🔱 శబరిమల వనయాత్ర - 6 ⚜️ అళుదానది స్నానము ⚜️

P Madhav Kumar


⚜️ అళుదానది స్నానము ⚜️

కాళైకట్టి నుండి సుమారు ఒకటిన్నరమైలు దూరమున తూర్పు దిక్కున అళుదానది ప్రవహించుచున్నది. ఇది వెళ్ళి పంబానదిలో కలియును. ఈ నదిని సంస్కృత కావ్యములలో అలసానదిగా వర్ణించి యున్నారు. స్వామిభక్తులు ఇచ్చట తావళము వేసి విశ్రాంతి పొందుదురు. సాయంసమయ సంధ్యవేళలందు భక్తాదులు శరణఘోషములతో నామ సంకీర్తనములతో , శంఖము , చెండమద్దెల , చేంగిల మొదలగు సంగీత వాయిద్య లయలతో ఆ అళుదానదీ తీరమున స్వామిని కొలుచుట చూచిన ప్రతి వారికిని

హృదయముప్పొంగి పోవును.


మొత్తము మీద చెప్పవలెనంటే పరమకారుణ్యుడు , సత్యస్వరూపుడూ అయిన శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క కృపాకటాక్షము భక్త జనులపై అడుగడుగునా

ప్రసరించుచూ వారికి బ్రహ్మానందమును కలిగించుచూ , శ్రమ తీర్చునట్లుండును అని మాత్రము చెప్పవచ్చును. అళుదానదీ తీరమున కర్పూర ఆళి తయారు చేసి భక్తాదులందరూ చుట్టూ నిలబడి శరణాలిలా పలికెదరు. 


స్వామి శరణం - శరణము శ్రీ అయ్యప్పా , స్వామి లేనిదే - శరణము లేదయ్యప్ప , అళుదానదియే - శరణము శ్రీ అయ్యప్పా అళుదలో స్నానము - శరణము శ్రీ అయ్యప్పా అళుదలో తావళం - శరణము శ్రీ అయ్యప్పా అళుదలో ఆళియు - శరణము శ్రీ అయ్యప్పా , ఆనందమానందము - శరణము శ్రీ అయ్యప్పా , అనందమూర్తీ - శరణము

శ్రీ అయ్యప్పా , ఆనందమిమ్ము - శరణము శ్రీ అయ్యప్పా .


అని భక్తితో అయ్యప్పస్వామి నామావళి మిక్కిలి ఉచ్చస్థాయిలో పాడుచూ ,

ఆనందించుచూ ఒక పగలు - రాత్రి అచ్చట గడుపుదురు. కొందరు పళమస్వాములు కర్పూర ఆళియందు భస్మము తీసి భద్రపరిచి ఆత్మీయులకు పంచిపెట్టుదురు. తీసికొనెడి వారు దానిని శ్రీ అయ్యప్పస్వామి వారి ప్రసాదముగా స్వీకరింతురు.


🙏🥀ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🪷🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat