Sabja Seeds Benefits: సబ్జా గింజలు.. బెనిఫిట్స్ బోలెడు..!

P Madhav Kumar

 Sabja Seeds Benefits: సబ్జా గింజలు.. బెనిఫిట్స్ బోలెడు..!

Sabja Seeds Benefits: వేసవి స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో తగినంత నీరు అందకపోతే బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. అంతేకాకుండా మీరు ఎండా కాలంలో హీట్ వేవ్ బారిన పడే అవకాశం కూడా ఉంది.
శరీరంలోని వేడిని తగ్గించడంలో సబ్జా గింజలు అద్బుతంగా పనిచేస్తాయి. ఇందులో ప్రోటీన్స్, పైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను పచ్చిగా తినలేం. వీటిని నీటిలో నానబెట్టిన తర్వాత తీసుకుంటే మీరు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. ఇది కూడా ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తుంది. సబ్జా గింజల ప్రయోజనాలేంటో మనం తెలుసుకుందాం. 

సబ్జా గింజల ఉపయోగాలు

** సబ్జా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది మీ బరువు తగ్గించడంలో సూపర్ పనిచేస్తుంది. ఆకలి కూడా పెద్దగా వేయదు. 
** ఇవి డయాబెటిక్ రోగులకు వరమనే చెప్పాలి. రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. 
** సబ్జా గింజలు ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. అంతేకాకుండా గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడతాయి. 
** అసిడిటీ, ఛాతిలో మంటలను తగ్గించడంలో సబ్జా గింజలు కీలకపాత్ర పోషిస్తాయి. దీంతోపాటు కడుపను క్లీన్ చేస్తుంది. 
** సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు రావు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
** సబ్జా గింజల్లో ఐరన్, విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జట్టు కుదుళ్లు ధృడంగా, ఒత్తిగా ఉంటాయి. 
** సబ్జా గింజల్లో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది కండరాల నొప్పితోపాటు దగ్గు, జలుబు వంటి వ్యాధులను నియంత్రిస్తాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat