Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కపిలగోవు శ్రేష్టమైనది అంటారు. 'కపిల ' అంటే ఏమిటి? ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి? ఒళ్ళంతా నల్లని రంగు ఉంటే కపిల గోవు అని గుర్తించాలా?

P Madhav Kumar

 🕉 ప్ర :  కపిలగోవు  శ్రేష్టమైనది అంటారు. 'కపిల ' అంటే ఏమిటి? ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి? ఒళ్ళంతా నల్లని రంగు ఉంటే కపిల గోవు అని గుర్తించాలా?


జ :  ఆవులు ఏ రంగులో, ఏ రూపంలోనున్నా శ్రేష్టమైనవే. పూజ్యములే.

 కపిల శబ్దానికి  - నలుపు అని ప్రధానార్థం. నల్లని గోవుల్ని కపిల గోవులు అంటారు. అవి మరింత శ్రేష్ఠములని శాస్త్రోక్తి.

 గోవు అమృతశక్తితో దివ్యలోకాలలో ఉద్భవించినది. తొలి గోమాత సురభి. ఆమె అంశలే  విశ్వములో గోవులుగా వ్యాపించాయి. ఒకసారి  కొన్ని  గోవులు హిమగిరి పరిసరాలలో సంచరిస్తుండగా, ఒక గోవు పాలను లేగ తాగుతున్నది. ఆ సమయంలో పొదుగునుండి స్రవిస్తున్న పాలనురగ గాలికి చింది, సమీపంలో తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరునిపై పడింది. దానితో కన్నులు తెరిచిన ధూర్జటి పాలనేత్రం నుండి ఎగసిన సెగ తగిలి అక్కడి గోవులు నలుపెక్కాయి. అవి శివుని శరణు వేడి ప్రార్థించాయి. శివదృష్టి శక్తిని పొందడం చేత ఆ గోవులకు  ప్రత్యేక  శ్రేష్ఠత లభించింది. శివుడు వాటికి ప్రత్యేక పూజ్యతను వరంగా అందించాడు.

 కపిలగోవు శరీరమంతా నలుపు రంగుతో ఉండనవసరం లేదు. చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు,  నాసికా పుటములు,  గొంతు,  ముష్కములు కపిలవర్ణంతో ఉన్నా కపిలత్వ గుణానికి చాలు. ముఖ్యంగా మూపురం,  గంగడోలు ఉన్న భారతీయ గోసంతతి  - మన శాస్త్రాల్లో వర్ణించిన ఉత్తమ గోవులుగా నిర్ణయింపబడుతున్నాయి.



సామవేదం షణ్ముఖ శర్మ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow