*ఒక్క అక్షరం తప్పు పలికితే... ఇక అంతే సంగతులు*

P Madhav Kumar


🍃ఒకానొక సమయంలో ఒక మహానుభావుడు తన భార్య ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించాడు అదే సమయంలో నారదుడు సాయంత్రం సమయంలో అటువైపు వెళుతూ ఆ ఇంటి ముందు కి రాగానే ఆ మహానుభావుడు ఆ మహర్షి ని లోనికి సాదరంగా ఆహ్వానించి భోజన తాంబూలాలు ఇచ్చి ఆ రాత్రి అక్కడే విశ్రమించ మని కోరారు అందుకు ఆ నారద మహర్షి గారు కూడా సరే అనీ శయనించారు ఉదయం ఆ మహానుభావుడు లేచి తన సంధ్య వందనం అనుష్ఠానాలు అనంతరం చండీ సప్తశతి పారాయణం ప్రారంభం చేసారు. 

🍃నారదుడు చూసి ఏమిటి నాయనా అని అడగ్గా అయ్యా నా భార్య ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించాను అనగా మహర్షి సంతోషించి సరే అయితే 40 వ రోజున నేనే వచ్చి మరుసటి రోజు నీ చేతితో పూర్ణాహుతి చేయిస్తా అని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు. 


🍃అయితే ఇతను ప్రతీ రోజూ చండీ సప్తశతి పారాయణం చేస్తూ ఉండగా. అతని భార్య ఆరోగ్యం ఇంకా క్షీణిస్తున్నది అతనికి అర్ధం కాలేదు చివరి రోజు నారదుడు వచ్చి ఏమి నాయనా నీ ధర్మ పత్ని కి ఎలా ఉంది ఆరోగ్యం అనగా స్వామీ నా భార్య ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ వచ్చింది. ఏమిటో ఆ జగన్మాతకి నాపై కనికరం లేదేమో అని భోరున విలపించాడు. నారద మహర్షి గారికి అనుమానం వచ్చి నాయన ఒకసారి పారాయణం చేయి అన్నాడు. 


🍃ఇతను సరే అనీ.సప్తశతి పారాయణం ప్రారంభం చేసాడు.

అయితే దానిలో ఒక శ్లోకం.


 *మమ భార్యాం రక్షతు భైరవి* 


అని ఉంటుంది కానీ ఇతను అక్షరం తప్పు పలికి.


 *మమ భార్యాం భక్షతు భైరవి* 


అని..పలుకుతున్నాడు.


🍃ఇక ఏముంది ఆ తల్లి వాడి భార్య నైవేద్యంగా భుజిస్తూ వచ్చింది. 


🍃అప్పుడు ఆ నారదుడు నాయన ఒకసారి నీ పాఠం సరి చేసుకుని ఈ రోజు పూర్తిగా 40 సార్లు సప్తశతి పారాయణం జాగ్రత్త గా చేయి నాయన అని సెలవు ఇచ్చాడు.


🍃వెంటనే అతను తేరుకుని మంత్రం చాలా జాగ్రత్తగా పారాయణం పూర్తి చేసాడు ఈ సారి మమ భార్యాం రక్షతు భైరవి. అని కరక్టు గా పలుకుతూ ఒక్కొక్క పారాయణం పూర్తి అయ్యే లోపు తన భార్య మంచి ఆరోగ్యం వస్తూ ఉన్నది. 40 సార్లు అయ్యే లోపు మంచి ఫలితం చూపింది.


🍃కావున మంత్రం జపం పారాయణం బీజాక్షరాలు సరిగ్గా పలకాలి ఒక్క అక్షరం తప్పు పలికితే ఇక అంతే సంగతులు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat