అమృత బిందువులు - 10 ఆలోచనా తత్వం - 2

P Madhav Kumar


*ఆలోచనా తత్వం - 2*

కాళ్ళులేనివాడు పాదరక్షలగురించి ఆలోచించనేకూడదు ! అది అక్కరలేనిది.


పండ్లు లేనివాడు చెఱకు తినాలనుకునేకూడదు ! ఇది వీలు కానిది. 


జ్వరం వున్నవాడు ఐస్క్రీమ్ తినాలనుకునేకూడదు అనారోగానికి దారి.


తలచినది సాధించేవరకు విశ్రమించకూడనేకూడదు ! కార్యశూరిని లక్షణం. 


అల్పులతో సహవాసం చేయనేకూడదు ! అది ప్రమాదకరం.


భోజనవేళ మాట్లాదనేకూడదు ! అది మంచి లక్షణం.


ఆడ వాళ్ళపై అపవాదు వేయనేకూడదు ! అది సమాజ హాని. 


అబలలను హింసించనేకూడదు ! అది అత్యాచారమునకు సమం. 


తల్లితండ్రుల మనసు క్షోభపెట్టనేకూడదు ! అదియే నీకు పునరావృతం కాగలదు. 


చెడు సహవాసం చేయనేకూడదు ! అది జీవితమును పతనం కావించును. 


పరస్త్రీలతో ఏకాంతంలో మాట్లాడనేకూడదు ! అది ప్రమాదకరం. 


ఉపవాసవేళ వంటలు గూర్చి ఆలోచించనే కూడదు ! అది వ్రత భంగం. 


బంధువులతో తగాదాలాడనేకూడదు ! అది కేశకరం. 


మిత్రులను అనుమానించనేకూడదు ! అది అనర్థకరం. 


మనస్సున చెడుతలంపులుండనే కూడదు ! అది హానికరం. 


ఎన్నడూ అబద్దమాడనేకూడదు ! అది నిలువునా చీల్చి వేయును. 


భయపడుతూ మధ్యస్తం చేయనే కూడదు ! అది చేతగానితనం. 


పెద్దలను తూలనాడనే కూడదు ! అది దైవ నిందతో సమం. 


అబద్దపు సాక్ష్యం చెప్పనేకూడదు ! అది అత్మ వంచన. 


రోగులపై బలప్రయోగం చేయనేకూడదు ! అది మూర్కుల లక్షణం. 


పసిపిల్లలను ఏడ్పించనేకూడదు ! అది పైశాచికత్వమగును. 


బ్రాహ్మణులను హేళన చేయనేకూడదు ! అది దైవ నిందతో సమం. 


పేదరికాన్ని పరిహాసమాడనేకూడదు ! ఒక నాడు మనమలాకావచ్చును.


తోబుట్టువులతో గొడవ పడనేకూడదు! అది వంశ హాని. 


ఎట్టి పరిస్థితిలోను ఆడవారిపై చేయి చేసుకోనే కూడదు ! మగతనం కాదు.


ఎట్టి పరిస్థితిలోను ఆత్మ స్థైర్యాన్ని పోగొట్టుకొనే కూడదు ! వివేకుల లక్షణం. 


ఎట్టి పరిస్థితిలోను ఇరుగు పొరుగువారితో తగువులాడనేకూడదు ! 


ఇతరుల సొమ్ముపై ఆశపడనేకూడదు అది మన సొమ్ముకే హానికరం.


దైవారాధన చేయక భోజనం చేయనేకూడదు ! అది దొంగ తిండికి సమం.


పనివాళ్ళపై దాడి చేయనేకూడదు ! అది అడుసు త్రొక్కినట్లు.


తాంబూలం ధరించి ఆలయప్రవేశం చేయనేకూడదు ! అది మర్యాద కాదు. 


ఆడవాళ్ళు బోర్లపడిసాష్టాంగ నమస్కారం చేయనేకూడదు ! ఇది శాస్త్రం.


నీచకృత్యములను చేయనేకూడదు ! అది అశాంతికి దారితీయును.


దుష్టసహవాసం చేయనేకూడదు ! అది ప్రాణహానిని కలిగించును.


నేరస్థులకు ఆశ్రయ మివ్వనేకూడదు ! అది దేశ ద్రోహ చర్య యగును. ద్రోహులకు మన్నింపు ఇవ్వనేకూడదు ! అది ఏనాటికైనా ముప్పే ,


గురుద్రోహం చేయనేకూడదు ! అది ఉత్తమ శిష్యుల లక్షణం కాదు.


దైవనింద చేయనేకూడదు ! అది పాపకృత్యం అగును. 


ఆత్మస్తుతి చేసుకోనే కూడదు ! అది హానికి దారితీయును.


కులమతాల గూర్చి మాట్లాడనే కూడదు ! అది చట్ట విరుద్ధం.


మండల దీక్షలేక ఇరుముడి కట్టుకొననే కూడదు ! అది ఆచారహీనం అగును.


సూతకంతో దీక్షామాలను ధరించనేకూడదు అది పద్దతి కాదు.


ఆలయాలను అపవిత్రం చేయనేకూడదు ! అది దైవనిలయాలు.


బంధువులింట అధికారప్రయోగం చేయనేకూడదు ! అది మన స్థలంకాదు. 


ఆత్మీయులవద్ద ప్రగల్బాలు పలుకనేకూడదు ! అది తెలివితక్కువ తనం.


ఎట్టి పరిస్థితిల్లోను చట్టాన్ని ఆతిక్రమించనేకూడదు ! అది నేరమగును.


పిచ్చి వానివద్ద తెలివితేటలు ప్రదర్శించనేకూడదు ! మనకు పిచ్చిపట్టును.


నిప్పుతో చెలగాట మాడనే కూడదు ! అది ప్రాణ హాని. 


జలమును వృథా చేయనేకూడదు ! అది పొదుపు చేయదగినది.


పూలను నలిపి వాసన చూడనే కూడదు ! అది సువాసినులకు సమం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat