అచ్చన్ కోవిల్ శాస్తా గుడి అయ్యప్పన్ వెలసిన్ ప్రధాన ఐదింటిలో ఒకటి. ఇక్కడ అయ్యప్ప గృహస్తాశ్రమంలో ఉంటాడు. అతనికి పూర్ణ, పుష్కళ అనే ఇద్దరు భార్యలున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడి విగ్రహ ప్రతిష్ట పరసురాముడు చేశాడని నమ్మకం.
అచ్చన్ కోవిల్ శాస్తా ఆలయం విషపు పాముల కాటు నుంచి రక్షిస్తుందని నమ్మకం. ఇక్కడి విగ్రహం ఎడమచేతిలో ఎప్పుడూ చందనం, తీర్థం ఉంటాయి. పాముకాటును రక్షించే శక్తిగలవి ఈ చందనం తీర్థాలు.
ఇతర ఉపదేవతలు శాస్తాకు సంబంధించిన వారుంటారు. ఇక్కడి పూజాది కార్యక్రమాలలో తమిళ సంప్రదాయం బాగా కనిపిస్తుంది.
శబరిమల యాత్రాకాలంలో భక్తు ఇక్కడికి వస్తారు. ఇది కూడా పరశురామ ప్రతిష్టితమని నమ్మకం. శాస్తా ఇరుపక్కల పూర్ణ, పుష్కలలనే దేవేరులు ప్రతిష్టింపబడ్డారు. ఇక్కడ పర్వదినాలు 1-10 దాకా మలయాళ ధనుర్మాసం
(డిసెంబరు- జనవరి లలో) జరుపుతారు.