స్వామి అయ్యప్ప దీక్షాపరులు ముందుగా గణపతి మరియు సుబ్రహ్మణ్యస్వామి పూజించుట - Ayyappa Diksha Vidhanam

P Madhav Kumar

 

స్వామి అయ్యప్ప దీక్షాపరులు ముందుగా గణపతి మరియు సుబ్రహ్మణ్యస్వామి పూజించుట - Ayyappa Diksha Vidhanam
స్వామి అయ్యప్ప 
అయ్యప్ప దీక్షాపరులకు గమనిక
అయ్యప్ప దీక్షాపరులు పూజవిధానము మెదట గణపతిని పూజించి అనంతరము సుబ్రహ్మణ్యస్వామి ని పిదప అయ్యప్పస్వామిని విధిగా పూజిచవలెను. శరణుఘోష, శ్రీ అయ్యప్ప నినాదాలు, మరియు శ్రీ అయ్యప్ప స్వామి పంచరత్నములు విశేషాంశములలో పొందుపరిచినాము గమనింపగలరు.

ముందుగా గణపతి పూజ
పూజావిధానం:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అని (వినాయకుని ధ్యానించవలెను)

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-) శ్లో అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచిః ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః (అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)
దీపంసవరించు - ఓం గురుభ్యో నమః అని దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.
దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ
అయ్యప్ప దీక్ష
అయ్యప్ప పూజ
ఆచమన కేశవ నామములు:
  • 🙏 ఓం కేశవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
  • 🙏 ఓం నారాయణాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
  • 🙏 ఓం మాధవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
  • 🙏 ఓం గోవిందాయ నమః (అనుచు - ఎడమ చేతిని కుడి అరచేతితోను)
  • 🙏 ఓం విష్ణవే నమః (అనుచు – కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
  • 🙏 ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
  • 🙏 ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
  • 🙏 ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
  • 🙏 ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
  • 🙏 ఓం హ్ఋషికేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )
  • 🙏 ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పదముల పైనను)
  • 🙏 ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)
  • 🙏 ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును  తాకవలెను)
  • 🙏 ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
  • 🙏 ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
  • 🙏 ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)
  • 🙏 ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )
  • 🙏 ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)
  • 🙏 ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను
  • 🙏 ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
  • 🙏 ఓం జనార్ధనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)
  • 🙏 ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)<
  • 🙏 ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
  • 🙏 ఓం శ్రీకృష్ణాయ నమః. భూతోచ్చాటనముసవరించు ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే శ్లోకము చదివి - అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి. అథః ప్రాణాయామః (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)
  • 🙏 ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః , ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
  • 🙏 ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)

అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను

సంకల్పము:
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః 
ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐస్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపాచారైః సంభవితా నియమేన, యావచ్చక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే... అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat