మదురై, దక్షిణ భారతం, తమిళనాడులో రెండవ పెద్ద నగరం. ఈ ఆలయ నగరం వైగై నది ఒడ్డున ఉన్నది మరియు ఇక్కడ జనావాసాలు ఎక్కువగా ఉండే పురాతన నగరాలలో ఇది ఒకటి. ఈ నగరానికి ఉత్తర దిక్కున సిరుమలై హిల్స్ మరియు దక్షిణాన నాగమలై హిల్స్ ఉన్నాయి. ఈ నగరానికి మదురై అనే పేరు 'మధుర' అనే మాట నుండి వొచ్చింది. మధుర అంటే 'తీపి' అని అర్థం. ఈ నగరం మీద శివుడు దివ్యమైన తేనె వర్షం కురిపించాడని చెపుతారు.
మదురైని 'నాలుగు జంక్షన్ల నగరం', 'తూర్పు ఏథెన్స్','పండుగలు నగరం', 'లోటస్ నగరం' మరియు 'స్లీప్ లెస్ నగరం' అని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఈ నగరానికి ఉన్న ఈ పేర్లు దీనికి తగినట్లుగానే ఉన్నాయి. ఈ నగరం లోటస్ ఆకారంలో ఉన్నది కాబట్టి దీనికి 'లోటస్ సిటీ' అని పేరు వొచ్చింది. ఈ నగరం 24X7 పని సంస్కృతిని కలిగి ఉన్నది, కావున దీనికి 'స్లీప్ లెస్ సిటీ' అని పేరు వొచ్చింది. ఈ నగరంలో రెస్టారెంట్స్ 24 గంటలు తెరిచే ఉంటాయి మరియు ఇక్కడ ప్రయాణ సౌకర్యాలు, రవాణా శాఖ రాత్రిళ్ళు కుడా పనిచేస్తాయి.
మధురై లో ఏం చేయాలి - మధురై లోమరియు చుట్టూ ఉన్నపర్యాటక స్థలాలు
మధురై నగరంలో అనేక మతాల ప్రజలు శాంతియుతంగా నివసిస్తున్నారు. ఈ నగరంలో అనేక సంస్కృతులు మరియు మతాలు యొక్క ఉనికి ఉంది. వివిధ మతాలకు చెందిన ప్రాచీన చిహ్నాలు, పద్ధతులు ఇక్కడ ఉండటంవలన ఇది ఒక ప్రముఖ పుణ్య క్షేత్రంగా మారింది. మీనాక్షి-సుంద్రేస్వర్ ఆలయం, గోరిపాలయం దర్గా మరియు సెయింట్ మేరీస్ కేథడ్రల్ ఇక్కడ ఉన్న అత్యంత ప్రసిద్ధ మత ప్రదేశాలు.
మదురైని సందర్శించినప్పుడు చూడవలసిన ఇతర ప్రదేశాలు మహాత్మా గాంధీ మ్యూజియం, కూడళ్ అజ్గర్ ఆలయం, కాజిమర్ బిగ్ మసీదు, తిరుమలై నాయక్కర్ ప్యాలెస్, వండియుర్ మరియమ్మన్ తెప్పాకులం, తిరుపరంకుండ్రం, పజ్హాముదిర్చోలై, అలగర్ కోవిల్, వైగై డ్యామ్ మరియు అతిశయం థీమ్ పార్క్.
మదురైలో ఏప్రిల్ మరియు మే నెలలలో అతిముఖ్యమైన 'చితిరై' పండుగను అతివైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను మీనాక్షి దేవాలయంలో జరుపుతారు మరియు వేలకొద్ది భక్తులు ఈ పండుగ సందర్భంగా హాజరవుతారు. ఇక్కడ పండుగను దేవత యొక్క పట్టాభిషేకం, రథోత్సవం మరియు దేవతల యొక్క వివాహం ఇలా అనేక స్థాయిలలో జరుపుకుంటారు. ఈ పండుగ విష్ణు అవతారం అయిన లార్డ్ కల్లజ్హగాని , తిరిగి దేవాలయంలోకి తీసుకుని రావటంతో ముగుస్తుంది.
ఇక్కడ తెప్పోర్చవం పండుగను జనవరి - ఫిబ్రవరి నెలలలో జరుపుకుంటారు మరియు అవనిమూలం పండుగను సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు.
మదురైలో 'జల్లికట్టు' అనే ప్రముఖ ఆటను పొంగల్ పండుగలో ఆడుతారు. ఈ ఆటను పర్యాటకులు చాలా ఇష్టపడతారు. మధురై సందర్శనం పట్టు చీరలు, చెక్క బొమ్మలు, ఖాదీ దుస్తులు మరియు విగ్రహాలు కోసం షాపింగ్ చేయకుండా ఉంటే అది అసంపూర్ణమవుతుంది.
చరిత్ర సంగ్రహావలోకనం
మధురై చరిత్రలో 1780 BCE వెనక్కి వెళితే, ఆ కాలంలో తమిళ్ సంగంలు ఉండేవి. ఈ నగరం యొక్క పేరు, అనేక శాస్త్రీయ నిపుణుల పని గురించి మేగాస్తేనేసే తన రచనలలో మరియు కౌటిల్యుని 'అర్ధశాస్త్రం' లో పెర్కున్నారు.ఈ నగరాన్ని 6వ శతాబ్దం వరకు కాలభ్రాస్ పరిపాలించారు.
కాలభ్రాలు పాలన వొచ్చేవరకు ఈ నగరం తొలి పాండ్య, తరువాత పాండ్య, మధ్యయుగ చోళులు, తరువాత చోళులు, మధురై సుల్తానేట్, మధురై నాయక్ లు, చందా సాహిబ్, విజయనగర సామ్రాజ్యం, కర్ణాటక రాజ్యం మరియు బ్రిటిష్ వంటి అనేక రాజ్యాల యొక్క ఎదుగుదల మరియు పతనాన్నిచవిచూసింది. ఈ నగరం 1801 సంవత్సరంలో బ్రిటిష్ క్రిందకు వొచ్చింది మరియు అప్పటినుండి ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక భాగంగా మారింది. ఈ నగరం ఇండియా స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
NMR సుబ్బరామన్, మీర్ ఇబ్రహీం సాహిబ్ మరియు మొహమ్మద్ ఇస్మాయిల్ సాహిబ్ వంటి నేతలు మధురై నగరంలో నివసించారు. ఈ నగరం యొక్క వ్యవసాయ కార్మికుల ప్రేరణతో అతను తన ప్యాంటు, పైజామాను వదిలివేసి, సింహపు తోలును ధరించాలని నిశ్చయించుకున్నారు.
మదురై ఎలా చేరుకోవాలి?
మదురై నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రవాణా శాఖ అనుసంధించబడి ఉన్నది. మదురై ఎయిర్ పోర్ట్, ముఖ్య నగరాలైన ఢిల్లీ,చెన్నై, ముంబై మరియు బెంగుళూరులకు అనుసంధించబడి ఉన్నది. ఈ నగరానికి దగ్గరగా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. మదురై రైల్వే, ముఖ్య నగరాలైన ముంబై, కోల్కతా, మైసూరు, కోయంబత్తూర్ మరియు చెన్నై లకు అనుసంధించబడి ఉన్నది. అలానే ముఖ్య నగరాలైన చెన్నై, బెంగుళూరు, కోయంబత్తూర్, త్రివేండ్రంలకు మదురై నుండి బస్సు సర్వీసెస్ కూడా ఉన్నాయి.
మదురై వాతావరణం
మదురై వాతావరణం చాలాభాగం చాలా వేడిగా మరియు పొడిగాను ఉంటుంది. అక్టోబర్ నుండి మార్చ్ నెలల మధ్య కాలంలో దీనిని సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉండటంవలన, పర్యాటకులు ఈ సమయంలో సందర్శించటం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంవలన, దేవాలయాలను మరియు ప్రకృతి సౌందర్యాన్ని సంతోషంగా వీక్షించవొచ్చు.