చాలామంది నరదృష్టి పోవడానికి ఇంటికి బూడిద గుమ్మడికాయ కడుతూ ఉంటారు. అలా కట్టినప్పటికీ సరైన ఫలితాలను ఇవ్వడం లేదని, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉందని, కొంతమంది బాధపడుతూ ఉంటారు.
బూడిద గుమ్మడికాయ కట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే బూడిద గుమ్మడికాయ నరదృష్టిని తొలగిస్తుంది.
కొంతమంది బూడిద గుమ్మడి కాయను నీళ్లతో కడిగి కడుతూ ఉంటారు. అలా చేస్తే దాని యొక్క శక్తి అంతా పోతుంది.
అదే విధంగా తొడిమ లేని గుమ్మడికాయలో శక్తి ఉండదు.
తొడిమను క్రింది వైపు ఉంచి బూడిద గుమ్మడికాయను ఒక్కసారి పట్టుకున్నా సరే అంటే తలక్రిందులుగా పట్టుకున్నాసరే, దాని ఎనర్జీ మొత్తం పోతుంది.
అటువంటి గుమ్మడికాయను కట్టినప్పటికీ ఎటువంటి ఫలితాలను ఇవ్వదు.
*బూడిద గుమ్మడికాయ కట్టడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులలో కట్టాల్సి ఉంటుంది.*
అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా కడితే మంచి ఫలితాలు ఇస్తుంది. లేదా బుధవారం నాడు సూర్యోదయానికి ముందు, లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందు కట్టడంవల్ల ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది.
సూర్యోదయం అయిన తర్వాత కడితే మధ్యమ ఫలితాలు ఇస్తుంది..