వాస్తు ఆచరణలో “ఆయం” అన్న పదం వినని వారుండరు. అయితే ఈ మధ్య కాలంలో “వాస్తు శాస్త్రంలో “ఆయం” పద్ధతికి వ్యతిరేకమైన ప్రచారం జరగడం వలన ఆయం పద్ధతికి చాలా మంది స్వస్తి చెప్పారు. ఆయం ఆచరిస్తున్నారంటే వారు సంప్రదాయ వాస్తు శాస్త్రవేత్తలని, ఆచరించని వారు నవీన వాస్తు శాస్త్రవేత్తలని కొందరి భావం. “ఆయం” అసలు పనిచేయదని ఇది వట్టి కల్పితమని కొందరు, ఆయం ఇంటికి ప్రాణం అని మరికొందరు వాదిస్తూ ఉంటారు. ఏది ఆచరించాలో అర్థం కాక గృహస్థులు ఆలోచనలో పడతారు. అసలు 'ఆయంలో రహస్యము ఏమై ఉండవచ్చు”, అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంది.
ఆయం లెక్కించడంలో గృహం యొక్క పొడవు, వెడల్పులు ప్రధానమైనవి. గృహం ఆయం లెక్కించేటప్పుడు పొడవు, వెడల్పు కొలతలలో బయటి గోడల వెడల్పును కలపాలని, కలపకూడదని, బయటి గోడల వెడల్పులో సగం కొలత కలపాలని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. .
గృహం ఆయం లెక్కించేటప్పుడు కొలతలను “గజాల”లో తీసుకొంటారు. పొడవును వెడల్పుతో హెచ్చించగా వచ్చిన లబ్బాన్ని (సంఖ్యను) 9 సంఖ్యచే హెచ్చించి, వచ్చిన లబ్బాన్ని 8 సంఖ్యచే భాగించగా వచ్చిన శేషము 1 అయితే ద్వజాయం, 2 అయితే దూమాయం, 8 అయితే సింహాయం, 4 అయితే శునకాయం, 5 అయితే వృషభాయం, 6 అయితే ఖరాయం, 7 అయితే గజాయం, 8 అయితే కాకాయం అని అంటారు. ఇందులో ధ్వజ, సింహ, వృషభ, గజాయాలు శుభకరమని, మిగిలినవి అశుభకరమని తెలుపడం జరిగింది.
గృహానికి ఆయం లెక్కించాలంటే గృహం తప్పనిసరిగా దీర్దవతురస్రంగా లేదా చతురస్రంగా ఉండాలి. ఎందుకంటే ఆయం లెక్కించునప్పుడు గృహం యొక్క తూర్పు గోడ, పడమర గోడ సమ కొలత కలిగి ఉండాలి. అదే విధంగా ఉత్తరం, దక్షిణం గోడల కొలతలు సమంగా ఉండాలి. అంటే ఎదుటెదుటి భుజాల (దిక్కుల) కొలతలు సమంగా ఉండాలి. ఇది వాస్తులో ప్రధాన విషయమని వాస్తు శాస్త్రవేత్తలందరికి తెలిసినదే.
ప్రస్తుత గృహాలలో అందం కోసం, వసతి కోసం కొన్ని దిక్కులను, మూలలను తెంపు చేసి నిర్మించడం జరుగుతోంది. ఈ విధానం భవిష్యత్‌లో అమలు లోకి రాకూడదని ముందు జాగ్రత్తగా “ఆయం” అనే ఒక విధానాన్ని రూపొందించి అందుకుగాను కొన్ని మంచి చెడ్డల ఫలితాలను ఏర్పరచి “ఆయం” పద్ధతిని మన మహర్షులు ఆచరణలోకి తేవడం జరిగి ఉండవచ్చు.
ఈ మధ్యచాలామంది గృహానికి ఎక్కువగా ఈశాన్యం పెంచడానికి అలవాటు పడ్డారు. “ఆయం విధానంలో ఏ మూలా పెరుగకుండా, ఎదుటెదుటి దిక్కులు సమకొలతలు కలిగి ఉండి, నైబుతి మూల నుండి ఈశాన్యం వరకు గల కొలత, ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు ఉండు కొలత కచ్చితంగా సమంగా ఉండి తీరాలి. కొలతలు పై విధంగా సమంగా ఉన్నప్పుడే ఆయం ఆచరించినట్టు లెక్క “ఆయం” కచ్చితంగా ఆచరించాలన్న శాస్త్రవేత్తలే ఆయం లెక్కగట్టి ఈశాన్యం పెంచమని చెబుతున్నారు. ఒక్క ఆయం ఆచరించినా ఒరిగేదీ ఏమీ లేదు. “ఆయం” ప్రకారం ఎదుటెదుటి భుజాలు, ఎదుటెదుటి మూలలు సమాన కొలతలు లేకుండా, వాస్తును ఆచరించిన లాభం లేదు. శాస్త్ర ప్రకారం గృహానికి ఒక నూలు మందం తూర్పు, ఉత్తరాలలో ఈశాన్యం పెంచిన చాలును.
కొలతలలో శాస్త్ర వ్యతిరేకత జరగకూడదన్న కచ్చితమైన నిర్ణయంతో “ఆయం” పద్ధతి ఆచరణలో ఉంచడం జరిగింది. దీన్ని కొందరు పని గట్టుకొని తమ విజ్ఞతను చాటుకొంటుంటే, మరికొందరు తమ వాదనకు తిరుగులేదని వాదిస్తారు.
పూర్వం మహర్షులు చెప్పిన విషయాలను బాగా ఆలోచించి, పరిశోధించి ప్రస్తుతం మనం ఎలా ఆచరించాలి అనేది నిర్ణయించి అనేది ఆచరణయోగ్యంగా మార్చాలే గాని, అతి తెలివితో విమర్శించడం, యధాతథంగా, ఆలోచన లేకుండా ఒప్పుకోడం అన్ని సందర్భాలలోను సరైన పద్ధతి కాదని గ్రహించండి.