👉 శ్రీ కాశీబుగ్గ శివాలయం హైదరాబాద్ కిషన్బాగ్ :
💠 ఎంతో చరిత్ర కలిగిన ఈ శివాలయం.
మన హైదరాబాద్ లోని కిషన్బాగ్ సమీపంలో మూసీనదికి పక్కన ఈ ఆలయం కలదు.
అంతే కాదు దీనికి భూగర్భంలో శివుడికి నిరంతారాయంగా జలాభిషేకం జరుగతుంది. ఈ జలం తాగేవల్లకి జబ్బులు నయం అవుతాయి అనేది ప్రతీతి.
💠 ఈ ఆలయంలో మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. తెల్లవారుజాము 3 గంటలకు ఇక్కడ అరుదైన దృశ్యాన్ని చూడొచ్చు.
మానవ ప్రమేయం లేకుండా అభిషేకాలు జరిగే ఏకైక శివాలయం ఇది.
ఈ నీటిని సేవిస్తే క్యాన్సర్ వంటి రోగాలు కూడా మటుమాయం అవుతాయని భక్తుల నమ్మకం
ఈ ఆలయం నెహ్రూ జూ పార్క్ నుండి కేవాలం 1.7 km దూరంలో ఉంది.
🔅 చరిత్ర;-
💠 హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో మూసీ నది తీరాన్న ఉన్న కాశీ బుగ్గ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
1822లో రాజా రాఘవ్ రామ్‌జీ నిర్మించిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది.
ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి 24x7 నిత్యం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు.
💠 శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది.
ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే.
ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. మధుమేహం సమస్యలతో బాధపడేవారు సైతం ఇక్కడికి వచ్చి.. ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్తారు.
ఈ ఆలయానికి ప్రస్తుతం రాజ్‌కుమార్ భరత్ లాల్‌జీ ట్రస్టీగా ఉన్నారు.
💠 ప్రతిరోజూ తెల్లవారుజాము 3 గంటలకు పాములు ఆలయంలోకి చేరి శివుడికి అభిషేకం చేస్తాయని భక్తులు తెలుపుతున్నారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లేవారికి శివ లింగంపై పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇంతటి విశిష్టత గల ఈ ఆలయానికి చేరుకునేందుకు భక్తులకు సరైన సదుపాయాలు లేవు.
మూసీ నది దాటి ఆలయానికి రావాలంటే తాత్కాలికంగా నిర్మించిన వంతెన ఒక్కటే దిక్కని, నీటి ప్రవాహం పెరిగితే ఆ వంతెన మునిగిపోతుందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.