🌺 అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలు తో రాత్రి సుమారు 12 గంటల సమయంలో🌺
🌺ATC Vq1 మార్గం ద్వారా వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్ లో ఈ అంగప్రదక్షిణ సేవకు గుడిలో కి వెళ్ళవలసి ఉంటుంది.
ఆడవాళ్లు చీర లేదా పంజాబీ డ్రెస్సు వేసుకోవచ్చును.
మగవాళ్ళు పంచ లేదా ప్యాంట్ వేసుకోవాలి.
మగవారికి పైన షర్ట్ ఉండకూడదు.
వేరు వేరు లైన్లలో వీరిని సేవకు పంపుతారు ముందుగా ఆడవాళ్ళు పొర్లుదండాలు పెట్టి బయటకు వచ్చిన తరువాత
మగవాళ్ళ అంగ ప్రదక్షిణ మొదలు అవుతుంది కావున ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
తిరుమల శ్రీవారికి మహిమాన్వితమైన సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు ఈ అంగప్రదక్షిణ సేవ గర్భాలయానికి బయట 🌺
🌺 శ్రీవారి బంగారు బావి నుండి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది.
సుప్రభాత సేవ అ జరిగిన వెంటనే లోపల తోమాలసేవ జరుగుతున్న సమయంలో అంగప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్త్రీ పురుషులను వేరు వేరు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు
స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం 5