Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ

 ప|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | 

జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||


చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | 

నాపాల గలదుగా నీనామము |

కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | 

చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు ||


చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | 

సరి గావగద్దుగా నీశరణాగతి |

గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | 

నిరతి గలదుగా నీభక్తి నాకు ||🙏🙏🙏

📢 Follow