*11.భాగం*
సూతు - అంత నాదేవలుడు తననేర్పందఱకును వెల్లడియగు నట్లు నానా
విధములయిన రంగులుగల వస్త్రములను నేసెను. ఆవస్త్రములకు నడుము
గన్నులవంటివియు, హంసవంటివియు, చంద్రునివంటివియు, నక్షత్రములవంటివియు బువ్వులు గలుగునట్లుగా నానావిధములయిన రంగులనూలుతోను నేయ
బ్రారంభించెను. మఱియు మబ్బురంగుగలవస్త్రములను మటియు ననేకవిధములు
గల వస్త్రములను చేయుచుండెను. ఇటులనేకవస్త్రములు నేసి యవిపట్టుకొని తిన్నగా
విష్ణుమూర్తి దగ్గఱకు బోయి యతనికి బీతాంబరము నిచ్చెను. తెల్లనివస్త్రమును
లక్ష్మికిచ్చెను. ఎల్లని వస్త్రమును భూదేవికిచ్చెను. మఱియు నచ్చట నున్నవారం
దఱకును వారివారి కోరిక కనుకూలమయిన వస్త్రములను ప్రీతితో నిచ్చెను. అచ్చట శ్వేతద్వీపములో నున్న వైష్ణవులందఱును బలువిధములయిన వస్తువాహనాదులిచ్చి
దేవలుని సత్కరించిరి. మఱియు లక్ష్మీనారాయణులుగూడ నతనిని విశేషముగా
గౌరవించిరి. ఇట్లచ్చట సత్కరింపబడి యక్కడనుండి బ్రహ్మలోకమునకు బోయి
బ్రహ్మకు రక్తాంబరమును సరస్వతికి శ్వేతాంబరమును సావిత్రికి బీతాంబరమును
గాయత్రికి రక్తాంబరమును ప్రజాపతికి దెల్లని వస్త్రమును పులస్త్యుని కాకుపచ్చనివస్త్ర
మును మఱియు నచ్చటనున్న గంధర్వులు కిన్నరులు సిద్ధులు సాధ్యులు మహర్షులు
చారుణులు మొదలగువారికి వారివారియిష్ట ప్రకారము కోరినవస్త్రములనిచ్చి
బ్రహ్మకు నమస్కరించి యిట్లనియె. స్వామీ ! యికమీదను మావంశస్థులందఱకును
వస్త్రములు చేయుటకు దగినట్టుగా నూలుదొరకునట్లు చేయుడు, అనియడుగగా విని
బ్రహ్మ యిట్లనియె. దేవలా ! నీవంశమువారి కందఱకును నూలు దొరుకునుపాయ
మును జెప్పెదను వినుము. మాని, అభిమాని యను పేరుగల వీరిద్దఱును విష్ణునినాభీ
కమలమునందున్నవారు. ఈ స్త్రీ లిద్దఱును ముందు ముందు భూమిపై వృక్షములయి పుట్టెదరు. ఆచెట్లవలన గావలసినంత నూలు దొరుకుట కేవిధమయిన
యభ్యంతరమును గలుగ కుండును. అని యిట్లు బ్రహ్మచెప్పగానే విని సంతోషించి యాయనచే ననుజ్ఞాతుడై స్వర్గమునకు వచ్చి దేవేంద్రునికి రక్తాంబరమును,
శచీదేవికి బీతాంబరమును జయంతునికి దెల్లని వస్త్రమును నిచ్చి మఱియు
నచ్చటనున్న యెనమండ్రువసువులకును ద్వాదశాదిత్యులకును, ఏకాదశరుద్రులకును వారువారు గోరిన ప్రకారమున వస్త్రముల నిచ్చెను. మఱియు బ్రహ్మఋషులకును దేవర్షులకును మిగిలిన దేవతలకును గంధర్వలకును మంచిమంచివస్త్రము
లిచ్చి వారందఱచేతను వస్తువాహనాదులచే సత్కరింపబడెను. మఱియు నాదేవతలందఱురు వివిధములైన యస్త్రములుగూడ నిచ్చిరి. తరువాత నప్పరస్త్రీలందఱకును గోరిన
ప్రకారము దివ్యమైన వస్త్రము లిచ్చెను. అచ్చటనుండి మేరుపర్వతమునకు
బోయి యచ్చటనున్న దేవతలు, విద్యాధరులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు,సాధ్యులు, కింపురుషులు, యక్షులు, కిన్నరులు, గరుడులు, మునులు మొదలగు
యావజ్జనమునకును, దెల్లనివి, యెట్టనివి, పచ్చనివి, నల్లనివి యింకను పలురంగులు గలిగినవియునగు వస్త్రములనిచ్చి వారిచే దానమానాదులచే
సత్కృతుడై మయునిసన్నిధికి బోయి యతనికోరినవస్త్రములిచ్చి యతనిచేననేకములగు నాయుధములు మొదలగువానిచే సత్కరింపబడి యచ్చటినుండి
మహేంద్రపర్వతమునకు బోయియచ్చటనున్న వారందఱకును వస్త్రములిచ్చి వారిచే సతృతుడై మలయాద్రికి బోయెను. అచ్చటివారినిగూడ వస్త్రములతో నలంకరిం
చెను. తరువాతను సహ్యపర్వతమునకుబోయి యచ్చటనుండెడు కిన్నెరాదులగు
వారికి మంచిమంచి వస్త్రములిచ్చి యచ్చటినుండి కృతసత్కృతియై హిమవత్పర్వత
మునకు బయనమాయెను. అచ్చట నున్నవారినందఱను వస్త్రములచే సంతోషపటిచి
యచ్చటినుండి వింధ్య పర్వతమునకు బోయి యచ్చటివారికి వస్త్రములిచ్చి యచ్చటి నుండి బయలుదేతి ఋక్షవంతమను పర్వతమునకు బోయి యచ్చటనుండు
విద్యాధరాదులగువారికి వస్త్రములుబహుమానముచేసి పారిజాతపర్వతమునకు
బోయి యచ్చటి గంధర్వ సమూహమునకును సాధ్యులకును విలువగలవస్త్రములిచ్చి
సంతోషపెట్టెను. మఱియు నచ్చటనున్న మునులకును, అడవివాండ్రకును
మహాత్ములకును వారువీరను భేదము లేకుండ మానసంరక్షణను గోరువారం
దఱకును వస్త్రముల నిచ్చెను. ఇట్లు స్త్రీలకును బురుషులకును వస్త్రములిచ్చి
యగ్నిహోత్రుని పట్టణమునకు బోయి యతనికి నల్లనివస్త్రమునొసంగెను. అతనిచే సత్కృతుడై యమునిపట్టణమునకు బోయి యతనికిని యతని భక్తులకును నల్లని
వస్త్రము లిచ్చెను. అక్కడినుండి నైరుతి పట్టణమునకుబోయి యతనికి
బితాంబరమునిచ్చి యచ్చటినుండి వరుణలోకమునకు బోయి యాతనికి
దెల్లనివసమునిచ్చెను. మఱియు నావరుణుని లోకములో నున్న వారినందఱకు
వస్త్రదానముచే సంతోషింపజేసి వరుణాదులగు వారిచే రత్నములు హారములు
మొదలగువానిచే సత్కృతుడయి యచ్చటినుండి వాయులోకమునకుబోయి యతని కాకుపచ్చని వసమునిచ్చి యతని యనుజ్ఞనుంది యలకాపట్టణమునకుబోయి
యచ్చటనున్న కుబేరనికి విచిత్రవర్ణముగలవస్త్రములను నలకూబరునికి
దివ్యవస్త్రము లను నిచ్చెను. కుబేరాదులు దేవలునికి రత్నకుండలములను
కోటిసూర్య ప్రకాశమాన మగు కిరీటమును మఱియు నెన్నేని నగలను సమర్పించి
గౌరవించిరి. అచ్చటినుండి బయలుదేణి యీశానునిదగ్గఱకు బోయి యతనికిదెల్లనివస్త్రమును ప్రమథులు మొదలగు భూతగణములకు విలువగల యనేకములగు వస్త్రములను నిచ్చి వారందఱచేతను లెస్సగా సత్కరింపబడెను. ఇట్లు ధర్మాత్ముడును, కీర్తివంతుడును నగు దేవలుడు సర్వలోకములవారిని వస్త్రములచే
సంతోషపఱిచెను. అతడు మూడులోకములలో నుండువారికిని మానము
గాపాడెను. దేవాంగములను వస్త్రములచే నలంకరించిన వాడగుటచే నతనికి
దేవాంగు డనియే పేరు ప్రసిద్ధి కెక్కినది.
*సశేషం......*