మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో అది మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది.

P Madhav Kumar


 

పళ్ళ_చెట్టు...తల్లిదండ్రులు...🙏

         చాలా, ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.  


          ఓ రోజు చెట్టు పైకి ఎక్కి పండ్లు కోసుకొని తిన్నాడు. ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడేది, అతన్ని అమితంగా ప్రేమించింది. 


       కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి కొంచం పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు.


        కొన్ని  రోజుల తరువాత ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు. ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 


 బాలుడు :- "నేనింకా చిన్న పిల్లాడిని కాను. చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 


 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేసితే , దానితో నీకు డబ్బులు వస్తాయి దానితో బొమ్మ కొనుక్కో" అని అన్నది. 


      బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు అతని కోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 


         క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది.


         "నీతో ఆడుకునే వయస్సు ఇప్పుడు నాకు లేదు. నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"......!? అని అడిగాడు. 


          నా వద్ద మీకూ ఇవ్వడానికి ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయ పడతాయి. కావాలంటే వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 


        అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు కూడా చాలా ఆనందపడింది. కానీ అతను మళ్ళీ తిరిగి రాలేదు.చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉండి పోయింది. 


        బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళీ వచ్చాడు, చెట్టుకు అతన్ని చూడగానే ఎక్కడలేని ఆనందం ముచ్చికొచ్చింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేనిప్పుడు మధ్య వయస్సు వాడిని అయ్యాను.... నీతో ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు


           నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 


          అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ విహారయాత్రకు వెళ్లడం జరిగింది.చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 


     చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. అతన్ని చూసి   ఆ చెట్టు.....నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, ఇప్పుడు పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 

                  అప్పుడు ఆ మాటకు ఆ వ్యక్తి ఏమి ఇబ్బంది లేదు,నీ పండ్లు నాకు తినడానికి పళ్లే లేవులే అన్నాడు.


 చెట్ట:- నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 

ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు అతను..... 


            భాదతో నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది ఆ చెట్టు. 


        నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు ఆ వ్యక్తి . 


 వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి,.... అనుకూలంగా ఉంటాయి, నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది ఆ చెట్టు. 

                  

                        *******


           "ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 


         కొంచెం పెద్దయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. 


 చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కానీ మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే గదా చేస్తున్నాం.


         మనకు భరోసాగా వాళ్లను చూస్తున్నాం, మన కోసం సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కానీ అప్పటికే సమయం మించి పోతోందని మాత్రం గుర్తించలేకున్నాం. 


 #నీతి :-


     మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు ఇక లేనప్పుడు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుందనీ మాత్రం మరవకండి. 


             మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. అదే మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అది అనుభవంలోకి వస్తుందని మరవకండి 🙏స్వామియే శరణం అయ్యప్ప 🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat