*అయ్యప్ప తత్వం - 2
మొదటిసారి మాలవేసుకున్నవారిని "కన్నెస్వాములనీ , రెండవసారి దర్శించుకునే వారిని "కత్తిస్వాము" లనీ , మూడవసారి దర్శించుకునే వారిని "గంటస్వాము" లనీ , నాల్గవసారి దర్శించుకునేవారిని "గదస్వాము" లనీ పిలుస్తారు.
ఎరుమేలిలో పేటతుళ్ళి ఆడేటపుడు వారి వెంటవుండే పొడవాటి కర్రలను "పేట్లేకొంబు" అంటారు. ఇందులో యాత్రకు కావలసిన కూరగాయలను కట్టుకొని పేటలో ఎగురుతారు. పిమ్మట దాన్ని యాత్రలో వండుకొని భుజిస్తారు. ఇది ఆరోగ్యదాయకమైనదని అచ్చటివారి నమ్మకము.
ప్రతి సంవత్సరము జ్యోతి సమయమున తొడిగే "తిరువాభరణము" లు అచ్చటనే ఏడురోజులు ప్రతి దినము సాయంత్రం శ్రీస్వామివారికి అలంకరింపచేసి మరల పందళం తీసికొని వెళ్ళేటపుడు "లాహా" ఎస్టేట్ దగ్గరగల "పెరినాడ్" 'ధర్మశాస్తా దేవాలయములో ఒకరోజు రాత్రి అచట స్వామివారికి అలంకరించుతారు.
ఈశ్వరునియొక్క ఇచ్ఛాశక్తి , విష్ణువు యొక్క క్రియాశక్తి సంగమించి కలిసిన మహాశక్తియే "శ్రీస్వామి అయ్యప్ప యొక్క జ్ఞానశక్తిగా" వెలిసియున్నది.
మానవునిలోవున్న మలినాన్ని కడిగివేసి , వివేక వంతుల్ని చేసి , ధర్మాన్ని బోధించి మోక్షసాధనకు బాట వేసే శ్రీ అయ్యప్పస్వామివారిని దర్శించడానికి జీవితాంతం దీక్షను అవలంభించక పోయినా , జీవితంలో ఒకసారైనా స్వామివారి మండలదీక్ష గైకొని శబరిమలకు వెళ్ళి వస్తే మన జన్మ తరించిపోతుంది.
*"ఓం స్వామియే శరణం అయ్యప్ప" అను దివ్య నామమును ప్రతిరోజు 108 సార్లు జపిస్తే సర్వ కార్యానుకూలత కలుగును.*
*"ఓం స్వామియేశరణం అయ్యప్ప" అను దివ్య నామమును ప్రతిరోజు 108 సార్లు వ్రాస్తే మనతప్పులన్నియు మన్నించబడి మన కోర్కెలన్నియు నెరవేరును.*
సర్వకార్యాలకూ ఆ అయ్యప్పే మూలకారణం.
ఈశాన్యదిశగా అయ్యప్పస్వామిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్నెస్వాములు 'శరములను', కత్తిస్వాములు 'చెక్కకత్తిని', గంటస్వాములు చిన్న'గంట'ను, గదస్వాములు చిన్న చెక్కగద'ను ధరించి శరంగుత్తివద్ద నాటెదరు.
"ఎరుమేలి" అనగా (ఎరుమై బట్టి గొడ్డు , కొల్లి హతమార్చిన) బట్టెగొడ్డును చంపిన ప్రదేశము. కేరళ గెజిటెడ్ బుక్ లో నేటికి ఈ ప్రదేశమును ఎరుమై కొల్లి అనియే సూచించబడియున్నది.
అష్టాదశసోపాన మెక్కు అర్హత , *"అయ్యప్పమాల ధరించి 48 దినములు దీక్ష చేసి ఇరుముడితో వచ్చిన వారికే"* అన్నది తెలుసుకోండి.
కేరళ రాష్ట్రములో శ్రీ చోటానిక్కర్ భగవతి "స్వయంభూ" అని , భక్తజనుల కోర్కెలను తీర్చే "కల్పతరువు" అనియూ , భూతబాధానివారణ "ఔషధమూర్తి" అని ప్రతి ఒక్క పవళమల్లి" చెట్టు (పారిజాత వృక్షము) క్రిందవున్న ఆవు , రాతి విగ్రహాన్ని దర్శించుకొందురు.
"మండలం రోజులు దీక్షచేయకుండా ఇరుముడి శిరస్సుపై లేకుండా పదునెట్టాంబడి ఎక్కినవారికి , శబరిమలకు సామాన్లు మోసే గాడిదలకు తేడా. లేదని స్వామి విమోచనానంద మహరాజ్ వారు చెప్పారు.
ఇరుముడి ఏ ప్రదేశమునందు కట్టుకొనిననూ , ఇరుముడి కట్టుకున్న రోజు వెలిగించిన దీపము , మనము యాత్రనుండి తిరిగివచ్చు వరకూ వెలుగుతుండవలెను. ఆ దీపమును దర్శించిన పిదపనే గృహమందు ప్రవేశింపవలెను.
భక్తులను 'శని' ఆవహించకుండా చేసిన ఘనుడైన ఆ అయ్యప్పను దర్శించి పూజించటం విశేష పుణ్యప్రదం.
కాంచీపురములో బిలద్వార సమీపములో నగర ఉత్తర భాగములో "మహాశాస్తా" వారిచే స్థాపింపబడిన "మహాశాస్త్రృలింగము" ను ఒక్కసారి చూసినా సర్వ సౌభాగ్యాలు పొందగలరు.
ఆవునెయ్యి శక్తికి , విభూతి జ్ఞానమునకు సంకేతము అనియు , వీటితో అయ్యప్పస్వామి వారికి అభిషేకించడమంటే శక్తిని , బుద్ధిని శ్రీ స్వామివారి వద్ద కోరడమే.
"కాళైక్కెట్టి" అనగా ఎద్దును చెట్టుకు కట్టిన ప్రదేశము. మహదేవుడు తన కుమారుడు అయ్యప్ప , మహిషిని సంహరించుట చూడటం కోసం నందీశ్వరునితో వచ్చి ఆగిన స్థలము.
ఎరుమేలిలో “అలంగాడ్” వారు పేటతుళ్ళి ఆడివెళ్ళిన తర్వాత ఎవరు పేట తుళ్ళి ఆడరు.