ఆర్య్ంగావు అయ్యప్ప గుడి ప్రసిద్ధమైంది. కేరళలో ప్రసిద్ధ అయ్య్ప్ప ఆలయాలు ఐదింటిలో ఇది ఒకటి. దీన్ని ఆర్య్ంగావు శాస్తా ఆలయం అంటారు. అయ్యప్పస్వామి ఇక్కడ యువకుడిగా దర్శనమిస్తాడు. ఆర్యంగావులో వెలసిన స్వామి తిరు ఆర్యన్ అంటారు.
అడవి మధ్యలో తిరువనంతపురం – తెన్కాశిల హైవేకి దగ్గరలో ఉంది. శబరిమలలో లాగే 10-50 ఏళ్ళ మధ్య స్త్రీలకు ప్రవేశం లేదు. ఆర్యంగావు శాస్తా గుడిలో తమిళ ఆచారాల ప్రకారం పూజలు జరుగుతాయి. గర్భగుడిలో శాస్తా, శివుడు, దేవి ముగ్గురూ ఉంటారు. శాస్తా మధ్యన ఉండగా దేవి ఎడమవైపు, శివుడు కుడి వైపు ఉంటారు.
శబరిమల మండల కాలం చివరలో ఇక్కడ విశేషపూజలు జరుగుతాయి. ప్రధాన ఉత్సవాలు – పాండ్యన్ ముడిప్పు, తిరుక్కల్యాణం, కుంభాభిషేకం. గుడికి తెన్కాశి, పునలూర్, కొల్లం ల దారి మీదుగా చేరవచ్చు.