*18.భాగం*
సూతు- మునులారా ! తరువాతను దేవాంగుడు యధావిధిగా ప్రజలను
పాలించుచుండెను. ఆతడింద్రు ఆమరావతిని బాలించునట్లు పాలించుచుండగా
బ్రలందఱును గడుపున బుట్టినబిడ్డలవలె సంతోషించుచుండిరి. ప్రజలు నానాటికీ వృద్ధి నొందుచుండిరి. భూమి ఫలవంత మయినది. గుణవంతుడగు పెనిమిటి
దొరకినప్పుడు స్త్రీ సంతోషించునట్లు భూమి సంతోషించుచుండెను. కాలము తప్పక వానలు కురియుచుండెను. ఏజంతవునకును బీడలేదు. ప్రజలు విద్యావినయ
సంపన్నులైరి. బ్రాహ్మణాదులు తమతమవర్ణధర్మముల నాచరించుచుండిరి.
అందఱును మంచివారు. గోపోషణముందాసక్తులు సదాచారతత్పరులు పురాణ
ములయందాసక్తి గలవారు. అందఱుకును జ్ఞానమునం దభిలాషయొక్కుడాయెను.
మఱియు నాతని రాజ్యమందుదుర్మార్గులు, దుఃఖతులు, దరిద్రులు, కుంటివాండ్రు,గ్రుడ్డివాండ్రు, రోగులు, గొడ్డువాండ్రు మొదలగునింద్యులు లేరు.
పిన్నలకు పెద్దలు
త్తరక్రియలు చేయునవసరము తటస్థింపలేదు. పతివ్రతాధర్మము బాగుగా నుండెను.ఎక్కడ జూచి నను కలహమనుమాటయే లేదు. మత్సరము లేదు. లోభితన మెట్టిదో అతని ప్రజలకు దెలియదు.ఆకస్మికభయాదులు లేనేలేవు. అందఱును సంతోషించుచు నన్యోన్య ప్రేమగా నుండెడివారు. ఇట్లు సర్వానందకరముగా రాజ్య
మేలుకొనుచుండగా నాదేవాంగ మహారాజునకు దివ్యాంగుడు, విమలాంగుడు,
ధవళాంగుడునని ముగ్గురు కొడుకులు పుట్టి యగ్ని హోత్రత్రయమువలె వారు
పెరుగుచుండిరి. తలిదండ్రులాకొడుకులచే జాల సంతోషమును బొందుచుండిరి.
దేవాంగుడు సకాలమున వారికి జాతకర్మాది క్రియలు నిర్వర్తించుచుండెను. వారు
సర్వవిద్యలును నేర్చుకొనిరి. ధర్మాసక్తులు, వారుక్రమముగా యౌవనవంతులయిరి.
వారికి మేనమామయగు సూర్యుని కుమారితలను స్వర్ణప్రభ, పద్మాక్షి, చపలాక్షి
యనుబాలికలను దెచ్చి తండ్రి వివాహములు చేసెను. దేవాంగుడును దేవదత్తయును
కుమారులను గోడండ్రను జూచుకొని చాల సంతోషించుచుండిరి. తరువాతను దేవాంగుడు పెద్దకుమారుడగు దివ్యాంగునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేసెను.అతడు బుద్ధిమంతుడు గనుక మంత్రులతో గూడి యధావిధిగా రాజ్యమేలుచుండెను. మునులారా ! దేవాంగుడు శేషునికూతురగు చంద్రరేఖయందు
సర్వలక్షణసంపన్నుడును ధర్మాత్ముడును మహాబలుడును నగుసుధర్ముడను పేరుగల
కుమారుని గనెను. అతడు శుక్లపక్షపుచంద్రునివలె వృద్ధినొందుచుండెను.
తరువాతను కరూశదేశాధిపతి యగు శూరసేనుడు గర్వించి దేవాంగునిరాజ్యమంతయు క్షోభింప జేసెను. వాడు చేసిన యపకారముసంగతి యంతయు దెలిసికొని తనపరాక్రమముచే వానిని రణరంగమునకు బలి యిచ్చి ధర్మవర్ధనుండగు తనకుమారుని సుధర్ముడను వానిని వానిరాజ్యమును స్థాపించెను.ఆకుమారుడును పుండరీకపురమునం దభిషిక్తుడై తండ్రివలెనే ధర్మముగా బాలించుచుండెను. తరువాతను కరూశాధిపతి యగుసుధర్ముడనువాని కవంతిరాజ కూతురును పుష్కల యనుదానిని దెచ్చి దేవాంగుడు పెండ్లి చేసెను. నిర్వర్ధపరాక్రమ
నిధి యగుసుధర్ముడాసుందరితో గూడి సర్వభోగముల ననుభవించుచు
యధాన్యాయముగా రాజ్య మేలుకొనుచుండెను. దేవాంగుడును దక్కినపుత్రులతో
గూడి తనరాజ్యమును పరిపాలించుకొనుచుండెను.
*సశేషం.......*