🔱 శబరిమల వనయాత్ర - 8 ⚜️ అళుదామిట్ట ⚜️

P Madhav Kumar


  ⚜️ అళుదామిట్ట ⚜️


అళుదానది నుండి రాళ్ళను తీసుకోవచ్చు భక్తుల సహనమున , శ్రమనూ పరీక్షించు చున్నట్లుగా రెండు మైళ్ళ దూరము కఠినమైనటువంటి ఎతైనటువంటి ఒక ప్రదేశమున్నది. దానిని దాటినపుడు అయ్యప్పలు దీర్ఘ నిశ్వాసములతో చెమటలు గ్రక్కుచూ అళుదామిట్టె - కఠినము అయ్యప్ప తోడుగ నుండి - దాటించు అయ్యప్పా


అనియునూ , ఇంకనూ ఇతర శరణఘోషములను అత్యుచ్ఛ స్థాయిలో పలుకుచూ ఆ సచ్చిదానందమూర్తిని తలచుకుంటారు. ఎంతటి వీర , శూర పరాక్రమ శాలియైననూ ఈ మిట్ట ఎక్కు వేళ కొంచమైన శ్రమ అనుకొనక మానడు. పర్వత యాత్రలో ఎక్కవలసియున్న అనేక మిట్టలయందు పెద్ద భారమనిపించునది ఈ అళుదామేడు ఎక్కడమే అగును. అయిననూ ఆనాటి నుండి ఈ నాటిదాకా బాలలూ , వృద్ధులూ , వికలాంగులతో సహా అందరూ ఆ మిట్ట ఎక్కుతున్నారన్న అది స్వామియొక్క అనుగ్రహ శక్తిగా మరియొకటికాదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అందుకే పెద్దలు అందరూ, "భగవంతుని నమ్మి చెడినవాడు లేడు" అని.


🙏🌷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat