ఆక్యుప్రెషర్‌ చికిత్స అంటే ఏమిటి ?

P Madhav Kumar

 



ఆక్యుప్రెషర్‌ చికిత్స, Acupressure - మందు అవసరము లేని వైద్యం :
ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలు ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటువంటి వాటిలో ఆక్యుప్రెషర్‌, రేకీలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యామ్నాయ వైద్యము లో రిఫ్లెక్సాలజీ అనేది ఒక ప్రాచీన రూపము . ఆక్యుప్రజర్ , ఆయుర్వేదిక్ మసాజ్  ల మాదిరిగా పోలిఉండే రిప్లెక్షాలజీ ని కొందరు  పిలిచే ఆక్యుప్రెషర్‌ చికిత్స.. క్రీ.పూ. 5000 సంవత్సరాల కాలంలో మన దేశంలోనే ప్రారంభం కావడం విశేషం. ఆ కాలంలో రుషులు, మహామునులు ఈ వైద్యం ద్వారా రోగాలను నయం చేసినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉండడం విశేషం.

అరిచేతులు, అరికాళ్లలో శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్‌
ఉంటాయి. వీటిని యాక్టివేట్‌ చేయడం ద్వారారిప్లెక్షాలజీ లో చికిత్సలను నిర్వహిస్తారు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులకు సంబంధించిన సమస్యలు ఈ వైద్యంతో పూర్తిగా నయమవుతాయని ఆక్యుప్రెషర్‌ /రిప్లెక్షాలజీ థెరపిస్ట్‌లు డాక్టర్‌ కె.నారాయణ, డాక్టర్‌ శ్రీనివాస్‌లు తెలిపారు. ఇవేగాకుండా ఐటి ఉద్యోగులకు స్పాండిలైటిస్‌ (మెడ, భుజాల నొప్పులు), నడుము నొప్పి, నిద్ర ఉండకపోవడం వంటి వాటిని ఈ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఉదా: ఆక్యుప్రెజర్/రిప్లెక్షాలజీ  పద్ధతితో ఒక బొటనవేలును మరో బొటనవేలుతో నెమ్మదిగా ఒత్తటంవల్ల మెదడు ఉత్తేజితమై ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్కువసేపు చదువుకునేవాళ్లు మధ్యమధ్యలో ఇలా చేయటం మంచిది.
ఆక్యుప్రెషర్‌/రిప్లెక్షాలజీ  ద్వారా గుండెజబ్బులు, ఆస్తమా, కిడ్నీ దెబ్బతినడం వంటి వ్యాధులకు చికిత్సలతో పాటు ఆడవారికి సంబంధించిన గైనిక్‌ సమస్యలను సైతం నయం చేయవచ్చు. నేడు ఈ వైద్య విధానం చైనా, జపాన్‌, థాయిలాండ్‌ తదితర దేశాల్లో విశేష ప్రాచర్యాన్ని పొందింది.
మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి. వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి. ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ.

శారీరకంగా అలసిపోతున్నారా? మానసికంగా ఆందోళన చెందుతున్నారా? రక్తపోటు, తలనొప్పి లాంటి రుగ్మతలు పీడిస్తున్నాయా? టెన్షన్‌కు గురవుతున్నారా? జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా? ఇవన్నీ చిరాకుపెట్టే అంశాలే. బాధించే లక్షణాలే. స్థిమితం లేకుండా చేసి అనుక్షణం వేధించే భూతాలే. కానీ, ఇకపై ఇలాంటి సివ్టుమ్స్‌కు ఎంతమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. వీటిని తరిమికొట్టే రిఫ్లెక్సాలజీ చికిత్స అమెరికా, బ్రిటన్‌ లాంటి అనేక దేశాల్లో ఎందరో చేయించుకుంటున్నారు. సత్వర ఫలితం కనిపించడంతో అనేకమంది ఈ రకమైన చికిత్స చేయించుకునేం దుకు ముందుకొస్తున్నారు. త్వరలో మనదేశంలోనూ అమలుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారో, దానివల్ల ఎంతటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.


పోటీ ప్రపంచంలో రోజురోజుకీ వత్తిడి పెరుగు తోంది. ఆందోళన కారణంగా నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఇతరత్రా అనేక శారీరక, మానసిక జబ్బులు వస్తున్నాయి. ఇది నానాటికీ విస్తరిస్తోంది. ఎందరో ఈ రకమైన లక్షణాలతో ఇబ్బంది పడ్తున్నారు. చదువు, ఉద్యోగాల వేటలో ఉరుకులు, పరుగులు.. కెరీర్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మరింత వత్తిడి. ఇల్లు, పెళ్ళి లాంటి అంశాల్లో మరో రకమైన అలసట. వెరసి జీవితమే ఒక పరుగు పందెం. ఒక రేస్‌ తర్వాత మరో రేస్‌. నిరంతరం గెలుపు దిశగా పరుగులెత్తడం. వత్తిడితో కూడిన విజయాలు, విషాదంతో కూడిన పరాజయాలు. ఈ మితిమీరిన వత్తిడి మానసిక ఆందోళనకు కారణమౌతోంది. అందుకే పెరిగిన పోటీలాగే జబ్బులూ పెరిగాయి. దాంతో ముఖంలో కాంతి పోవడం, కంటి కింద నల్లటి వలయాలు, కళ్ళలో కాంతి కరువవడం లాంటివి పైకి కనిపించే లక్షణాలు. కాగా, గుండె దడదడలాడటం, ఆకలి మందగించడం, నిద్రలేమి, అంతూఅదుపూ లేని ఆలోచనలు, అస్థిమితం, ఆందోళన లాంటివి ఇబ్బంది పెట్టే కొన్ని లక్షణాలు ‌.

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat