శ్రీకృష్ణుడు యాదవుల ఇంట పెరగడానికి గల కారణం ఏమిటో తెలుసా....??

P Madhav Kumar



🌿సాధారణంగా యాదవులు (గొల్ల వంశస్థులు) ఎక్కువగా శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంటారు.


🌸ఈ విధంగా యాదవులు కృష్ణుడికి పూజ చేయడానికి గల కారణం ఏమిటి.

? కేవలం యాదవులు మాత్రమే కృష్ణుడిని పూజ చేయడం వెనుక ఎలాంటి కథనం దాగి ఉంది అనే సందేహం చాలామందికి కలుగుతుంది.


🌿మరి కృష్ణుడికి యాదవుల ఇంట పెరిగి, వారి చేత పూజలు చేయించుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.


🌸పురాణాల ప్రకారం లోక సంక్షేమం కోసం బ్రహ్మదేవుడు పుష్కర తీర్థంలో యజ్ఞం చేయాలని పరమేశ్వరుడుతో చెబుతాడు.ఈ క్రమంలోనే శివయ్య నేను అన్నీ చూసుకుంటాను మీరు యజ్ఞం కానివ్వండి అంటూ బ్రహ్మదేవుడికి భరోసా ఇస్తాడు.


🌿వెంటనే బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి మంచి ముహూర్తం నిర్ణయించి అందరికీ ఆహ్వానం పంపుతాడు.ఈ క్రమంలోనే ముహూర్త సమయం దగ్గర పడుతుండటంతో బ్రహ్మదేవుడు సావిత్రిని తీసుకురావాల్సిందిగా ఇంద్ర దేవుడిని పంపిస్తాడు.


🌸ఈ క్రమంలోనే ఇంద్రుడు సావిత్రి దగ్గరికి వెళ్లి బ్రహ్మ చేస్తున్నటువంటి యజ్ఞం గురించి తెలియజేసి రావాల్సిందిగా సూచిస్తాడు.ఈ క్రమంలోనే సావిత్రి తన వాళ్ళు ఇంకా ఎవరూ రాలేదని, వారు వచ్చే సమయానికి అక్కడికి వస్తానని చెప్పి పంపుతుంది.


🌿ఇదే విషయమై ఇంద్రుడు బ్రహ్మ కు చెప్పగా ముహూర్తానికి సమయం మించిపోతుంది ముహూర్తం దాటిపోయిన తర్వాత కార్యం నిర్వహించకూడదని అంతలో ఈ కార్యం ముగించాలంటే ఎవరైనా కన్యను చూడండి.


🌸ఆమెను భార్యగా పొంది యజ్ఞాన్ని పూర్తి చేద్దామని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఆజ్ఞాపించాడు.

ఈ విధంగా బ్రహ్మ దేవుని మాటలు విని ఇంద్రుడు భూలోకం వెళ్లి కన్య కోసం వెతుకుతాడు.


🌿ఈ సమయంలోనే ఓ గొల్ల యువతి పెరుగు అమ్ముతూ కంటపడింది.

వెంటనే ఆమె చేయి పట్టుకొని ఇంద్రుడు బ్రహ్మ లోకానికి వెళ్లి విష్ణువు, పరమేశ్వరుడు, పెద్దగా ఉండి గాంధర్వ వివాహం జరిపించాడు.


🌸ఈ క్రమంలోనే తమ ఇంటి పిల్లను ఎవరో ఎత్తుకెళ్లారని యాదవులందరు గొడవ చేస్తూ బ్రహ్మలోకానికి వెళ్తారు.ఈ క్రమంలోనే విష్ణువు అక్కడికి చేరుకొని మీ అమ్మాయిని బ్రహ్మదేవుడు వివాహం చేసుకున్నారు.


🌿నేను శ్రీమన్నారాయణుడిని నేను కృష్ణ అవతారం ఎత్తినప్పుడు మీ వంశంలోనే, మీ మధ్యనే ఉంటాను.

మీరందరూ నన్ను దర్శించుకోవడం వల్ల మీ వంశాలు వృద్ధి చెందు తాయని 


🌸ఈ సందర్భంగా శ్రీమన్నారాయణుడు చెప్పడం చేత విష్ణుదేవుడు కృష్ణుడు అవతారంలో జన్మించి యాదవుల ఇంట పెరిగి వారి చేత విశేష పూజలు అందుకుంటున్నారు..స్వస్తి....🚩

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat