Eyesight : ఇవి గుప్పెడు తింటే చాలు కళ్లజోడు అవసరం లేదు.. కంటిచూపుకు తిరుగులేదు

P Madhav Kumar

 


Eyesight: ఆధునిక ఆహార అలవాట్లు మన శరీరాన్ని దెబ్బ తీస్తున్నాయి. అన్ని అవయవాలపై ప్రభావం చూపుతోంది. మనం అత్యంత జాగ్రత్తగా చూసుకునే అవయవాల్లో కళ్లు కూడా ఒకటి.

కళ్లకు సంబంధించిన జబ్బులతో కంటి చూపు దెబ్బతింటోంది. కళ్లకు ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలు మనం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 

దీంతో మన కళ్లను రక్షించుకునే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇటీవల కాలంలో చిన్న వయసులోనే అద్దాలు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

టీవీలు, కంప్యూటర్లు నిత్యం చూడటంతో కళ్లకు సంబంధించిన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పూర్వం రోజుల్లో వృద్ధులకు మాత్రమే వచ్చే కళ్ల జబ్బులు ఇప్పుడు చిన్న వారిని సైతం వెంటాడుతున్నాయి. 

ఫలితంగా మనం కళ్లు బాగుండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే మంచిది. ఇందులో వాల్ నట్స్, అవిసె గింజలు ఉన్నాయి. 

ఇవి గుప్పెడు తీసుకుంటే చాలు మన కంటి జబ్బులు దూరమవుతాయి. ఒమేగా 3 ఫ్యాట్స్ అందించే వాటిలో చేపలు కూడా ముఖ్యమైనవి. అందుకే చేపలు తినడంతో మేలు కలుగుతుందని చెబుతారు.

 ఇక సి విటమిన్స్ ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. విటమిన్ సి లభించే వాటిలో జామ కాయ ప్రధానమైనది. ఇందులో ఉండే పోషకాలతో మన కంటి జబ్బులను నయం చేస్తుంది.

 ఇంకా విటమిన్ ఇ ఉండే వాటిని తీసుకుంటే కళ్లు సురక్షితంగా ఉంటాయి. ఇందులో బాదం పప్పు, గుమ్మడిగింజల పప్పుల్లో ఎక్కువగా ఉంటుంది. 

వీటిని వాడుకోవడం వల్ల కళ్లకు సంబంధించిన జబ్బులు రాకుండా చేయడంలో సాయపడతాయి. పాలకూర, బ్రోకోలి, పచ్చి బఠాణీలు, పిస్తా వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా కళ్లకు లాభమే.

జింక్ ఉండే ఆహారాలు కూడా తీసుకోవాలి. ఇది గుమ్మడి గింజల్లో ఉంటుంది. విటమిన్ ఎ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. 

ఇది ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, మునగాకు, కరివేపాకు, క్యారెట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మన కళ్లకు ఎలాంటి జబ్బులు రావు. 

అమెరికా వారు నిర్వహించిన పరిశోధనలో కళ్లకు సంబంధించిన జబ్బులు ఉన్న వారు పై ఆహారాలను తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కళ్లకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat