అమృత బిందువులు - 5 అయ్యప్ప తత్వం -1

P Madhav Kumar


*అయ్యప్ప తత్వం -1*


ప్రాణము పరమాత్మకున్ ! కండలు అగ్నిదేవునికున్ ! కాలిన ఎముకలు భూదేవికున్ ! 

వండిన వంటలు కాకులకున్ ! నిండుదనంబులు ఇష్టులకున్ ! మోహనస్త్రీలు వారివారికున్ ! 

ఈ బంధ యుగంబునన్ తాము సేయు నామమే కూడవచ్చున్ ! భగవన్నామమే కూడవచ్చున్ ! 

అయ్యప్ప నామమే కూడవచ్చున్ !


ఆలుబిడ్డలన్నదమ్ములెవ్వరు నీవెంటరారు ! ఇంటిదాకా ఇల్లాలు ! వీధి దాకా బంధువులు ! కాటిదాకా తనయుడు ! చివరిదాకా ఎవరు ? అయ్యప్ప నామమే కూడవచ్చున్ కూడవచ్చున్ కూడవచ్చున్ !


శబరిమల యాత్రకు స్వామి శరణ నామములే మార్గదర్శి ! మార్గాను చారి ! మార్గబంధువు కూడా ! అని పెద్దలంటుంటారు ! 


రామనామమే లడ్డంట అది తిన్నవారికే తిపంట ! శరణుకోటియే మిన్నంట అది వ్రాయువారికే తెలుసంట !


నిన్ను ఏమార్చనెంచి నల్లబట్టలు కట్టిన నన్నే మార్చి పడేశావు అయ్యప్ప నాలో ఉండే నీకు అభివందనం.


అక్కరకే రానివారలను సైతం అక్కున చేర్చే అయ్యప్ప ! దారి తప్పిన వారందరినీ దరికిచేర్చే ఓ స్వామీ ! నా నేరములెంచక మన్నించుము స్వామి అయ్యప్ప. 


మట్టిలో జనించి మట్టిలోచేరే మనిషి అనే బొమ్మను మనీషిగా జేసి మాల అనే పేర మంత్రమేదో వేసి మట్టిలోంచి మణిని వేరుచేయు స్వామి అయ్యప్ప.


కోటి దీపాలతోటి కులికే నీకెవరు సాటి. పోటీలేని నేటి దేవుడు నీవే అయ్యప్ప 


అయ్యప్పా అని పిలువ వలే తియ్యదనము చవిచూడవలే పాలుమీగడల పంచదారల మధు సుదారసము మరువలే.


*శరణములంటే మరణము లేదు. స్వామి నామమే తారక మంత్రం.*


తరుణమిదిగో వచ్చెను చూడు శరణు కోటిని వ్రాయుము స్వామీ.


ఒక్కొక్క శరణ నామం వ్రాసినపుడు మనతప్పులు ఒక్కొక్కటి మన్నించ బడును.


మరొక్క శరణ నామం వ్రాసినపుడు మన కోరికలొక్కక్కటిగా తీరును. మన తప్పులు మన్నిచబడి కోరికలన్నియు నెరవేరవలయు నంటే...! ప్రతివారు ప్రతినిత్యం శరణు కోటిని లెక్కించక వ్రాస్తూ యుండ వలసినదే.


*శరణమన్న ప్రతివారికి స్వామి స్వంతం. అయ్యప్ప కోవెలలో కులమతాలు అడ్డు రావు. ఒక్కసారి పిలిచినా పలికే దైవం స్వామి అయ్యప్ప కోటాను కోట్లకు ఇష్టదైవం.*


*ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల - భూలోక కల్పతరువు ఈ శబరిమల.* 


మనలో దాగున్న కామక్రోధాదులను వేటాడగా విలుబూని పంపాతీరాన శబరిపీఠం పైన వేచియుండును స్వామి అయ్యప్పు.


నాకెందుకు నాగురించి దిగులు. ఆస్వామికి కదా అనుదినం నాదిగులు. మనసా దిగులు వద్దు. టెన్షన్ అసలే వద్దు అ సీన్ వస్తే అయ్యప్పే వస్తాడు. ఓం స్మామియే శరణమయ్యపా అని ఊరుకుంటే పోలే...!


తెలిసీ తెలియక ఏవేవో వాగి నిను విసిగించితినా ఓ స్వామి ! సర్వము నీవని నమ్మిన దాసుని దయగొనవేమి ఓ యోగీ ! 


హరిహరసుతుని పుణ్య నామ చింతనే గాక పనియేమి మనకు సోదరులారా ! కరము తీరదా మనబ్రతుకు మారదా ? స్వామి చరణాలను నమ్ముకుంటే...!


ఏపూలతో నిను పూజించగలనూ , పూలన్ని నీ నవ్వులైతే అండము పిండము బ్రహ్మండమే నీవు ! కైమోడ్చి నిలిచేము కావరారా !


గురువాయురప్పను అభిషేకించిన తైలము వాతరోగనివారిణిగా ప్రసిద్ది గాంచినదియగును. అంబలపుళ్ళ పాల్ పాయసం మిక్కిలి శ్రేష్టమైనది యగును. రుచికరమైనదీ అగును. అయ్యప్పను అభిషేకించిన నేయి , భస్మము సర్వరోగనివారిణిగా తలచి దాచిపెట్టుకోదగిన దగును.


*దీక్షా సమయములో శనీశ్వరుని వలన కలుగు బాధల నివృత్తికై నల్లని వస్త్రములు ధరించవలయును.*


భక్తులు దివ్య పదునెట్టాంబడి నధిరోహించిన తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శించుకునే ఆలయములోనికి ప్రవేశిస్తారు.


మకర సంక్రమణము ముగిసి అరవ సంవత్సరము తైనెల 7న (జనవరి 21 తేదీన భక్తుల క్షేమముకోరి చేయబడు *"కురిదిపూజ"* (దుర్దేవతలకు ఒసంగు

బలిపూజ) ముగిసిన పిదప మాలను విసర్జించి వ్రత విమోచనము పొంది నిత్యజీవితమున అడుగుపెట్ట వలయును.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat