⚜️ సన్నిధానమునకు యాత్ర ⚜️
పంబా స్నానము , పితృ తర్పణము , సద్య , గురుదక్షిణ క్రమముగా జరిపి శబరిగిరి కేగి భక్తితో యాత్ర గావించెడి భక్తులు ధనుర్మాసము ముప్పదవ దినము మధ్యాహ్నము దాటిన పిదప , పై చెప్పబడిన కార్యక్రమము లన్నియూ నిర్వహించి , కన్ని స్వాములుగా యుండువారు ఆ పంబానదీ తీరములో సలిది చేసియున్న నూట ఎనిమిది పొయ్యిల నుండి ఆర్పిన బూడిదను తీసి దానిని వస్త్రకాయము బట్టి భద్రపరచుకొన్న పిదప అందరు స్వామి సన్నిధానమునకు యాత్ర వెడలుదురు. ఆ దినమే మకర సంక్రమణ మగును. ధనుర్మాసమున కొన్ని వేళలలో ఇరవై తొమ్మిదవ తారీఖునే అయి ఉండును. అలా యుండిననూ *“మలనడ యందు"* ధనార్మాసమునకు ముప్పది రోజులు లెక్కించి వచ్చుదురు. మకర సంక్రమణ విశేషము గూడా ఆ దినమే. దీనికి ఒక ఏడాది గూడా మార్పు
సంభవించదు.
🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏