చెమటలు పట్టే విగ్రహం...!! శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు

P Madhav Kumar

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు. 


🌿108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. 


🌸తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపుసమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది. 


🌿ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవెల్ అనే పేరుగూడా వున్నది.


🌸ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వెళుతూ వుండగా స్వామివారు గరుడ వాహనం మీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.


🌿స్వామి వారు ఈ సమయంలో  ఒక చిక్కు పరిస్థితిలో పడతారు, అదేమిటంటే గరుడవాహనం యొక్క వేగం హంసవాహనం కన్నా అధికం తానెక్కిన గరుడ వాహనం వెళితే అమ్మవారు వెనక బడిపోతుంది.


🌸అది గ్రహించిన గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు, నేను అమ్మవారు ఎక్కిన హంస వాహనం కన్నా ముందుకి వెళ్లను, తగిన వేగంతో వెళ్తూ హంసవాహనం వెనకాలే వెళతాను.


🌿ఈ ఊరేగింపు లో ఒక విచిత్రం జరుగుతుంది. అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది.


🌸అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది.


🌿2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది. 3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది. 4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.


🌸5వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మోయాల్సుంటుంది. 5 ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది. 


🌿ప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందు వెళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూ వుంటుంది.


🌸ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి.


🌿గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువు వుండి క్రమంగా పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు.


🌸తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలోని ఈ గరుత్మంతుని కాలగారుడన్ అని పిలుస్తారు.


🌿ఈ అద్భుతఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 2సార్లు జరుగుతుంది. 


🌸మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏవిధంగా ధరిస్తాడో తెలుసుకుందాం.


🌷ఆదిశేషుడు – తన కంకణంగా


🌷కర్కోటకుడు – తాను ధరించే పూలదండగా


🌷పద్మనాభుడు – తన కుడిచెవి ఆభరణంగా


🌷మహా పద్ముడు – ఎడమచేతి ఆభరణంగా


🌷శంఖపాలుడు – తన కిరీటం ఆభరణంగా


🌷గుళికుడు – కుడి చేయి గాజులాగా


🌷తక్షకుడు – వడ్డాణంగా


🌷వాసుకి – జంధ్యంగా


🌿ఇక తొమ్మిదవ సర్పం..ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని వుంటుంది..స్వస్తీ....🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat