⚜️ గురుస్వామి దక్షిణ ⚜️
సద్య (సలిది) అట్లు యథాశక్తిగా మంగళకరముగా పూర్తిచేసిన పిదప తదుపరి కార్యక్రమము గురుస్వామిగా స్వీకరించిన వ్యక్తి యొక్క సంతృప్తి కొరకునూ , అనుగ్రహము కొరకునూ అతనికి *'దక్షిణ లొసంగుట'.* గురుస్వామికి దక్షిణలొసంగవలసినది గూడా కన్ని స్వాములకు ఒక ప్రధాన కర్తవ్యమగును. దక్షిణలొసంగుటకున్న సంఖ్యకు హద్దులేదు. ఒక నయాపైస మొదలు అదిగూడా వీలుకానిచో తమలపాకు , వక్కలు మాత్రము చాలును. కాని అందరు గురుస్వాములు అందుకు తృప్తి చెందరు. కొందరు అశ్లీల పదములుగూడా ప్రయోగించి రసాభాస చేయుదురు. వారినే ధనకాంక్షులని చెప్పవలసి వచ్చును. తమలపాకును మాత్రము , లేక వారి వారి శక్తి కొలది ఇచ్చు దక్షిణతో సంతృప్తి చెందువారినే సద్గురువులుగా శ్రీ అయ్యప్ప స్వామియూ భావించును. ఈ విధముగా బోధగురువులు , బాధగురువులని రెండు విధములుగా గురువులు ఇంతకు ముందే చెప్పినట్లు మనకు ఈ శబరియాత్రలో లభింతురు. ఈశ్వర భక్తిని పెంచుటకునూ , అఖండ జ్ఞానమును బోధించుటకునూ మనలను సత్ స్వాభావులుగా తీర్చిదిద్దుటకునూ , సంస్కార సంపన్నులు గావించుటకును మాలాధార కారణ గురువగును. కనుక తీర్థ యాత్రా కాలమునందు గూడా ఈ విధమైన సత్ స్వభావులైన గురుస్వాములు మన పురాకృత పుణ్యము ననుసరించి మనకు లభింతురు. వీరు లభించుట మనకు శ్రేయస్కరమే కాక పలువిధములైన దుర్ఘటనల నుండి మనము రక్షింపబడుదుము. అట్టి సాక్షాత్ దైవ స్వరూపులైన సద్గురువులకు నా సాష్టాంగ దండ ప్రణామంబులు.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏