⚜️ ముక్కుళి తావళం ⚜️
కరివలాన్ తోడు నుండి సుమారు 5 కి.మీ. నడిచినచో ముక్కుళి తావళం చేరుకొనవచ్చును. అలనాటి వనయాత్రీకులు ఈ ప్రదేశమున విరి ఏర్పరుచుకొనేవారు కాదు. కాని సమీపకాలములో ఇచ్చట ఒక అమ్మవారి ఆలయము ప్రతిష్ఠించి , తావళం ఏర్పరుచుకొనుటకు వసతి సౌకర్యములు కల్పించియున్నందున నేటి కాల పెద్దపాదంలో వెళ్ళే వారు ఈ ముక్కుళిలో తావళం ఏర్వరుచుకొని కాస్త విశ్రమించి యాత్ర గావించెదరు. ఎరిమేలి నుండి జీపు మార్గముగా ముక్కుళి దాకా వచ్చేందుకు అవకాశం కూడా గలదు. ఇటునుంటి బయలుదేరు వేళ సరైన మార్గమును అన్వేషించుకొంటూ ముందుకు నడువవలెను. దారితప్పి పోయినచో మరల ఎరిమేలి చేరుకొనవలసి వచ్చును.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏