⚜️ ఉడుంబారకోట ⚜️
తరువాత వచ్చే ఉడుంబారకోట ఇక్కడ కోటయిల్ శాస్తా అనే స్వామి విగ్రహం ఉంది. ఇందు స్వామి వారి ఆయుధములు భద్రపరచియున్నవి. భక్తులు ప్రదక్షిణగావించి పూజలు సలుపుదురు. ఇక్కడ నీరు దొరకడం చాలా కష్టం. అందుకే లోయలోని వాగులో వాటర్ బాటిల్స్ లో నీరు నింపుకొని జాగ్రత్త పడతారు. ఆరోగ్యరీత్యా ఈ నీటిలో జీలకర్ర మొదలగు వాటిని కలిపి ఔషదీయుక్తము చేసి శ్రీ *భూతనాధ ధర్మస్థాపన సేవాసంఘం* వారు ఉచితంగానే భక్తులకు సరఫరా చేస్తారు. పోయిన ప్రాణం తిరిగి వచ్చిందా అన్నట్లు ఆ నీరు త్రాగి కొంత విశ్రాంతి తరువాత అళుదామేడు దిగడం
ప్రారంభిస్తారు. చిత్తడి నేలతో జారుతూ ఉండే ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. అంతలో కరిమలతోడు లేక కరివేలం అనే కాలువ విశ్రాంతికి స్వాగతం పలుకుతుంది. ఇక్కడ పుష్కలంగా నీరు దొరకడం వలన విశ్రాంతికి బాగుంటుంది. అయితే ఈ కాలువలో జలగల బెడద ఎక్కువ. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్న కాళ్ళను పట్టి ఓ పట్టాన వదలవు.
🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏