🔱 శబరిమల వనయాత్ర - 7 ⚜️ అళుదానదిలో రాళ్ళు తీయుట ⚜️

P Madhav Kumar


⚜️ అళుదానదిలో రాళ్ళు తీయుట ⚜️

మరుసటి దినము ఉషఃకాలముననే కన్నిస్నాములైన కన్ని అయ్యప్పలు మంచును , చలిని లెక్కించక అళుదానది యందు స్నానము చేయుదురు. అప్పుడు వారి వారికి దొరుకు రెండు చిన్న పెద్దరాళ్ళను తీయుదురు. రాళ్ళు తీయునది మొట్టమొదటిసారిగా మునుగునప్పుడే తీయవలయును. ఆ రాయిని జారవిడువక వస్త్రము యొక్క అంచున ముడిపెట్టి భద్రపరచుకొని దానిని *“కల్లిడుంకుండ్రు"* అని చెప్పబడు స్థలమునకు చేరుకొనునప్పుడు అచ్చట విసిరివేయ వలెను. ఈ రాళ్ళను మరచిపోయి జ్ఞప్తియందుంచుకొనక లేక అశ్రద్ధ వలననో జారవిడిచినచో పెరియస్వామి వారి పట్ల నేరము చేసిన వారగుదురు. దానికై ప్రాయశ్చిత్తము కన్నిస్వాములు చేసుకొనవలసి యుండును.


🙏💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat