Karyasiddhi Hanuman Temple - Frisco, Dallas, USA |
కార్యసిద్ధి హనుమాన్ దేవాలయము - ఫ్రిస్కో, దల్లాస్, యుఎస్‌ఏ
పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ |
అవధూత దత్తపీఠాధిపతి (మైసూర్, ఇండియా) పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలను నిర్మించారు. టెక్సాస్‌లోని దల్లాస్‌లో శ్రీస్వామీజీ నిర్మించిన మరకత కార్యసిద్ధి హనుమాన్ దేవాలయము ఎంతో విశిష్టతను సంతరించుకున్నది. సర్వమత సామరస్యము, విశ్వశ్రేయస్సు, సంఘసేవ కొరకు స్థాపించబడిన దేవాలయమిది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మింపబడిన ఈ దేవాలయములో దత్తాత్రేయస్వామిని, దుర్గామాతను, మహాశివ గణపతి మూర్తులను శ్రీస్వామీజీ ప్రతిష్ఠ చేసి భక్తులందరకు అందించారు.
పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ |
పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ |
ఇక్కడ పెరుగుతున్న పిల్లలకు, పెద్దలకు కూడా భగవద్గీత, సంగీతము, యోగము, భక్తి మొ||న ఎన్నో మంచి అంశాల మీద కార్యసిద్ధి హనుమాన్ దేవాలయ నిర్వాహకుల నుండి ఎంతో మంచి శిక్షణ లభిస్తున్నది. పూజ్యశ్రీ స్వామీజీ వారి ఆశీస్సులు అందుకుంటూ, వారి అనుగ్రహముతో వారి మార్గంలో పయనిస్తున్న వీరందరూ మంచి వ్యక్తిత్వంతో, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు.
ఈ సంవత్సరం దల్లాస్‌లో జరిగే గురుపూర్ణిమ మహోత్సవాలలో భాగంగా జులై 1వ తేదీ సాయంత్రము అలెన్ సెంటర్‌లో పరమపూజ్య శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ ''సహస్ర చంద్ర రాగసాగర'' అనే ''మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ హీలింగ్'' కాన్సర్ట్‌ను నిర్వహించారు. ఆ అద్భుతమైన నాదచికిత్సా కార్యక్రమానికి వేలాదిమంది హాజరై, శ్రీ స్వామీజీ అనుగ్రహానికి పాత్రులయ్యారు.
పూజ్య శ్రీస్వామీజీకి సంగీతమే భాష, సంగీతమే మతము, సంగీతమే శ్వాస, సంగీతమే భావము.
''అమెరికాలో మరొక అద్భుతము''
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేలాదిమందితో 'భగవద్గీత పారాయణ మహాయజ్ఞం' జరిగినది.
క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్, టెక్సాస్, దల్లాస్‌లో సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞం నిర్వహింపబడినది. ఇక్కడ హాజరైన వేలాదిమందిలో సుమారు సగం మంది కంటే ఎక్కువ భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి పారాయణ చేశారు. వీరంతా ప్రవాస భారతీయులు మాత్రమే. ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 4 సం||ల చిన్నపిల్ల నుండి, 82 సం||ల వృద్ధుల వరకు ఉన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా పారాయణ చేసిన ఈ కార్యక్రమం అంతా ఏక కంఠంతో, మధుర స్వరంతో, ఎంతో క్రమశిక్షణతో జరిగినది.
ఇంతటి విశేషమైన కార్యక్రమము అమెరికాలో జరగడము, ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రవాస భారతీయులు హాజరవడము ఎంతో అద్భుతమైన విషయము.
శ్రీస్వామీజీ దివ్య సంకల్పముతోనే ఇంత పెద్ద కార్యక్రమము అమెరికా దేశంలో జరిగినది. ఈ విధంగా టెక్సాస్‌లో 2,3 సార్లు జరిగాయి. క్రిందటి సంవత్సరం 2022, ఆగస్ట్‌లో జరిగిన భగవద్గీత సహస్రగళ పారాయణ ''గిన్నీస్ వరల్డ్ రికార్డును అందుకున్నది. ఈ కార్యక్రమానికి 7000 మంది దాకా హాజరయ్యారు.
జులై 3వ తేదీన ''గురుపూర్ణిమ రోజున దల్లాస్ లోని 'కార్యసిద్ధి హనుమాన్' దేవాలయములో పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి, గురుపాదపూజ, గురువందన సమర్పణ కార్యక్రమములు భక్తులందరు ఎంతో భక్తి శ్రద్ధలతో, అతి పవిత్రంగా, అతి వైభవంగా జరుపుకుని తన్మయులయ్యారు.
జయగురుదత్త