🔱 శబరిమల వనయాత్ర - 9 ⚜️ కల్లిడుంకుండ్రు ఎక్కి , రాళ్ళను వేసి నమస్కరించుట ⚜️

P Madhav Kumar


⚜️కల్లిడుంకుండ్రు ఎక్కి , రాళ్ళను వేసి నమస్కరించుట⚜️

అళుదానదీ తీరము నుండి కాలినడకగా ఇరుముడి సైతము ప్రయాణమయ్యే అయ్యప్ప భక్తాదులు అళుదామిట్ట ఎక్కుదురు. ఈ వనయాత్రలోనే కరిమల ఎక్కుటయే కఠినం అనే నానుడిని అళుదామిట్ట ఎక్కేటప్పుడు కరిమల ఏట్రము ఇంతకన్నా కాఠిన్యమైనది కాదు అని అనిపించింది రీత్యా గుండ్రాళ్ళతో నిండిన నిటారుగా ఈ అళుదామిట్ట కనిపించింది. ప్రతి గజమునకు నిలబడి ఇరుముడిని దించి సేదతీర్చుకొన్న పిమ్మటే యాత్రను కొనసాగించవలసియున్నది. ఈ దారిలో చివరిదాకా మంచి నీరు లభించుట అసాధ్యము గనుక భక్తాదులు ముందు జాగ్రత్తగా అళుదు నుండి పాత్రలో , వాటర్ కేన్లలో మంచి నీటిని నింపుకొని అచ్చటచ్చట దాహశాంతి చేసుకొనుచు అంచెలంచెలుగా ముందుకు సాగుతారు. అళుదా మిట్ట సగము దాటగానే చిన్న , పెద్ద గుండ్రాళ్ళతోను , గులక రాళ్ళతోను నిండిన ఒక చిన్న గుట్టను కానవచ్చును. ఈ ప్రదేశమును *'కల్ ఇడుంకుండ్రు'* అని అందురు. ఈ ప్రదేశమును చేరుకొను భక్తాదులు ఇరుముడులు దింపి కాసేపు విశ్రాంతి పొందిన పిమ్మట వారు అళుదానది నుండి కొని తెచ్చిన రాళ్ళను ఆ కల్లిడుంకుండ్రునందు విసరివేసి ఆ గుట్టకు కర్పూర హారతి చూపించి మ్రొక్కిన పిమ్మట తమ పయనమును కొనసాగిస్తారు. శబరిమల వనయాత్రలో మనము ఆచరించు ప్రతియొక్క చర్యకు ఒక పరమార్థ తత్వమున్నదని మన పెద్దలందరు. మహిషి సంహారము ముగిసినది. దేవతల పాలిట సింహస్వప్నమై యుండిన మహిషిని శ్రీ అయ్యప్పస్వామి వారు వధించే దివ్య సన్నివేశమును దర్శింప తలచిన ముప్పది ముక్కోటి దేవతలు అలసానదీ తీరమునకు చేరిరి. మహిషి శరీరము నుండి బిందు రక్తము గూడ నేల వాలనివ్వక ఆమె యొక్క శ్వాసకోశములను తన పాదముతో మధించి ఆమెను సంహరించి , ఆ కళేబరమును తన పాదముతో గగనముపై కిసిరెను. దేవతలు పుష్పవృష్టి కురిపించి ఉత్సాహభరితులై జయఘోషమును ఘోషించి స్వామి శబరిమల వనయాత్రలో మనము ఆచరించు ప్రతియొక్క చర్యకు ఒక పరమార్థ తత్వమున్నదని మన పెద్దలందరు. మహిషి సంహారము ముగిసినది. దేవతల పాలిట సింహస్వప్నమై యుండిన మహిషిని శ్రీ అయ్యప్పస్వామి వారు వధించే దివ్య సన్నివేశమును దర్శింప తలచిన ముప్పది ముక్కోటి దేవతలు అలసానదీ తీరమునకు చేరిరి. మహిషి శరీరము నుండి బిందు రక్తము గూడ నేల వాలనివ్వక ఆమె యొక్క శ్వాసకోశములను తన పాదముతో మధించి ఆమెను సంహరించి , ఆ కళేబరమును తన పాదముతో గగనముపై కిసిరెను. దేవతలు పుష్పవృష్టి కురిపించి ఉత్సాహభరితులై జయఘోషమును ఘోషించి స్వామి శబరిమల వనయాత్రలో మనము ఆచరించు ప్రతియొక్క చర్యకు ఒక పరమార్థ తత్వమున్నదని మన పెద్దలందరు. మహిషి సంహారము ముగిసినది. దేవతల పాలిట సింహస్వప్నమై యుండిన మహిషిని శ్రీ అయ్యప్పస్వామి వారు వధించే దివ్య సన్నివేశమును దర్శింప తలచిన ముప్పది ముక్కోటి దేవతలు అలసానదీ తీరమునకు చేరిరి. మహిషి శరీరము నుండి బిందు రక్తము గూడ నేల వాలనివ్వక ఆమె యొక్క శ్వాసకోశములను తన పాదముతో మధించి ఆమెను సంహరించి , ఆ కళేబరమును తన పాదముతో గగనముపై కిసిరెను. దేవతలు పుష్పవృష్టి కురిపించి ఉత్సాహభరితులై జయఘోషమును ఘోషించి స్వామి

అయ్యప్పను పలురీత్యా స్తుతింపసాగిరి. పిదప అందరూ కలిసి బ్రహ్మహత్యా దోషము తొలగుటకొరకు ప్రవహిస్తున్న అలసా నదిలో దిగి స్నానమాడసాగిరి. అదే వేళ శ్రీ వారిచే గగనముపైకి విసరబడిన మహిషి యొక్క భౌతిక కాయము అలసానదికి సమీపమున నేలబడి క్షణక్షణముగా పెరిగి మిన్ను ముట్టసాగెను.


దీనిని గాంచిన దేవతలు ప్రతివారు స్నానమాడుచునే ఆ అలసానదిలో పడుండు (చిన్నదో - పెద్దదో) తమ చేతికి కందిన రెండు రాళ్ళను తీసి మహిషి కళేబరముపై విసిరి

ఆమె శరీరమును పెరుగనివ్వక రాళ్ళతో సమాధి కట్టిరి. ఆ స్థలమే నేటి కల్లిడుంకుండ్రు. నాటి నుండి శబరియాత్రకులైన ప్రతివారు అళుదా స్నానమాడువేళ తమచేతికి దొరికిన రెండు రాళ్ళను తీసి భద్రపరుచుకొని కల్లిడుంకుండ్రు నందు విసిరే సాంప్రదాయమునుగైకొనిరి. నేటికిని ఆచారమును అనుసరించియే భక్తాదులు తమ శబరిమల యాత్రలో అళుదాస్నానము చేసి ఆ నదినుండి రెండు రాళ్ళను తీసి భద్రపరచుకొని దానిని కల్లిడుంకుండ్రు నందు విసిరి మన ఈ వనయాత్రకు , స్వామి అయ్యప్ప దర్శనమునకు కారకురాలైన మహిషిని స్మరించి మ్రొక్కుట యను

అలవాటును గైకొనుచున్నారు.


అయ్యప్ప భక్తులు ముఖ్యముగా తొలిసారిగా యాత్ర చేయు భక్తులు అళుదాస్నాన వేళయందు వస్త్రము యొక్క అంచున ముడివేసి భద్రపరచి యుంచిన అళుదామిట్ట దారికి సమీపమున నున్న ఒక భాగమునగల బండరాయిపై భక్తితో నమస్కరింప వలెను. దేవలోకము నుండి మహిషి శరీరము ఎత్తి శ్రీ భూతనాథ స్వామి విసిరిన వేళ ఆ శరీరము అలసానది యొక్క తీరమున వచ్చి పడెననియూ , దానివలన లోకోపద్రవము కలుగక యుండుటకు , బ్రహ్మోపదేశము ననుసరించి పాషాణములతో దేవతలు ఆమును మూసి ఉంచిరనియూ శరీర పురాణములు చెప్పుచున్నవి. ఆ సాంప్రదాయము ననుసరించియే నేటికిని (కల్లు) రాయిని వేయు చున్నయ్యూ పెద్దల అభిప్రాయము. ఆ రాళ్ళు వేయుట వలన అక్కడి దేవతలు భక్తుల పాపములనెడి

ఆ రాళ్ళను తీసికొని ఆ పాపములు నశింపచేయుదరనియూ ఒక విశ్వాసము.


🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌻🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat