🌸జగదాంబ రేణుకాదేవిగా కొలువై వున్న ఆలయం పడైవీడు అని పిలువబడుతున్న పడవేడు.
ఈ పడైవీడు నుండి సుమారు 4 కి.మీ దూరంలో యోగరామాలయం వున్నది.
పట్టాభిషేకమైన తరువాత శ్రీరాముడు ప్రజారంజకంగా పరిపాలిస్తున్న కాలంలో శతకంఠ రావణుడనే దానవుడు సముద్రంలో హేమశృంగమనే బ్రహ్మాండమైన
నగరాన్ని నిర్మించుకొనిపాలించసాగాడు.
🌸అతి దుష్టుడై అందరిని హింసిస్తున్న యీ దానవుని సంహరించడానికి రాముని సేన బయలుదేరినది. రాముని వెంట సీతాదేవి కూడా వెళ్ళింది.
అందరూ సముద్రతీరానికి చేరేరు.
హనుమంతుడు విశ్వరూపందాల్చి సాష్టాంగపడి తన దేహాన్నే సేతువుగా చేశాడు. అందరూ సాగరం దాటి
దానవుని నగరం చేరుకున్నారు.
కాని శతకంఠ రావణుని సంహారం అంత
తేలికగా జరుగలేదు.
🌸ధ్యానం ద్వారా సీతాదేవికి
ఒక సత్యం అవగతమైనది. వెంటనే
ఆంజనేయుని పిలిచి" హనుమా..యీ దానవుడు రేణుకాదేవిపరమ భక్తుడు. రేణుకాదేవికొలువైవున్నకుండలీపురంలోని ఒక తటాకంలోపుష్పించిన తామరపుష్పం లో యితని ప్రాణాలు భద్రంగా కాపాడబడుతున్నవి.
రేణుకాదేవి అనుగ్రహంతో ఐదు భ్రమరాలు ఈ తామరపుష్పాన్ని, అందులోని దానవుని ప్రాణాలను కాపాడుతున్నవి.
🌸ఆ భ్రమరాలను సమూలంగా నిర్మూలిస్తేఈ శతకంఠ రావణుని హతం చేయబడుతుందని ఆ కార్యాన్ని నిర్వర్తించి రమ్మని ఆదేశించింది.
కుండలీపురంలో రేణుకాదేవి తన భక్తుడైన ఆ దానవుని కాపాడేందుకు హనుమంతుని అడ్డగించినది.
హనుమంతుడు ఏమాత్రం భయపడలేదు.
🌸ధైర్యంగా ఎదుర్కొన్నాడు. హనుమంతుని వంద శిలలుగా మారిపొమ్మని రేణుకాదేవి శాపం యిచ్చింది. ఆ దేవిని ఎదిరించి
ఇసుకవర్షంతో కుండలీపురం
ధ్వంసమైపోవాలని హనుమంతుడు ప్రతిశాపం యిచ్చాడు. ఇది తెలుసుకుని శ్రీరాముడు కుండలీపురం వచ్చాడు.లోక కంటకుడైన శతకంఠ రావణుని సంహారం జరగవలసిన ఆవశ్యకతను గురించి వివరంగా రేణుకాదేవికి తెలిపాడు.
🌸రేణుకాదేవి హనుమంతునికి యిచ్చిన శాపంఉపసంహరించుకున్నది.
పిదప దేవి అనుగ్రహంతో తటాకంలోని భ్రమరాలు సంహరించబడడంతో ఆ దుష్టదానవుడు సంహరించబడ్డాడు.
యుధ్ధానంతరం శ్రీరాముడు సీతా,లక్ష్మణ, హనుమత్సమేతంగా కుండలీపురం అనే యీ పడైవీడు (పడవేడు)వచ్చి అక్కడి ఆలయంలో కొలువైనాడు.