🔱 పుదుచ్చేరి కొండలు 🔱
ఇంజిప్పార నుండి నడక ప్రారంభమైనచో దట్టమైన వన ప్రాంతము ప్రారంభమగును. మిక్కిలి మిట్టపల్లము లేని ఈ వన మధ్యములోని యాత్ర సుమారు 16 కి.మీవరకు కొనసాగుతున్నది. ఈ ప్రాంతమున మిన్నుముట్టేలా నిటారుగా
పెరిగియున్న మహావృక్షములు , వాటిలో అల్లుకు పోయిన తీగలు , సూర్యకాంతిని భువిపై పడనివ్వక
జాలము చూపించును. ఈ నడక కాఠిన్యము లేనిదైనను వన్యమృగముల సంచారము ముఖ్యముగా అడవి ఏనుగుల సంచారము ఎక్కువగా యుండు ఈ ప్రాంతములో భయభక్తితోను , నోట స్వామి శరణనామ సంకీర్తనతోను ఎంత వేగముగా దాటుటకు వీలగునో అంత తొందరగా దాటి వెడలెదరు. ఈ దారి మధ్యమున మోకాళ్ళ నీటితో ప్రవహించు ఒక చిన్న సెలయేరు ప్రవహించును. దీనిని 'పుదుచ్చేరి ఆరు' అని అందురు. భక్తాదులు మలజల విసర్జనమున కొరకై ఇరుముడ్లను దించెదరు. సెలయేరు ప్రవాహము చాలా తక్కువగా యుండుట వలన పరిసర ప్రాంతము మలినముగా యుండును. కావున భక్తాదులు ఇచ్చట చాలా సేపు విశ్రమించరు. కానీ ఇచ్చటను చిన్న చిన్న కొట్లలో కప్ప గంజి , ఛాయ , కేరళ అరటిపండు మున్నగునవి లభించుచున్నది. ఇచ్చట గూడా సేవాసంఘము వారు శొంఠి నీరు సరఫరా చేయుచున్నారు. ఇచ్చట ఒక చిన్న అమ్మవారి దేవాలయము సమీప కాలము లో కట్టబడి యున్నది. ఈ స్థావరమును *'ముక్కుళి'* అనియు సంభోధించెదరు.
🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏
లోకా సమస్త సుఖినో భవంతు🙏