వేరు వేరు అర్ధములు కలిగివున్న పదములు కలిసి ఒక పదముగా అగుటను సమాసము అంటారు.
ఉదాహరణకు - తల్లి,తండ్రి = తల్లితండ్రులు
1.తత్పురుష సమాసము -
- ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము.
- ప్రధమా తత్పురుష సమాసము - పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము.
- ద్వితియా తత్పూరుష సమాసము - నెలతాల్పు = నెలను దాల్చినవాడు
- తృతియ తత్పురుష సమాసము - ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు.
- చతుర్ధీ తత్పురుష సమాసము - భూతబలి = భూతము కొరకు బలి.
- పంచమీ తత్పూరుష సమాసము - చోరభయము = చోరుని వల్ల భయము.
- షష్టీ తత్పురుష సమాసము - రాజభటుడు = రాజు యొక్క భటుడు.
- సప్తమీ తత్పురుష సమాసము - మాటనేప్పరి = మాట యందు నేర్పరి
- నై తత్పురుష సమాసము - అధర్మము - ధర్మము కానిది.
2.కర్మధారయ సమాసము -
- విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము.
- విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు.
- విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము - కపోతవృద్దము = వృద్దమైన కపోతము .
- విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము - మృదుమధురము = మదువును, మధురమును.
- ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము - తేనెపలుకు = తేనెవంటి పలుకు.
- ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ముఖపద్మము = పద్మము వంటి ముఖము.
- ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము - సంసారసాగరం = సంసారమనెడి సాగరము.
- సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము - పెన్నానది = పెన్నా అను పేరు గల నది.
3. ద్విగు సమాసము -
సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును.
ఉదాహరణకు - ముల్లోకములు = మూడగులోకములు
ఉదాహరణకు - ముల్లోకములు = మూడగులోకములు
4.బహువ్రీహి సమాసము
అన్యపదము యొక్క అర్ధము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము.
దీని అర్ధము చెడినపుడు కలది కలవాడు అని వచ్చును.
5.ద్వంద్వ సమాసము
ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును 6.అవ్యయూభావ సమాసము - సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ సమాసము. ఇందు పూర్వపదములు సామాన్యముగా అవ్యయములై ఉండును.
ఉదాహరణకు - యధాశక్తి = శక్తికి తగినట్లు
ఉదాహరణకు - పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది.