవా హనార్ధం అక్షతాం సమర్పయామి. అనగా 
మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సున అక్షతలు 
దేవుని పై వేయవలెను.

ఆసనం:
శ్లో || రాజాధ రాజ రాజేంద్ర రామచంద్ర మహీపతే రత్న సింహాసనం తుభ్యం
      దాస్యామి స్వీకురు ప్రభో || పురుషయే వేద మిత్యాసనం ||   
ఓం
 శ్రీ రామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం 
అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చుండుట కై మంచి బంగరుపీట వేసినట్లు అనుకుంటూ
 అక్షతలు వేయవలెను. 

అర్ఘ్యం:
శ్లో || పరిపూర్ణ పరానంద నమోర మాయవేధనే,
గృహాణర్ఘ్యం మయాదత్తం కృష్ణ విష్ణోజనార్దన, త్రిపాదే త్యర్ఘ్యం.
ఓం శ్రీ రామ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. || 
  దేవుడు చేతులు కడుగుకొనుట కై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ, ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

పాద్యం :
శ్లో || త్రైలోక్యపావనానంత నమస్తే రఘు నాయక
     పాద్యం గృహాణరాజర్షే నమోరాజీవ లోచన ||
     ఏతావాన స్యేతిపాద్యం   
ఓం
 శ్రీరామ నమః పాద్యం సమర్పయామి. దేవుడు కాళ్లు కడుగు కొనుటకు నీరు 
ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో 
ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనీయం:
శ్లో || నమస్సత్యాయ శుద్దాయ నిత్యాయ జ్ఞానరూపిణే,
      గృహాణాచమనంనాధ సర్వలోకైక నాయక, తస్మాద్విరా ఒచ్యాచ మనం,   
   ఓం శ్రీరామ నమః ఆచమనీయం సమర్పయామి.|| 
  అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతొ ఒక మారు నీరు వదలవలెను.

సూచన:
అర్ఘ్యం,
 పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్ర లో వదలవలెను. 
అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పల్లెము) లో వదలరాదు. 

మధుపర్కం :
శ్లో || నమశ్శ్రీ వాసుదేవాయ తత్వ జ్ఞాన స్వరూపిణే,
                        మధుపర్కం గృహాణే దం జానకీ పతయే నమః
ఓం శ్రీ రామ నమః మధుపర్కం సమర్పయామి
అని,
 స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ , ఈ మధుపర్కం
 ను ఆయన ప్రతిమకు అద్దవలెను (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో 
గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న 
దాన్ని మధుపర్కం అంటారు )

పంచామృత స్నానం : 
శ్లో || పంచామృత మయానీతం పయోదది ఘ్రుతం మధు
శర్క రాజల సంయుక్తం శ్రీ రామః ప్రతి గృహ్యాతాం .
ఓం,
 శ్రీ రామ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి ,ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార 
కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.

శుద్దోదక స్నానం : 
శ్లో || యత్పురుషేణేతి స్నానం తతో లఘు తంత్రేణ సర్వోప చారాన్కుర్యాత్
ఓం శ్రీ రామనమః శుద్దోదక స్నానం సమర్పయామి . పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .
వస్త్ర యుగ్మం : సప్తాశ్వా సన్నితి వస్త్రం 
ఓం,
 శ్రీ రామనమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును
 (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం
శ్లో || తం యజ్ఞమితి యజ్ఞోపవీతం ఓం శ్రీరామనమః ఉపవీతం సమర్పయామి
అనగా,
 జందెమును ఇవ్వవలెను ఇదియును ప్రత్తితో చేయవచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
గంధం : శ్లో || తస్మాద్య జ్ఞాదితి మంత్రేణ గంధం ఓం శ్రీనమః గంధాన్ సమర్పయామి || ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.

ఆభరణం
శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే |
భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||
ఓం,
 శ్రీ రామనమః ఆభరణాన్ సమర్పయామి అని స్వామికి మనము చేయించిన ఆభరణములను అలంకరించవలెను లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను.

అక్షతలు:
శ్లో || ఓం శ్రీరామ నమః అక్ష తాన్ సమర్పయామి.
( అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపువేసి కలుపవలెను) అక్షతలు తీసుకొని స్వామివారి ప్రతిమ పై చల్లవలెను.

పుష్ప సమర్పణ :
శ్లో || తస్మాద జ్ఞ్యాది షతా, తస్మాద శ్వాది తిపుష్ప
శ్రీ రామ నమః పుష్పాణి సమర్పయామి.||  
  స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను. పువ్వులను స్వామి పై వేసి నమస్కరించవలెను.

ధూపం :
శ్లో || యత్పురుషమిత ధూపం | 

దీపం :
శ్లో || బ్రాహ్మణో శ్యదీపం |

నివేదనం :
శ్లో || చంద్రమా ఇతి నివేదనం | 

తాంబూలం :
శ్లో || నాభ్యా ఆశేదితి తాంబూలమ్ | 

నీరాజనం :
శ్లో || వేదాహమితి నీరాజనం | 

ప్రదక్షిణం :
శ్లో || ధాతేతి ప్రదక్షిణమ్ | 

మంత్ర పుష్పం :
శ్లో || యజ్ఞే నేతి మంత్ర పుష్పం | 
  పిదప అధాంగ పూజను చేయవలెను. ఈ క్రింది నామాలను చదువుచు పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.

అధాంగ పూజ
శ్రీ రామ చంద్రాయ పాదౌ పూజయామి
రాజీవ లోచనాయ గుల్భౌ పూజయామి
రావణాంత కాయ జానునీ పూజయామి
వాచస్సతయే ఊరూ పూజయామి
విశ్వరూపాయ జంఘే పూజయామి
లక్ష్మణాగ్ర జాయ కటిం పూజయామి
విశ్వమూర్తయే మేడ్రం పూజయామి
విశ్వామిత్ర ప్రియామి నాభి పూజయామి
పరమాత్మనే హృదయం పూజయామి
శ్రీకంటాయ కంటం పూజయామి
సర్వాస్త్రదారిణే బాహూ పూజయామి
రఘుద్యహాయ ముఖం పూజయామి
పద్మనాభాయ జిహ్వం పూజయామి
దామోద రాయ దన్తాం పూజయామి
తరువాత
 అష్టోత్తర శతనామావళి పూజ. దీనియందు 108 మంత్ర ములుండును. ఈ మంత్రం ములును 
చదువుచు పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.

శ్రీ రామా అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకివల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః                                          
ఓం జితామిత్రాయ నమః  
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతయ నమః
ఓం శరనత్రాణ తత్సరాయ నమః
ఓం వాలిప్రమదనాయ నమః
ఓం వంగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః                                   
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వసినే నమః
ఓం విరాధవధపందితాయ నమః
ఓం విభి ష ణపరిత్రాణాయ నమః
ఓం హరకోదండ ఖండ నాయ నమః
ఓం సప్తతాళ ప్రభేత్యై నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాధర్పదళనాయ నమః        
ఓం తాతకాంతకాయ నమః
ఓం వేదాంత సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగాస్యభే షజాయ నమః
ఓం త్రిమూర్త యే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః                                     
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండ కారణ్యవర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృ భక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేoద్రి యాయ నమః
ఓం జితక్రోథాయ నమః
ఓం జిత మిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః                                        
ఓం వృక్షవానరసంఘాతే నమః
ఓం చిత్రకుటసమాశ్రయే నమః
ఓం జయంత త్రాణవర దాయ నమః
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
ఓం సర్వదేవాద్ దేవాయ నమః
ఓం మృత వానరజీవనాయ నమః
ఓం మాయామారీ చహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదే వస్తుతాయ నమః     
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహొదరాయ నమః
ఓం సుగ్రీవే ప్సిత రాజ్యదాయ నమః
ఓం సర్వ పుణ్యాదేక ఫలినే నమః
ఓం స్మ్రుత స్సర్వోఘనాశనాయ నమః
ఓం ఆది పురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహా పురుషాయ నమః                                  
ఓం పుణ్యోద యాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్త్రాయ నమః
ఓం అమిత భాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంత గుణ గంభీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్త మాయ నమః                   
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాది పూ జితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశియే నమః
ఓం సర్వ తీర్ద మయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుంద రాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీత వాసనే నమః                                   
ఓం ధనుర్ధ రాయ నమః
ఓం సర్వయజ్ఞాధీపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణ వర్ణ తాయ నమః
ఓం విభేషణప్రతిష్టాత్రే నమః   
ఓం సర్వావగునవర్ణ తాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచిదానందాయ నమః
ఓం పరస్మైజ్యోతి షే నమః                                
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్సరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదే వత్మకాయ నమః
ఓం పరస్మై నమః                                        
                               శ్రీ రామాష్టోత్తర శత నామావళి సమాప్తమ్
   పిదప అగరు వత్తిని వెలిగించి
   ధూపం :

  శ్లో || వనస్పతి రసోద్భూతో గంధాద్యో గంద ముత్తమ 
రామచంద్ర మహీపాల ధూపోయం ప్రతిగ్నహ్యతాం యత్పురుష మితి ధూపం.
   ఓం శ్రీ రామ నమః ధూప మాఘ్రాపయామి.
   ధూపం సమర్పయామి. అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.

దీపం :
శ్లో || జ్యోతిషాం పతయే తుభ్యం నమోరామాయ వేధసే
గృహానదీ పకం చైవ త్రైలోక్య తిమిరాపహం ||
బ్రాహ్మణోస్యేతి దీపం.
ఓం శ్రీరామ నమః సాక్షాత్ దీపం దర్శయామి
అని,
 మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపు వత్తులతో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ,.ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదవవలెను.

నైవేద్యం :
శ్లో || ఇదంది వ్యాన్న మమ్రతంర సైషజ్భి స్సమన్వితం,
రాచ మంద్రేశ నైవేద్యం సీతాశ ప్రతిగృహ్యతాం ||
   చంద్రమా ఇతి నైవేద్యం.
ఓం శ్రీరామ నైవేద్యం సమర్పయామి
అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరి కాయ మొదలగునవి ఒక పల్లెములోనికి తీసుకొని స్వామివద్ద నుంచి దాని పై పువ్వుతో నీళ్లు చల్లుతూ
ఎడమ చేత్తో గంటవాయిస్తూ ' ఓం భూర్భువస్సువః ఓం తత్ స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీయో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన
పరి షించామి,( ఋతంత్వా సత్యేత పరి షించామి అని రాత్రి చెప్పవలెను) అమృత మస్తు అమృతో పస్త రణమసి, ఓం ప్రాణాయ స్వాహా, మధ్యే మధ్యే
పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో) స్వామికి నివేదనం చుపించాలి. పిదప ఓం శ్రీరామ నమః నైవేద్యానంతరం
హస్తౌ ప్రక్షాళ యామి' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర )లో వదలాలి. తరువాత ' పాదౌప్రక్షాళ యామి' అని మరో సారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. పునః శుద్దాచ మనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం
తాంబూలం
శ్లో || నాగవల్లీ దళైర్యక్తం పూగీ ఫల సమన్వితం,
తాంబూలం గృహ్యతాంరామ కర్పూరాది సమన్వితం ||
నాభ్యా ఆసీదితి తాంబూలం.
ఓం శ్రీరామ నమః తాంబూలం సమర్పయామి
అని, 
 చెబుతూ తాంబూలమును ( మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ' తాంబూల చరవణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి
దక్షిణ :
హిరణ్య గర్భే తిదక్షిణాం ||

నీరాజనం :
శ్లో || రాజాధీ రాజాయేతి నీరాజనం ||
ఓం శ్రీరామ నమః కర్పూర నీరాజనం సమర్పయామి
అని,
 కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, చిన్నగా ఘంట వాయించవలెను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్దాచ మనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,
కర్పూర నీరాజనం:
నృత్త్యైర్గి తైశ్చవా ద్యైశ్చ పురాణపట నాదిభి:
రాజో పచారైరభి లైస్సంతుష్టోభవ రాఘవ ||

మంగళార్దం మహీపాల నీరాజన మిదంహరే
సంగ్రహాణ జగన్నాధ రామచంద్ర నమోస్తుతే కర్పూర నీరాజనం ||        

నమస్కార :
నమోదేవాది దేవాయ రఘునాధాయ
చిన్మయానంద రూపాయ నీతాయః 
పతయే నమః సప్తా స్యాసన్నితిన మస్కారః
మంత్ర పుష్పం :
శ్లో || సర్వలోక శరణ్యాయ రామ చంద్రాయ వేదసే
బ్రహ్మనందైక రూపాయ సీతాయ|| 
పతయే నమః యజ్ఞే నేతి పుష్పాంజలి: ||
ఓం,
 శ్రీరామ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణం:
శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ,
నమస్తే విఘ్న రాజాయ నమేస్తే విఘ్న నాశన ||

శ్లో || ప్రమధ గణ దేవేశ ప్రసిద్దే గణనాయక,
ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే ||

శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం, 
 శ్రీరామ నమః ఆత్మ ప్రదక్షిణ చేసి ( అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి ( మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి ) తరువాత స్వామి పై చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసినులై నమస్కరించుచూ

ఇతి అర్ఘ్యం:
అశోక కుసుమైర్యుక్తం రామాయార్ఘ్యం నివేదయేత్
దశానన వధార్దాయ ధర్మ సంస్థాపనాయచ ||

రాక్ష సాంచ వినాశాయ దుష్టానాంనిధ నాయచ హరి:
పరిత్రాణాయ సాధూనాం జాతో రామస్స్వంయం
గృహాణర్ఘ్యం మయాదత్తం భ్రాత్రభి స్సహితో నఘ ||
ఇత్ర్ఘ్యం || ఇతి పూజావిధః ||  
పునః పూజ :
ఓం,
 రామ నమః పునః పుజాంచ కరిష్యే అని చెప్పుకొని, పంచపాత్ర లోని నీటిని చేతితో తాకి, అక్షతలు స్వామి పై చల్లుతూ ఈక్రింది మంత్రములు చదువుకొనవలెను.

విశేషో పచారములు:
ఛత్రం, 
 ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని, నమస్కరిస్తూ ఈక్రింది శ్లోకమును చదువుకొనవలెను.

పూజాఫల సమర్పణమ్:
శ్లో || యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
  అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు.
ఏతత్ఫలం
 శ్రీరామర్పణమస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీరామ ప్రసాదం శిరసాగృహ్నామి' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీ రామ నమః యధాస్థానం ప్రవేశయామి.
శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.

   పూజా విధానం సంపూర్ణం.   

తీర్ధ ప్రాశ నమ్ :
శ్లో || అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్ష యకరం శ్రీరామ పాదో దకం పావనం శుభమ్ ||
   అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను.

వ్రత కధా ప్రారంభము :
శివ,
 భక్తుడైన అగస్త్యమ హర్ష సుతేష్ణ మహర్షితో ఇట్లు పలికెను. ఓ ' సుతేష్ణ మునీ' నీకు నేను ఒక రహస్యము చెప్పెదను.అని ఈవిధముగా చెప్పుట మొదలు పెట్టెను.
చైత్ర,
  మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పటించి (చదివి) జాగారణముచేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి,
గోవు.
 భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను. ఇలా శ్రీ రామ నవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపముల అన్ని నశించును. ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలొ కములందు భోగమును, మోక్షమును కలిగించునది. కావున మహాపాపిఐన నూ శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్ని జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభి రాముడగు శ్రీరామునివలె అన్ని లోకములలోను ఉత్తముడై వెలుగును.

శ్రీ రామనవమి వ్రతము రోజున తినెడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటి కంటే ఉత్తమమైన ఈవ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలముకాదు. కావున ఈ వ్రతము ఒక సారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియూ తొలగి కృతార్దులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమ ( బొమ్మ) కు పూజ పూజా విధనాము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. ఈతని పలుకులు విని సుతేక్షుణుడు ఇలా అడుగు చుండెను. ఓ లోపాముద్రావతీ! ఎప్పుడూ ధనములేని వారైన మానవులకు సులభమైన ఉపాయము చెప్పుమనగా ఆగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు.

ఓ సుతేక్షణా! దరిద్రుడు అగు మానవుడు తనకు కలిగియున్న వరకూ స్వర్ణ రజతాదులలో (అనగా బంగారం) దెనిచే నైననూ పైసలలో పము చేయక శ్రీరాముని ప్రతిమను చేయించి ఈవ్రతం చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వపాపములు తొలగి పోవును. కావున ఎలాగైన ఈ వ్రతమును చేసి జానకీ కాంతుని పూజింపవలయును. ఈ వ్రతమును భక్తి కొలది చేయనివాడు రౌర వాది నరకములో పడును. అనిన విని సుతేక్షుడు ఓ అగస్త్య మహర్షి! శ్రీ రామమూల మంత్ర ప్రభావము నాకు తెలుపవలెను. అనిన అగస్త్యుడు వివరించుచున్నాడు. సమస్తములైన రామ మంత్ర ములలోను, ' రామ షడక్షరి అను మంత్ర రాజము ఉత్త మమని స్కాంద పురాణము. మోక్ష ఖండనము లోని రుద్ర గీత యందు శ్రీరాముని గూర్చి రుద్రుడు(శివుడు) చెప్పుచున్నాడు.

ఓ రామ! మణి కర్ణిక ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణమున ( అంటె కుడి చెవియందు)' శ్రీ రామరామారామ' అను తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక పర బ్రహ్మము ' అని పిలువబడుచున్నావు.

కావున పూజా ప్రారంభమున శ్రీ రఘునందనుని ధ్యాన, ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్య పీతాంబర ఉపవేత దివ్య భూషణ చంద నాది మొ|| గు షోడశో పచార పూజలు మూల మంత్రము చేత చేసినచో అనేక కోటి జన్మలలో చేసిన పాపమలచే విముక్తుడు అగును.

కావున పరిశుద్దము పాపనాశనము యైన శ్రీరామ నవమీ వ్రతము శ్రద్ధా భక్తి గల మానవులకు చెప్ప తగినది. ఇంతే కాక బంగారు, వెండి, రాగి మొ|| న లోహములలో దేనితో నైననూ శ్రీరామ ప్రతిమను చేయించి అందు దేవుని ఆవాహనము చేసి, ఇంతకు ముందు చెప్పిన విధముగ పూజ చేసి, ఆ ప్రతిమ(బొమ్మ) దగ్గర శ్రీరామనవమి రోజున ఏకాగ్ర చిత్తుడై (అంటే మనస్సును దేవుని యందే నిలిపిన వాడై) జపము చేయుచునుండి, మరునాడు పునః పూజ చేసి (అంటే మరల పూజించి) సంపూర్ణ భోజనము దక్షిణ దానములచే బ్రాహ్మణులను సంతోషింప చేయుటచే లోకాభి రాముడైన శ్రీరాముడు అనుగ్ర హించును. (సంతోషించును) కావున మనుజుడు ధన్యుడు అగును. ఈ విధముగ పన్నెండు, సంవత్సరములు చేయుటచే సర్వపాపకర్మలు నశించిన వాడగును.

రామమంత్రము తెలియనివాడు ఈ వ్రతము రోజున ఉపవాసము ఉండి (అంటే భోజనము ఇంకా ఆహార పదార్దములు ఏమియు తీసుకొనక) శ్రీరామ స్మరణ చేసిన చో అన్ని పాపములు పోయిన వాడగును. మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్న వాడై ప్రతి గంట నిశ్చల మైన మనసు కలవాడై, మోక్షమును కోరినవాడై పుజించువాడు సర్వదోషములచే విడువబడి నాశనములేని శ్రీరామ తారక పర బ్రహ్మమును పొందునని ' అగస్త్య మహర్షి వివరించెను.

(కట్టుకొని) ఒక మానిక (అనగా ఒకకిలో) బియ్యపుపిండితో మూడు పిష్టకములు చేసి, ఒకటి ' తులసీ 'కి నైవేద్యం చేసి,

బ్రాహ్మణునకు ఒకటి ఇచ్చి, మిగిలిన ఒక ముద్దను, రోటియందు ( అంటే చెట్నీ చేసుకొనుటకు రాయితో చేసిన దానిని రోలు అందరు) వేసి, అందులో పాలుపోసి, చెరకు గడలు కొద్దిగా వేసి దంచవలయును. ఇలా దంచిన ఆ క్షీర బిందువులు (అనగా పాల చుక్కలు) ఎన్ని దంచుతున్న వారి శరీరమున పడుతున్నవో అన్ని సంవత్సరములు స్వర్గలోకమునందు ఉండెదరు అని చెప్పగా విని శ్రీకృష్ణ మూర్తి ఇట్లు పలికెను. ఓ నారదమునీ! ఆ వ్రతము ఎవ్వరు చేసి, ఏమి ఫలము పొందిరి అనగా విని నారదుడు ఇలా చెప్పెను.

ఓ దేవీ నందనా! పూర్వము ఉత్తర దేశ మందు వేద శాస్త్రములను ఎరిగిన వాడగు దేవ దత్తుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. తనకు సంతానము లేక పోవుటచే, త్రైలోక్య పావనుడైన విష్ణుమూర్తిని గూర్చి తపస్సు చేయుటకు ఒక మహా అరణ్యమున (అడవి)కి పోయి ఒక గుంట వద్ద కూర్చుండి, మహా ఘోరమైన తపస్సు చేసెను. తరువాత విష్ణుమూర్తి వృద్ద బ్రాహ్మణరూపంలో (అనగా ఒక ముసలి బ్రాహ్మణ వేషం వేసుకొని) అతనికి ప్రత్యక్షమయ్యెను. ఓ బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడా నీవు ఎందుకు ఇలాంటి ఘోరమైన తపస్సు చేస్తున్నావు. అని అడుగగా ఆ 'బ్రాహ్మణుడు' శ్రీమన్నారాయమూర్తికి ప్రదక్షిణ నమస్కారము చేసి, ఓ శ్రీ మహావిష్ణు! మీ పాదములు (అనగా కాళ్లు) దర్శించుట (అనగా చూచుట) చేత నా జన్మము సఫలమైనది. నేను కృతార్ధుడను ఐతిని (అనగా ధన్యుడ నైతిని) అని అనేక విధములు స్త్రోత్రము చేసి నిలిచి వున్న బ్రాహ్మణుని చూచి, ఓ బ్రాహ్మ బ్రాహ్మణోత్తమా! నీకు కావలసిన 'వరం' కోరుకోమని అనగా ఆ దేవదత్తుడు ఇలా అనెను. ఓ వాసుదేవా! " '' అపుత్ర స్యగ తిర్నాస్తి " అని ధర్మశాస్త్రములు చెప్పుచున్న విగదా! పుత్రులు లేనివారికి (అనగా కొడుకులు లేని వారికి) గతి లేదు కదా! కావున నాకు పుత్రుడు కలుగునట్లు అనుగ్ర హింపుము. అని ప్రార్దింపగా శ్రీమహా విష్ణువు 0ఇలా పలికెను.

ఓ బ్రాహ్మణుడా! ' ఆయువు ' లేని కుమారుని ఐననూ, విధవ ఐన కూతురును ఐననూ ఇచ్చెదను. ఈ ఇద్దరిలో నీకు ఎవరు ఇష్టమో చెప్పుము అనగా అతడు ఇంటికి పోయి భార్యను అడిగి తెలుసుకొని వచ్చి, చెప్పెదను అని చెప్పి అతడు ఇంటికి వెళ్లి భార్యను అడిగి తెలుసుకొనక, ఆలోచింపక ' విధవ ' అగు కూతురు కలుగునట్లు కోరుకొమనిన ఆబ్రాహ్మణుడు మరల 'గంట' దగ్గరకు వచ్చి కమలనాధుడైన శ్రీ హరికి నమస్కరించి కుమార్తె కలుగునట్లు వరము ఇమ్మని అడుగగా శ్రీహరి అలాగే అని భర్త్ర విహీన అగు కుమార్తె (అనగా విధవ) కూతురు కలుగుగాక అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యెను (వెడలి పోయెను) తరువాత దేవదత్తుడు ఇంటికి వచ్చి సుఖముగా ఉండెను. తరువాత కొన్ని రోజులకు ఆ దేవదత్తుని భార్య గర్భవతి ఐనది పడవ నెల ఒక కుమార్తెను కన్నది. ఆ బాలిక రోజు రోజుకి వృద్ది చెందుచుండెను. వివాహ కాలమువచ్చిన వెంటనే ఆమె తండ్రి ఐన దేవదత్తుడు ఒక చిన్న బ్రాహ్మణునకు ఆమెను ఇచ్చి వివాహము జరిపించెను. ఇట్లు పెళ్ళి జరిగిన రెండు, మూడు నెలలకే ఆమె భర్త చనిపోయెను. తరువాత కొన్నిరోజులలోనే ఆమె తల్లితండ్రులు కూడా చనిపోయిరి. 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat