Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

🔱 శబరిమల వనయాత్ర - 46 ⚜️ నవగ్రహములు ⚜️


⚜️ నవగ్రహములు ⚜️

శబరిమలలో నవగ్రహములు

మాళికాపురత్తమ్మ సన్నిధిలో యున్నది. మాళికాపురత్తమ్మను దర్శించుకొని ఈ నవగ్రహములను ప్రదక్షిణము చేసి గ్రహ దోషము పోగొట్టుకొనుట పరిపాటి. పూర్వము ఈ నవగ్రహములు శబరిమలై పదునెట్టాంబడికి ముంగిట వావరునడ పక్కన ఉండేది. శబరిమల డెవలప్ మెంట్ పనిలో భాగంగా ఈ నవగ్రహములను మార్చి మాళికాపురం సన్నిధిలో పెట్టియున్నారు. ఈ నవగ్రహములకు శాంతిపూజలు కూడా చేసేవారు కూడా యున్నారు. ఈ సన్నిధిలో మాళికాపురం సన్నిధి , కడుత్త స్వామి సన్నిధి , నాగరాజ , నాగయక్షి సన్నిధి , మణిమండపం వీటన్నిటికి ఒకే మేల్ శాంతిగారు పూజారాధనలు జరిపిస్తారు.


🙏🌷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా 🌻🙏

📢 Follow