నోముకి వ్రతానికి మద్య తేడాలు
నోము: మనస్సుని కేవలము భగవంతుని పైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది - నోము . ఉదా: శ్రావణమంగళవారం నోము , అట్లతద్ది నోము. నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు. ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము.
వ్రతము : అత్యంత నియం నిష్టలతో మంత్రోచ్చాటనలతో ధూపదీప నైవేద్యాలతో భగవతుని (దేవుని లేదా దేవతను )సేవించేది వ్రతము . వ్రతము ... అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన . వ్రతము లో సంకల్పము , దీక్ష , కథాపఠనము తప్పనిసరి . వ్రతము చేయుటవలన సమస్త పాపములు పోయి ... పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యములు కలుగును. ఉదా: వరలక్ష్మీ వ్రతం. సావిత్రీ వ్రతం. గౌరీ వ్రతం. మున్నగునవి .
- ➲ నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.
- ➲ నోము..అంటే..కొన్ని వారాలు అనీ.. సంవత్సరాలు అనీ ఉంటుంది..నోము పట్టి అక్షింతలు వేసుకుంటే..గడువు కాలం పూర్తి అయ్యాక ఉద్యాపనతో పూర్తి అవుతుంది.
- ➲ వ్రతము అంటే..ఆరోజుకే..పూర్తి చేసేది..సత్యనారాయణ వ్రతం..వరలక్ష్మీ వ్రతం.. వినాయక Vratam లాంటివి..
- ➲ ఆంధ్ర, తెలంగాణ దేశమున స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును.
- ➲ ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.
- ➲ ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదుడు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.
- ➲ ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము.
కొన్ని నోములు.
- ➧ అంగరాగాల కథ
- ➧ అక్షయబొండాల కథ
- ➧ అట్ల తద్దె కథ
- ➧ అన్నము ముట్టని ఆదివారముల నోము
- ➧ అమావాస్య సోమవారపు కథ
- ➧ ఆపద లేని ఆది వారపు కథ.
- ➧ ఉండ్రాళ్ళ తద్దె కథ
- ➧ ఉదయ కుంకుమ నోము
- ➧ ఉప్పుగౌరీ నోము కథ
- ➧ కందగౌరీ నోము కథ
- ➧ కడుపుకదలనిగౌరీ నోము కథ
- ➧ కన్నెతులసమ్మ కథ
- ➧ కరళ్ళగౌరీ నోము కథ
- ➧ కల్యాణగౌరీ నోము కథ
- ➧ కాటుకగౌరీ నోము కథ
- ➧ కార్తీక చలిమళ్ళ కథ
- ➧ కుంకుమ నోము గౌరీ కథ
- ➧ కుందేటి అమావాస్య కథ
- ➧ కృత్తిక దీపాల కథ
- ➧ కేదారేశ్వర వ్రతం
- ➧ కైలాసగౌరీ నోము కథ
- ➧ క్షీరాబ్ధిశయన వ్రతం
- ➧ గంధతాంబూలము కథ
- ➧ గడాపలగౌరీ నోము కథ
- ➧ గణేశుని నోము కథ
- ➧ గాజులగౌరీ నోము కథ
- ➧ గుడిసె నోము కథ
- ➧ గుమ్మడిగౌరీ నోము కథ
- ➧ గూనదీపాలు బానదీపాలు కథ
- ➧ గౌరీ వ్రతం
- ➧ గ్రహణగౌరీ నోము కథ
- ➧ గ్రామకుంకుమ కథ
- ➧ చద్దికూటి మంగళవారపు కథ
- ➧ చిక్కుళ్ళగౌరీ నోము కథ
- ➧ చిత్రగుప్తుని కథ
- ➧ చిలుకు ముగ్గుల కథ-1
- ➧ చిలుకు ముగ్గుల కథ-2
- ➧ తరగనాది వారముల నోము
- ➧ తవుడుగౌరీ నోము కథ
- ➧ త్రినాధ ఆదివారపు నోము కథ
- ➧ దంపతుల తాంబూలము నోము
- ➧ దీపదానము నోము కథ
- ➧ ధైర్యగౌరీ నోము కథ
- ➧ ధైర్యలక్ష్మీ వ్రత కథ
- ➧ నందికేశ్వర వ్రత కథ
- ➧ నవగ్రహ దీపాల కథ
- ➧ నిత్యదానము కథ-1
- ➧ నిత్యదానము కథ-2
- ➧ నిత్యవిభూతి కథ
- ➧ నిత్యశృంగారము కథ
- ➧ నెల సంక్రమణ దీపాల కథ
- ➧ పండుతాంబూలము కథ
- ➧ పదమూడు పువ్వుల కథ
- ➧ పదహారు కుడుముల నోము
- ➧ పదారు ఫలముల నోము
- ➧ పసుపు నోము గౌరీ కథ
- ➧ పువ్వు తాంబూలము నోము
- ➧ పూర్ణాది వారముల నోము
- ➧ పెండ్లి గుమ్మడి నోము
- ➧ పెద్ద సంక్రమణ దీపాల కథ
- ➧ పెరుగుమీద పేరినెయ్యి కథ
- ➧ పోలాల అమావాస్య కథ
- ➧ పోలి స్వర్గమునకు వెళ్ళు నోము
- ➧ ఫలశృతి
- ➧ బారవత్తుల మూరవత్తుల కథ
- ➧ బాలాది వారముల నోము
- ➧ బొమ్మలనోము కథ
- ➧ మారేడుదళ వ్రత కథ
- ➧ ముని కార్తీకవ్రతము కథ
- ➧ మూగనోము కథ
- ➧ మూసివాయనాల కథ
- ➧ మొగ్గదోసిళ్ళ కథ
- ➧ లక్ష పసుపు నోము
- ➧ లక్ష వత్తుల నోము
- ➧ విష్ణుకమలాల కథ
- ➧ శాకదానము కథ
- ➧ శివదేవుని సోమవారపు నోము కథ
- ➧ సూర్యచంద్రుల కథ
- ➧ సూర్యపద్మము కథ
వ్రతములు..
- ➧ శ్రీ సత్యనారాయణ వ్రతము
- ➧ శ్రీ మంగళగౌరీ వ్రతము
- ➧ శ్రీ వినాయకచతుర్థీ వ్రతము
- ➧ శ్రీ కేదారేశ్వర వ్రతము
- ➧ శ్రీ కార్తీకసోమవార వ్రతము
- ➧ శ్రీ స్కందషష్టీ వ్రతము
- ➧ శ్రీ సావిత్రీగౌరీ వ్రతము
- ➧ శ్రీ శివరాత్రి వ్రతము
- ➧ శ్రీ నందికేశ్వర వ్రతము
- ➧ శ్రీ కులాచారావన వ్రతము
- ➧ శ్రీ ఏకపత్నీ వ్రతము
లోకా సమస్తా సుఖినో భవంతు..!!