శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 17 - గోపాలునికి అంధత్వము ఎప్పుడు పోతుంది?

P Madhav Kumar


🌻 *గోపాలునికి అంధత్వము ఎప్పుడు పోతుంది?* 🌻

🍃🌹మూర్ఛబోయిన గోపాలుడు మూర్ఛనుండి తేరుకొన్నాడు. అతడు అంధుడయి పోయినాడు. 


🍃🌹వాడున్నూ శ్రీమన్నారాయణుని పవిత్రపాద పద్మముల పైబడి ‘‘స్వామీ! అంధుడయిన నాకు త్రోవ చూపుటకు ఆధారము నీవు కావా? నన్ను రక్షించవా? స్వామీ!’’ అని దీనాతిదీనముగా వేడుకొనెను. 


🍃🌹ఎవ్వరి దుఃఖాన్నీ చూడలేనివాడు కదా స్వామీ!’’ అనుగ్రహ వాక్యాలు ఈ విధంగా పలికాడు ‘‘ఓరీ కొన్ని రోజులు గడిచిన పిదప ఇదుగో ఈ పర్వతము మీదనే నేను వెలయుట జరుగను. 


🍃🌹నీవు అప్పటి వరకు మాత్రము అంధుడవయి యుండవలెను. అది తప్పదు. అప్పటి నా అవతార దర్శన మాత్రముననే నీకు అంధత్వము పోవును’’ అని శ్రీమహావిష్ణువు అచ్చట నుండి బయలుదేరి వెళ్ళిపోయినాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat