గణపతి మూల మంత్ర జపం
"ఓం గం గణపతయే నమః"
ఈ మంత్రం లక్ష జపం చేయాలి..
ఇది గణపతి మూల మంత్రం స్వామి ని యధా శక్తి పూజించి గణపతిని గురువుగా భావించి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి మీ గోత్ర నామాలు చెప్పుకుని జన్మనిచ్చిన తల్లితండ్రులను స్మరించి మీరు గురువుగా భావిస్తున్న వారిని దక్షణామూర్తి ని ధ్యానించి..
శ్రీ గణపతి మూల మంత్రం యధా శక్తి జపే వినియోగ: అని చెప్పుకొని ఈ గణపతి మూల మంత్రాన్ని జపం చేయాలి . బెల్లం నైవేద్యం పెట్టాలి.. పూజ సమయంలో మీకు కుదిరినన్ని సార్లు జపం చేసుకుని హారతి ఇచ్చి తర్వాత మీకు జపం చేసుకోవడానికి అనుకూల సమయం స్థలం నిర్ణయించు కుని అక్కడ కూర్చుని జపమాలతో ఉంగరం వేలు పైన జప మాలను తిప్పుతూ జపం చేయాలి జప మాల మెరువుని దాటకుండా మళ్ళీ త్రిప్పి చేయాలి గణపతి మంత్ర జాపనికి తులసి మాల వాడకూడదు..
స్పతిక, రుద్రాక్ష, చందనం, వేప మాల, ఇలాంటి వి ఏవైనా పర్వాలేదు, మెడలో ధరించిన మాల జాపనికి వాడకూడదు జాపనికి వాడిన మాలను మెడలో ధరించ కూడదు..జప మాల ఉపయోగించే వారు స్నానం చేసి కానీ జప మాలను వాడకూడదు.. ఉత్తరం, తూర్పు ముఖంగా కూర్చుని చేయడం మంచిది..
రోజుకి 5,000 జపం చేస్తే 20 రోజులకు లక్ష జపం పూర్తి అవుతుంది .. ముందుగా జపం పూర్తి చేసిన వారు మళ్ళీ దత్తాత్రేయ మంత్రం ఇచ్చే వరకు లలితా సహాస్ర నామం పారాయణ చేయాలి..రోజు ఒకసారి లలితా చదివితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలు నెలసరి అప్పుడు జపం అగుతుంది కనుక వారి వీలైనంత వరకు శుచిగా ఉన్న రోజుల్లో ఐదు వేల కన్నా ఎక్కువగా జపం చేస్తే సమయం సరిపోతుంది..
విద్య, బుద్ది, కుటుంబ క్షేమం, అన్నిటా ఆటంకాలు తొలగించి విజయం అందించే వారు గణపతి.. మన పూజలో జపంతో ధ్యానంలో లోటు చూడక ఆటంకాలు తొలగించి అమ్మవారి అనుగ్రహం కోసం చేయబోయే సాధనలో తోడుగా ఉంది ముందుకు నడిపించమని కోరుకోవాలి.. గణపతి మంత్రం సిద్దించే లాగా అనుగ్రహించమని స్వామి ని కోరుకోవాలి.. మీకు అనుకూల సమయంలో జపం చేసుకోవచ్చు అలాగే ఏ పని చేస్తున్నా మనసులో స్వామి మంత్రం జపం చేస్తూ ఉంటే మానసిక జపం లో మరింతగా మీకు మంత్రం సిద్ధిస్తుంది.
సంకలనం: భానుమతి అక్కిశెట్టి