⚜️ కరివలా తోడు ⚜️
ఇంజిప్పారకోట్టయందు తావళమేర్పరచుకొని నివసించిన భక్తాదులు మరుసటి దినము ఉషఃకాలమునందే అచ్చటినుండి బయలుదేరి “కరివలా తోడు" చేరి విశ్రమించుటకు ప్రారంభింతురు. కరివలాతోడు చేరుకొనుటకు మధ్యదారిలో చిన్న చిన్న కాలువలను దాటవలసి యుండును. ఈ స్థలమునందు జలము సమృద్ధిగా లభించుట వలన ఇది ఒక నివాస స్థానమై అలరారుచున్నది. కావలసిన అన్ని సౌకర్యములు లేకున్ననూ ఇచ్చట ఆహారాదులు తయారుచేసికొని భుజించవచ్చును. చాలామంది వంట చేసుకొని అచ్చట భుజింతురు.
🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏
లోకా సమస్త సుఖినో భవంతు🙏